flipkart big deal on PTron Jazz Pro 160w soundbar
మీ స్మార్ట్ టీవీ కోసం తగిన బడ్జెట్ సౌండ్ బార్ కోసం చూస్తున్నారా? అయితే, ఈ రోజు మీకోసం ఒక బెస్ట్ ఆప్షన్ ను అందిస్తున్నాము. 160W పవర్ ఫుల్ సౌండ్ అందించే లేటెస్ట్ Soundbar ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ HDMI Arc మరియు ఆప్టికల్ తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉండటమే కాకుండా Deep BASS సౌండ్ కూడా అందిస్తుంది.
PTron యొక్క Jazz Pro సిరీస్ నుంచి రీసెంట్ గా విడుదల చేసిన 160W సినిమాటిక్ సౌండ్ బార్ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ రూ. 5,499 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 1,500 రూపాయల డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 3,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ బడ్జెట్ ధరలో సబ్ ఉఫర్ తో డీప్ బాస్ మరియు 160 W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది.
Also Read: Amazon Nova Sonic: మరింత అనువైన AI వాయిస్ మోడల్ అందించిన అమెజాన్.!
పీట్రాన్ యొక్క ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 160W టోటల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 3 EQ మోడ్స్ కలిగి ఉంటుంది మరియు సినిమాటిక్ సరౌండ్ సౌండ్ అందిస్తుందని పీట్రాన్ తెలిపింది.
ఈ పీట్రాన్ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ 5.3 (A2DP, AVDTP, AVDTP, AVRCP) కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ పీట్రాన్ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.1 రేటింగ్ ను మరియు మంచి రివ్యూ లను అందుకుంది. అయితే, ఈ సౌండ్ బార్ Dolby లేదా DTS వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కలిగి ఉండకపోవడం లోటుగా చెప్పవచ్చు.
అయితే, ఈ సౌండ్ ప్రస్తుతం లభిస్తున్న ఆఫర్ ప్రైస్ సెగ్మెంట్ లో ఎదురులేని పోటీదారుడు గా నిలుస్తుంది. ఎందుకంటే, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో 160W సౌండ్ మరియు మల్టీ కనెక్టివిటీ అందించే సౌండ్ బార్ ఇదొక్కటి మాత్రమే.