flipkart BBD sale offer big deal on 180W Dolby Soundbar today
ఫ్లిప్ కార్ట్ 2025 పండుగ సీజన్ ఆఫర్స్ ఇప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. 2025 దసరా మరియు దీపావళి పండుగ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఈ పండుగ సీజన్ సేల్ కంటే ముందే ఈరోజు లేటెస్ట్ 180W Dolby Soundbar భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 4,950 ఆఫర్ రేటుకే లభిస్తుంది.
GOVO యొక్క లేటెస్ట్ డాల్బీ డిజిటల్ సౌండ్ బార్ GO SURROUND 860 సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ డీల్ అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పై ఈరోజు 72% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,499 రూపాయల ఆఫర్ ధరకే లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది.
ఈ సౌండ్ బార్ ను Axis, ICICI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 4,950 ఆఫర్ రేటుకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో మంచి సౌండ్ అందించే సౌండ్ బార్ డీల్స్ లో ఒకటిగా ఉంటుంది.
Also Read: Amazon GIF Sale 2025 సేల్ నుంచి రూ. 43,999 ధరకే iPhone 15 అందుకోండి.!
ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 180W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది మంచి ప్రీమియం డిజైన్ తో మీ స్మార్ట్ టీవీ కి తగిన పార్ట్నర్ అవుతుంది. ఇది నాలుగు పవర్ ఫుల్ 2 ఇంచ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో 3D Surround సౌండ్ అందించవచ్చని గోవో తెలిపింది.
గోవో 180W సరౌండ్ 860 సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఇది సినిమా థియేటర్ వంటి మంచి సరౌండ్ సౌండ్ మరియు డీప్ బాస్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ బ్లూటూత్ 5.3, HDMI Arc, AUX, USB మరియు ఆప్టికల్ ఇన్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది మ్యూజిక్ వినడానికి మరియు స్మార్ట్ టీవీ తో కనెక్ట్ చేసి మూవీలు ఎంజాయ్ చేయడానికి కూడా తగినదిగా ఉంటుంది.