flipkart announced big deal on Sony 5.1 Dolby soundbar from Republic Day Big Bonanza
2025 రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart ఈరోజు నుంచి Republic Day Big Bonanza సేల్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి Sony 5.1 Dolby సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇంటిని షేక్ చేసే పవర్ ఫుల్ 600W RMS సౌండ్ అందించే 5.1 ఛానల్ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరకు అందుకునే అవకాశం వుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు అందించిన ఈ జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేయండి.
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే బిగ్ బొనాంజా సేల్ జనవరి 22 నుంచి జనవరి 26వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సేల్ నుంచి ఈరోజు SONY HT-S40R 5.1ch సౌండ్ బార్ పై గొప్ప డిస్కౌంట్ అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్లో రూ. 34,990 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 11,002 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకొని రూ. 23,988 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది.
కేవలం పైన తెలిపిన డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై మరో గొప్ప ఆఫర్ కూడా అందించింది. అదేమిటంటే, ఈ సోనీ సౌండ్ బార్ ను డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేస్తే రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 21,988 ధరకే అందుకోవచ్చు.
Also Read: ఈ Jio Plan తో రీఛార్జ్ చేస్తే లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ Paatal Lok 2 సిరీస్‌ని ఉచితంగా చూడవచ్చు.!
ఈ సోనీ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే 600W RMS సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సోనీ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు ఇందులో 3 స్పీకర్లు కలిగిన బార్, 2 వైర్లెస్ రియర్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Sony S-Master Amplifier ను కలిగి ఉంటుంది.
ఈ సోనీ సౌండ్ బార్ Dolby Digital, Dolby Audio, Dolby Dual mono, LPCM 2ch మరియు LPCM fs(48kHz) ఫీచర్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ ఆప్టికల్ HDMI, USB, బ్లూటూత్ మరియు ఆడియో ఇన్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.