Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఏకంగా 14 వేల భారీ డిస్కౌంట్ అందుకోండి.!
Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఊహించనంత తక్కువ ధరలో లభిస్తోంది
ఫ్లిప్ కార్ట్ కొత్తగా అందించిన SASA LELE సేల్ నుంచి ఈ ఆఫర్ ను అందించింది
ప్రీమియం సౌండ్ టెక్నాలజీతో అందించిన జెబ్రోనిక్స్ లేటెస్ట్ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ ప్రకటించింది
Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఈ రోజు అతి భారీ డిస్కౌంట్ తో ఊహించనంత తక్కువ ధరలో లభిస్తోంది. భారీ సరౌండ్ స్పీకర్ సెటప్ మరియు డాల్బీ అట్మోస్ ప్రీమియం సౌండ్ వంటి ప్రీమియం సౌండ్ టెక్నాలజీతో అందించిన జెబ్రోనిక్స్ లేటెస్ట్ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ కొత్తగా అందించిన SASA LELE సేల్ నుంచి ఈ ఆఫర్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ లతో ఈ సౌండ్ బార్ ఆల్ టైమ్ చవక ధరలో మీకు లభిస్తుంది.
SurveyZebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ గత సంవత్సరం రూ. 34,999 రూపాయల లాంచ్ ప్రైస్ తో ఇండియాలో విడుదల చేయబడింది. అయితే, ఈ రోజు ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ ను రూ. 13,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 21,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై రూ. 1,250 రూపాయల అదనపు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సిక్సోవుంట్`డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

ఈ రోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 20,749 రూపాయల అతి చవక ధరలో అందుకోవచ్చు. ఈ సౌండ్ బార్ లాంచ్ అయిన తర్వాత ఇంత చవక ధరలో లభించడం చూడలేదు. బ్యాట్ ధరలో ప్రీమియం సౌండ్ బార్ కోసం చూస్తుంటే, ఈ సౌండ్ బార్ డీల్ ను చూడవచ్చు.
Also Read: నెవర్ బిఫోర్ ఆఫర్: ZEBRONICS 5.1 Dolby సౌండ్ బార్ ను 6 వేలకే అందుకోండి.!
Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఇక ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ విషయానికి వస్తే, ఇది కంపెనీ లేటెస్ట్ గా అందించిన ప్రీమియం సౌండ్ బార్. ఈ సౌండ్ బార్ 7.1.2 ఛానల్ తో పూర్తి సరౌండ్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ జేబ్రోనిక్స్ సౌండ్ బార్ తో వచ్చే బార్ పై భాగంలో నాలుగు అప్ ఫైరింగ్ స్పీకర్లు, ముందు భాగంలో మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు రెండు వైపులా సైడ్ లో కూడా సైడ్ ఫైరింగ్ స్పీకర్స్ కూడా కలిగి ఉంటాయి. ఈ సౌండ్ బార్ తో జతగా హెవీ సౌండ్ అందించే 12 ఇంచ్ హెవీ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఇది సౌండ్ బార్ టోటల్ 900W జబర్దస్త్ సౌండ్ ఆవుట్ పుట్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ సౌండ్ విషయానికి వస్తే, ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ మరియు ZEB Acoustics Max మల్టీ డైమెన్షనల్ ఫీచర్ కూడా ఉన్నతయు`ఉన్నాయి. ఈ ఫీచర్స్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI (ARC), ఆప్టికల్ ఇన్, AUX, USB మరియు బ్లూటూత్ వంటి పూర్తి కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile