Flipkart సేల్ ధమాకా: Dolby Atmos సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్స్..!!
ఈరోజు నుండి మొదలైన ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్
ఈ సేల్ మే 3 నుండి మే 8వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది
Dolby Atmos సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది
ఈరోజు నుండి మొదలైన ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్. ఈ సేల్ మే 3 నుండి మే 8వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ నుండి ఫ్లిప్ కార్ట్ Dolby Atmos సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. కేవలం రూ.7,999 రూపాయల ప్రారంభ ధరలో కూడా డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ను ఈ సేల్ నుండి మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్లు మరియు మరిన్ని ఇతర ఆఫర్లను కూడా పొందవచ్చు. మరి ఆ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఏమిటో చూసేద్దామా.
SurveyZeb-Juke Bar 3850 PRO:
Zebronics యొక్క 3850 PRO Dolby Atmos సౌండ్‌బార్ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి 67% డిస్కౌంట్ తో కేవలం రూ.7,999 రూపాయలకే లభిస్తోంది. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
ఇక ఫీచర్ల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్‌లో క్వాడ్ 2.5 ఇంచ్ స్పీకర్ మరియు డ్యూయల్ 2 ఇంచ్ డ్రైవర్లు ఉన్నాయి. అయితే, సౌండ్‌బార్‌తో పాటు సెపరేట్ సబ్ వూఫర్ యూనిట్ మాత్రం ఉండదు. కానీ, ఈ సౌండ్‌బార్ 170W సౌండ్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు మంచి మూవీ ఎక్స్ పీరియన్స్ అందించగలదు. ఈ సౌండ్ బార్ Dolby Atmos తో మీ సంగీత మరియు సినిమా వినోదాన్ని మరింత పెంచుకోవచ్చు. Zeb-Juke Bar 3850 PRO సౌండ్‌బార్‌తో మీ ఇంటిలోనే హై-ఫిడిలిటీ సౌండ్ మరియు సినిమా ధియేటర్ వంటి Atmos సౌకర్యాన్ని పొందవచ్చు.
Zeb-Juke Bar 9800DWS Pro:
జీబ్రానిక్స్ యొక్క మరొక డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Zeb-Juke Bar 9800DWS Pro ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి 69% డిస్కౌంట్ తో కేవలం రూ.16,999 రూపాయలకే లభిస్తోంది. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
మల్టీ ఛానల్ సరౌండ్ సెట్టింగ్ కోసం వైర్లతో కూడిన స్పీకర్లతో చిక్కుబడ్డ గజిబిజిని తప్పించుకోవచ్చు. ఎందుకంటే, ఈ సౌండ్‌బార్ సరళమైన డిజైన్‌లో సూపర్ సౌండ్ అందించేలా రూపొందించబడింది. ఇది ఎటువంటి వైర్ అవసరం లేకుండా, లీనమయ్యే ఆడియో అనుభవాన్ని అందిస్తుంది మరియు చాలా సులభమైన సెటప్ తో వస్తుంది.
ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, సౌండ్‌బార్‌లో ఇబ్బంది లేని సెటప్ మాత్రమే కాదు, మల్టి-కనెక్టివిటీ ఎంపికలతో కనెక్ట్ అవ్వడానికి చాలా సులభమైన మార్గం అందించింది. USB / AUX ఉపయోగించి మీ ఫోన్‌ను వైర్‌లెస్‌గా ప్రసారం చెయ్యవచ్చు. మీరు HDMI (ARC) లేదా ఆప్టికల్ ఇన్‌పుట్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు మరియు ఇబ్బంది లేకుండా కనెక్ట్ చేయవచ్చు. సౌండ్ బార్ ఒక HDMI అవుట్‌పుట్‌తో పాటు డ్యూయల్ HDMI ఇన్‌పుట్‌తో వస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile