Devialet Mania opera రఫ్ పోర్టబుల్ Hi-Fi స్పీకర్ లాంచ్ అయ్యింది.. ధర తెలిస్తే షాక్ అవుతారు.!

Updated on 07-Nov-2025
HIGHLIGHTS

Devialet Mania opera రఫ్ పోర్టబుల్ స్మార్ట్ స్పీకర్ ఇండియాలో లాంచ్ అయ్యింది

ది కాంపాక్ట్ సైజులో ఉండే పోర్టబుల్ Hi-Fi స్పీకర్ మరియు రఫ్ యూసేజ్ కూడా తట్టుకుంటుంది

ప్యూర్ ఆడియో సపోర్ట్ మరియు మరిన్ని ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది

Devialet Mania opera రఫ్ పోర్టబుల్ స్మార్ట్ స్పీకర్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇది కాంపాక్ట్ సైజులో ఉండే పోర్టబుల్ Hi-Fi స్పీకర్ మరియు రఫ్ యూసేజ్ కూడా తట్టుకుంటుంది. అంతా బాగానే ఉంది కానీ ఈ స్పీకర్ కావాలంటే మాత్రం అక్షరాలా లకారం సమర్పించుకోవాలి. అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ప్రీమియం స్పీకర్ అని. మరి ఈ కొత్త అల్ట్రా ప్రీమియం స్మార్ట్ స్పీకర్ ధర మరియు ఫీచర్లు ఏమిటో చూద్దామా.

Devialet Mania opera Hi-Fi Speaker: ప్రైస్

ఈ పోర్టబుల్ రఫ్ ఓపెరా స్మార్ట్ స్పీకర్ లిమిటెడ్ ఎడిషన్ రూ. 1,24,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ స్పీకర్ ప్రైస్ చూడగానే మీ కళ్ళు పెద్దవయ్యాయి కదా. అవును, ఈ స్పీకర్ చాలా ప్రీమియం లిమిటెడ్ ఎడిషన్ మరియు ప్యూర్ ఆడియో సపోర్ట్ మరియు మరిన్ని ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: Samsung Dolby సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ తో 6 వేలకే లభిస్తోంది.!

Devialet Mania opera Hi-Fi Speaker: ఫీచర్స్

ఈ స్పీకర్ యాక్టివ్ స్టీరియో కాలిబ్రేషన్ (ASC) కలిగిన స్పీకర్ మరియు ఇది 30Hz -20kHz సౌండ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ విడ్త్ తో వసుంది. ఇది ప్యూర్ సౌండ్ కోరుకునే వారికి తగిన స్పీకర్ మరియు ఇది కంప్లీట్ 360° స్టీరియో సౌండ్ ఆఫర్ చేస్తుంది. ముఖ్యంగా ఈ స్పీకర్ అన్ని దిశల నుంచి పాట వినిపించేలా రూపొందించబడింది మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందిస్తుంది. ఈ ప్రీమియం స్పీకర్ రూమ్ మొత్తం సౌండ్ తో నింపుతుంది.

ఈ స్పీకర్ కలిగిన స్పీకర్ సెటప్ విషయానికి వస్తే, ఇందులో 4 ఫుల్ రేంజ్ అల్యూమినియం స్పీకర్లు మరియు 2 సబ్ ఉఫర్స్ ఉంటాయి. ఇది గతి ఆకృతి మరియు రూమ్ పరిమాణం ఆధారంగా సౌండ్ ను అందించే ASC సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. అంటే, అంటే ఈ స్పీకర్ ఉంచిన గదిని బట్టి సౌండ్ కాలిబ్రేషన్ చేసుకుంటుంది.

ఈ మానియా ఓపెరా పోర్ట్రబుల్ స్పీకర్ కలిగిన స్పీకర్ సామర్థ్యాన్ని మెరుగ్గా వినియోగించి సౌండ్ క్వాలిటీ మరింత పెంచుతుంది దీనికోసం స్మార్ట్ యాక్టివ్ మ్యాచింగ్ (SAM) ఫీచర్ ఉపయోస్తుంది. ఈ స్పీకర్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ వెర్షన్ 5.0 సపోర్ట్ తో వస్తుంది. ఇది AirPlay 2 మరియు Spotify లకు నేరుగా సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు. ఈ స్పీకర్ A2DP మరియు AVRCP ప్రొఫైల్స్ తో పాటు AAC మరియు SBC ఆడియో కోడెక్స్ కలిగి ఉంటుంది. ప్రీమియం సౌండ్ మరియు ప్రీమియం మోడల్ స్పీకర్ కోరుకునే యూజర్ల కోసం ఈ స్పీకర్ తగిన విధంగా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :