Detel సంస్థ ఇండియాలో తన మొట్టమొదటి ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది

HIGHLIGHTS

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు పేటిఎం మాల్ నుండి కొనుగోలు చేయవచ్చు.

డిటెల్ తన సరికొత్త బ్లూటూత్ ఇయర్‌బడ్స్ – డి- ప్యాడ్‌ ను ప్రారంభించడంతో, ట్రూ వైర్‌లెస్ స్టీరియో ప్రపంచంలోకి ప్రవేశించింది. ఈ ప్రోడక్ట్ ను రూ .2,199 ధరతో అందించింది. దీనిని డిటెల్ యొక్క వెబ్‌ సైట్, మొబైల్ యాప్ మరియు ప్రధాన e కామర్స్ ప్లాట్‌ ఫారమ్స్ అయినటువంటి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు పేటిఎం మాల్ నుండి కొనుగోలు చేయవచ్చు.

డిటెల్ ఇయర్‌ బడ్స్‌లో బ్లూటూత్ వెర్షన్ 5.0+ ఆటో యాడ్ మరియు 10 మీటర్ల వరకు కనెక్టివిటీ పరిధి ఉంటుంది. ఈ ఇయర్‌ బడ్స్ 300 mAh బ్యాటరీతో మీకు బ్యాకప్ అంధిస్తాయి. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 1-2 గంటలు సమయం పడుతుంది మరియు ఇవి 5 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్నిఅందిస్తుంది. ఈ ఇయర్‌ బడ్స్  IPX 4 రేటింగులతో వస్తాయి. అంటే, నీటి తుంపరలు మరియు చెమట నుండి రక్షణను అందిస్తుంది. కాబట్టి,  మీ ఫిట్‌నెస్ సమయంలో కూడా చక్కని సంగీతాన్ని వినడానికి ఉపయోగించవచ్చు.

కనెక్టివిటీ ఎంపికల పరంగా, వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేని మ్యూజిక్ ఆస్వాదించడానికి ఈ ఇయర్‌బడ్స్‌ను బ్లూటూత్‌ తో కనెక్ట్ చేయవచ్చు మరియు డ్యూయల్ కాలింగ్ ఫంక్షనాలిటీని కూడా ఉపయోగించవచ్చు. ఈ “మేక్ ఇన్ ఇండియా” వైర్‌లెస్ ఇయర్‌ బడ్స్ ప్రతి సంగీత ప్రియుల కోసం రూపొందించబడ్డాయి. ఈ వైర్‌ లెస్ డి పాడ్స్  గూగుల్ అసిస్టెంట్ మరియు సిరి వంటి వర్చువల్ అసిస్టెంట్‌తో ముందే లోడ్ చేయబడ్డాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :