cheapest 3.1.2 Dolby Atmos soundbar deal under 8k today
కేవలం 8 వేల బడ్జెట్ లోనే 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి. ఈ మాట అంటోంది నేను కాదు ఫ్లిప్ కార్ట్. ఈరోజు బ్రాండెడ్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ను భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో 8 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ డీల్స్ నుంచి అనౌన్స్ చేసింది. అతి చవక ధరలో స్మార్ట్ టీవీకి జతగా సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ అందించే సౌండ్ బార్ కోసం చూస్తున్న వారు ఈ రోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్ ను చూడవచ్చు.
బోట్ యొక్క 3.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ రోజు ఈ అతి తక్కువ ధరలు ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 83% భారీ డిస్కౌంట్ ధరతో కేవలం రూ. 9,499 రూపాయల ధరలో సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను బ్యాంక్ అఫ్ బరోడా క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 950 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్స్ తో బోట్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కేవలం రూ. 8,549 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.
ఈ బోట్ సౌండ్ బార్ 3.1.2 సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు నాలుగు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ కలిగిన ప్రీమియం బార్ మరియు గొప్ప బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ కలిగిన పూర్తి స్పీకర్ సెటప్ తో మొత్తంగా 300W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది మంచి లుక్స్ ప్రీమియం సెటప్ తో వస్తుంది.
ఈ సౌండ్ బార్ 3.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కలిగిన ప్రత్యేకమైన స్పీకర్ సెటప్ మరియు డాల్బీ అట్మాస్ ఫీచర్ తో మంచి 3D సౌండ్ తో సినిమా థియేటర్ అనుభూతిని ఇస్తుంది. అంతేకాదు, మంచి ఫీల్ కోసం ముందుగా ప్రీ సెట్ చేసిన ఆడియో మోడ్స్ తో కూడా వస్తుంది. ఇందులో HDMI, COAXIAL, ఆప్టికల్ ఇన్, USB, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీలు కూడా ఉన్నాయి.
Also Read: Jio Free Offer: మీరు జియో యూజర్ అయితే ఈ 18 నెలల ఉచిత ఆఫర్ అందుకోండి.!
ఇది ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.1 రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది. ఈరోజు ఈ సౌండ్ బార్ లిస్ట్ అయిన ధరతో పోలిస్తే చవక ధరలో ఈ సెటప్ కలిగిన ఏకైక డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ గా నిలుస్తుంది.