అండర్ రూ. 5000 ధరలో Dolby Atmos హెడ్ ట్రాకింగ్ బడ్స్ లాంచ్ చేసిన boAt.!

Updated on 10-Jul-2025
HIGHLIGHTS

boAt ఇండియన్ మార్కెట్లో గొప్ప ఇయర్ బడ్స్ సెట్ లాంచ్ చేసింది

భారీ ఫీచర్స్ మరియు Dolby Atmos హెడ్ ట్రాకింగ్ ఫీచర్ తో boAt Nirvana Ivy Pro బడ్స్ లాంచ్ చేసింది

హెడ్ ట్రాకింగ్ సపోర్ట్ తో గొప్ప సరౌండ్ మరియు మనసును దోచుకునే సౌండ్ అందిస్తుంది

boAt ఇండియన్ మార్కెట్లో గొప్ప ఇయర్ బడ్స్ సెట్ లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన బోట్ బ్రాండ్ ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ యూజర్ ను టార్గెట్ చేసి అనేక బడ్స్ అందించింది. ఇప్పుడు కూడా ఇదే దారిలో భారీ ఫీచర్స్ మరియు Dolby Atmos హెడ్ ట్రాకింగ్ ఫీచర్ తో కేవలం రూ. 5000 బడ్జెట్ ధరలో కొత్త బడ్స్ boAt Nirvana Ivy Pro బడ్స్ లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ బడ్స్ ఫీచర్స్ మరియు ప్రైస్ తెలుసుకోండి.

boAt Nirvana Ivy Pro : Dolby Atmos బడ్స్

బోట్ ఈ కొత్త ఇయర్ బడ్స్ ని కేవలం రూ. 4,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ అమెజాన్ మరియు బోట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చింది.

boAt Nirvana Ivy Pro : ఫీచర్స్

ఈ బోట్ నిర్వాణ ఐవీ ప్రో ఇయర్ బడ్స్ ని బడ్జెట్ ధరలో చాలా ప్రీమియం ఫీచర్స్ తో బోట్ విడుదల చేసింది. నిర్వాణ ఐవీ ప్రో బడ్స్ ను 11mm ఉఫర్ జతగా 6mm ట్వీటర్ తో సెటప్ చేసిన డ్యూయల్ డైనమిక్ డ్రైవర్ స్పీకర్ సెటప్ తో అందించింది. ఈ సెటప్ తో మంచి బాస్ సౌండ్ మరియు క్రిస్పీ ట్రెబెల్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ బడ్స్ ను బోట్ సిగ్నేచర్ సౌండ్ తో పాటు గ్రామీ అవార్డు అందుకున్న LUCA చేత కో ట్యూన్ చేసి అందించింది.

ఈ బోట్ కొత్త ఇయర్ బడ్స్ డాల్బీ అట్మోస్ మరియు హెడ్ ట్రాకింగ్ సపోర్ట్ తో గొప్ప సరౌండ్ మరియు మనసును దోచుకునే సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ LDAC, Hi-Res Audio మరియు అడాప్టివ్ ఈక్వలైజర్ సపోర్ట్ తో మరింత ఆకట్టుకునే సౌండ్ అందిస్తుంది. ఈ బడ్స్ లాంచ్ అయిన ధరలో ఈ కంప్లీట్ ఫీచర్స్ కలిగిన బెస్ట్ బడ్స్ గా వచ్చింది.

Also Read: Prime Day Early Day Deal: 10 వేలకే 5.2 Dolby సౌండ్ బార్ అందుకోండి.!

ఈ బోట్ బడ్స్ AI-ENx టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 6 Mics సపోర్ట్ తో మంచి కాలింగ్ సౌలభ్యం అందిస్తుంది. ఈ బడ్స్ 52dB అడాప్టివ్ హైబ్రిడ్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫీచర్ తో బయట సౌండ్స్ చెవికి చేరకుండా నిలువరించి గొప్ప లీనమయ్యే సౌండ్ మరియు కాలింగ్ అందిస్తుంది. ఈ బడ్స్ IPX5 రేటింగ్, 50ms లో లో లెటెన్సీ, boAt Hearables యాప్ సపోర్ట్ మరియు ASAP ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ టోటల్ 42 గంటల ప్లే టైమ్ అందిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :