Dolby Audio సౌండ్ టెక్నాలజీ తో కొత్త సౌండ్ బార్ లాంచ్ చేసిన boAt

Updated on 19-Aug-2025
HIGHLIGHTS

boAt ఇండియాలో కొత్త సౌండ్ బార్ లాంచ్ చేసింది

ఈ సౌండ్ బార్ ని Dolby Audio సౌండ్ టెక్నాలజీ తో లాంచ్ చేసింది

బోట్ ఈ సౌండ్ బార్ ని స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ తో అందించింది

ప్రముఖ ఇండియన్ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ boAt ఇండియాలో కొత్త సౌండ్ బార్ లాంచ్ చేసింది. అదే Aavante 2.1 2000D సౌండ్ బార్ మరియు ఈ సౌండ్ బార్ ని Dolby Audio సౌండ్ టెక్నాలజీ తో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ధర, స్పెక్స్ మరియు కంప్లీట్ ఫీచర్స్ ఇక్కడ చూడవచ్చు.

ఏమిటా boAt Dolby Audio సౌండ్ బార్?

బోట్ ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ సౌండ్ బార్ Aavante 2.1 2000D గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. బోట్ ఈ సౌండ్ బార్ ని స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ తో అందించింది.

boAt Aavante 2.1 2000D ప్రైస్ ఏమిటి?

బోట్ అవాంటే 2.1 2000D సౌండ్ బార్ ను 8,499 ధరతో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా మరియు బోట్ అఫీషియల్ సైట్ నుంచి అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ పై పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 7,650 ధరలో అమెజాన్ నుంచి పొందవచ్చు.

Also Read: ChatGPT Go : భారతీయ యూజర్ల కోసం ప్రీమియం ఫీచర్స్ తో చవక ప్లాన్ లాంచ్.!

boAt Aavante 2.1 2000D ఫీచర్స్ ఏమిటి?

బోట్ అవాంటే 2.1 2000D సౌండ్ బార్ పేరు సూచించినట్లు 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో స్లీక్ డిజైన్ మరియు నాలుగు స్పీకర్లు కలిగిన బార్ మరియు పెద్ద 6.5 ఇంచ్ ఉఫర్ కలిగిన సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 2000W RMS సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ బోట్ సౌండ్ బార్ గోడకు తగిలించే విధంగా కూడా డిజైన్ చేయబడింది.

ఈ బోట్ లేటెస్ట్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో కూడా మంచి లీనమయ్యే సరౌండ్ సౌండ్ అందిస్తుందని బోట్ తెలిపింది. ఈ సౌండ్ బార్ మ్యూజిక్, న్యూస్ మరియు మూవీ మూడు ప్రీ సెట్ ఈక్వలైజర్ మరియు ఫంక్షన్ రిమోట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.4, AUX, ఆప్టికల్ ఇన్ పుట్, HDMI (ARC), మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వచ్చింది. ఈ సౌండ్ బార్ బోట్ సిగ్నేచర్ సౌండ్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :