boAt 5.1.2 Dolby Atmos got big deals from flipkart
boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు మీకు చాలా చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఎన్నడూ చూడని చవక ధరలో లభిస్తుంది. లాంచ్ ధరతో పోలిస్తే ఈ సౌండ్ బార్ ఈరోజు మీకు తక్కువ లో తక్కువ 10 వేల రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.
బోట్ ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన సౌండ్ బార్ Aavante Prime 5.1.2 5050DA పై ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 16,999 రూపాయల ధరతో విడుదల అయ్యింది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 5,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 11,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.
ఈ సౌండ్ బార్ పై 10% భారీ అదనపు బ్యాంక్ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ సౌండ్ బార్ ని Federal, BOB CARD EMI, PNB, HDFC మరియు HSBC బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు ఛీ వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ మీకు కేవలం రూ. 10,800 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఇది ఈ సౌండ్ బార్ లాంచ్ తర్వాత లభించే అతి చవక ధర అవుతుంది.
Also Read: Truecaller Voicemail: ఆండ్రాయిడ్ యూజర్లకు ఉచితంగా AI ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ వచ్చేసింది.!
ఈ బోట్ సౌండ్ బార్ 5.1.2 సౌండ్ సెటప్ కలిగి ఉంటుంది. అంటే, ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు 6 స్పీకర్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. ఈ బార్ తో పాటు డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కూడా ఉంటాయి. ఈ సౌండ్ బార్ పూర్తి సరౌండ్ సెటప్ తో ఉండటమే కాకుండా 550W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది.
ఈ బోట్ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన 5.1.2 సెటప్ మరియు భారీ సౌండ్ అవుట్ పుట్ తో ఈ సౌండ్ బార్ సినిమా థియేటర్ వంటి సౌండ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో HDMI e Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.