రూ. 5,000 ధరలో బెస్ట్ సౌండ్ బార్ కోసం చూస్తున్నారా.!

Updated on 08-Jun-2023
HIGHLIGHTS

రూ. 5,000 ధరలో బెస్ట్ సౌండ్ బార్

బెస్ట్ సౌండ్ బార్ డీల్స్

తక్కువ ధరలో లభించే బెస్ట్ సౌండ్ బార్

రూ. 5,000 ధరలో బెస్ట్ సౌండ్ బార్ కోసం చూస్తున్నారా? అయితే, మేము మీకు సహాయం చేయనున్నాము. ఈరోజు రూ. 5,000 ధరలో లభిసున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ గురించి చర్చించనున్నాము. తద్వారా, మీకు తగిన బడ్జెట్ సౌండ్ బార్, అదీకూడా 5,000 రూపాయల  తక్కువ ధరలో లభించే బెస్ట్ సౌండ్ బార్ ను ఎంచుకోవడంలో సహాయం చేస్తాము. 

1. ZEBRONICS Zeb-JUKEBAR 3900

జీబ్రానిక్స్ యొక్క ఈ సౌండ్ బార్ 80W సౌండ్ అవుట్ పుట్ అందించ గలదు. ఈ సౌండ్ బార్ HDMI(ARC), Coaxial Input, AUX, USB  వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది మరియు ఈరోజు అమెజాన్ నుండి 61% డిస్కౌంట్ తో రూ. 4,699 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఈ లిస్ట్ లో తక్కువ ధరలో వచ్చే సౌండ్ బార్ మరియు సెపరేట్ సబ్ ఉఫర్ తో కూడా వస్తుంది. Buy From Here

2. Blaupunkt SBW100

ఈ బ్లూపంక్ట్ సౌండ్ బార్ 120W టోటల్ సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది మరియు సెపరేట్ సబ్ ఉఫర్ ను కూడా కలిగి వుంది. ఈ సౌండ్ బార్ కూడా AUX, HDMI-ARC, బ్లూటూత్ ,మరియు USB వంటి మల్టి కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ బ్లూపంక్ట్ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుండి 62% డిస్కౌంట్ తో రూ. 4,999 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :