best soundbar deals under rs 4000 from amazon and flipkart today
చవక ధరలో మంచి సౌండ్ అందించే Soundbar డీల్స్ కోసం చూసే వారికి తగిన బెస్ట్ డీల్స్ ఈరోజు అందిస్తున్నాము. అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన దీపావళి సేల్ నుంచి మంచి డీల్స్ కోసం చూసి పండుగ సమయంలో కొనలేక పోయిన వారు ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ పరిశీలించవచ్చు. ఈ సౌండ్ బార్ డీల్స్ మరియు ఫీచర్స్ వివరంగా అందించాము. మరి బెస్ట్ బడ్జెట్ సౌండ్ బార్ డీల్స్ ఏమిటో చూద్దామా.
ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ బెస్ట్ డీల్స్ లభిస్తున్నాయి. ఇందులో రెండు సౌండ్ బార్స్ ఉన్నాయి. వీటిలో GOVO సౌండ్ బార్ డీల్ అమెజాన్ నుంచి మరియు MOTOROLA AmphisoundX సౌండ్ బార్ డీల్స్ ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తున్నాయి. ఈ రెండు డీల్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి అందుబాటులో ఉంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన 79% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,799 అఫర్ రేటుకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో HDMI Arc, USB, AUX మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి . అంటే, ఇది స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, మొబైల్ మరియు సెటాప్ బాక్స్ వంటి అన్ని డివైజెస్ తో కనెక్ట్ చేసే విధంగా ఉంటుంది. ఈ సౌండ్ బార్ 2 రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ తో వస్తుంది. ఇది 2.1 ఛానల్ సౌండ్ బార్ మరియు టోటల్ 160W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
Also Read: ZEBRONICS Dolby సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!
ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 70% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 3,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 160W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ లో మూడు నాలుగు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ మోటోరోలా సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఇది కూడా స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, మొబైల్ మరియు సెటాప్ బాక్స్ వంటి అన్ని డివైజెస్ తో కనెక్ట్ చేసే ఆప్షన్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫుల్ కంట్రోల్ బటన్స్ కలిగిన రిమోట్ తో వస్తుంది.