best 5.2.4 Dolby Atmos soundbar deal from flipkart
ఆడియో టెక్నాలాజి లో బెస్ట్ సౌండ్ టెక్నాలాజి గా విరాజిల్లుతున్న డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ఇప్పుడు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ లు స్మార్ట్ టీవీ తో జత చేయడం ద్వారా ఇంట్లోనే సినిమా థియేటర్ వంటి సౌండ్ ను ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ప్రస్తుతం డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ లు సైతం మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈరోజు అటువంటి మంచి సౌండ్ అందించే లేటెస్ట్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఒకటి మంచి డిస్కౌంట్ తో 16 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది.
MOTOROLA ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ డాల్బీ సౌండ్ బార్ AmphisoundX Vibe ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన 76% అతి భారీ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ రూ. 17,999 ధరలో సేల్ అవుతోంది. అంతేకాదు, ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు ఈ సౌండ్ బార్ ను SBI, BOB CARD మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి రూ. 1,500 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఈ ఆఫర్స్ తో ఈ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ ని కేవలం రూ. 16,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈ ప్రైస్ లో మంచి ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: లేటెస్ట్ బెస్ట్ QD-Mini LED స్మార్ట్ టీవీ పై అమెజాన్ జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!
ఈ మోటోరోలా సౌండ్ బార్ 5.2.4 సెటప్ కలిగి ఉంటుంది మరియు ప్రీమియం డిజైన్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు మూడు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 700W సౌండ్ అవుట్ పుట్ తో గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. ఇది ఇది క్రిస్టల్ క్లియర్ సౌండ్ మరియు డీప్ బాస్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.
ఈ మోటోరోలా సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు మీకు థియేటర్ వంటి సూపర్ సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ లో HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.