best 5.1 channel soundbar deals around rs 6000 today available
బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ మరియు స్మార్ట్ ఫోన్ రెండిటికి సపోర్ట్ చేసే డీసెంట్ Soundbar కోసం చూస్తున్నారా? అయితే, ఈరోజు మీకు రెండు బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సౌండ్ బార్స్ స్మార్ట్ టీవీ కోసం మంచి సౌండ్ అందించే HDMI మరియు స్మార్ట్ ఫోన్ కోసం బ్లూటూత్ సపోర్ట్ ను కలిగి ఉంటాయి. అలాగే, ఇతర పరికరాలతో కనెక్ట్ చేయడానికి బ్లూటూత్ మరియు AUX సపోర్ట్ ఈ సౌండ్ బార్స్ కలిగి ఉంటాయి. మరి ఈ రెండు సౌండ్ బార్స్, వాటి ఆఫర్లు మరియు అవి ఎక్కడ లభిస్తున్నాయి, అన్ని వివరాలు వివరంగా చూద్దామా.
ఈరోజు చెబుతున్న రెండు సౌండ్ బార్ డీల్స్ కూడా Flipkart నుంచి లభిస్తున్నాయి. ఇందులో ఒకటి ZEBRONICS సౌండ్ బార్ కాగా రెండవది GOVO సౌండ్ బార్. ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి 69% డిస్కౌంట్ తో రూ. 6,499 ధరకు లభిస్తుంది.ఈ సౌండ్ బార్ ను BOBCARD EMI తో కొనే యూజర్లకు రూ. 649 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,850 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 200W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్ రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ HDMI(ARC), USB, AUX మరియు లేటెస్ట్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Infinix Note 50s : గొప్ప డిజైన్ మరియు అతి సన్నని కర్వుడ్ స్క్రీన్ తో లాంచ్ అవుతోంది.!
ఈ గోవో సౌండ్ బార్ కూడా ఈరోజు 66% భారీ డిస్కౌంట్ తో రూ. 6,999 ధరకే లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను BOBCARD EMI తో తీసుకునే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 6,300 ధరకే లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ కూడా 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ గోవో సౌండ్ బార్ డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ బ్యాలెన్స్డ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్ AUX, USB మరియు లేటెస్ట్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో వస్తుంది.