ఈరోజు కేవలం రూ. 6,000 ప్రైస్ సెగ్మెంట్ లో లభించే బెస్ట్ 300W Dolby Soundbar ఇదే.!

Updated on 22-Aug-2025
HIGHLIGHTS

మీ స్మార్ట్ టీవీ కోసం తగిన బడ్జెట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ డీల్

300W Dolby Soundbar ఈరోజు భారీ డిస్కౌంట్ తో కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది

సరౌండ్ సౌండ్ తో పెద్ద సైజు హాల్ ని సైతం సౌండ్ తో నింపుతుంది

మీ స్మార్ట్ టీవీ కోసం తగిన బడ్జెట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ డీల్ కోసం చూస్తుంటే, ఈరోజు ఒక బెస్ట్ సౌండ్ బార్ డీల్ మీకోసం అందుబాటులో ఉంది. ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన 300W Dolby Soundbar ఈరోజు భారీ డిస్కౌంట్ తో కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ డీప్ బాస్ మరియు మంచి సరౌండ్ సౌండ్ తో పెద్ద సైజు హాల్ ని సైతం సౌండ్ తో నింపుతుంది. మరి ఈరోజు అందుబాటులో ఉన్న ఈ బడ్జెట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ డీల్ మరియు ఫీచర్లు ఏమిటో చూద్దామా.

300W Dolby Soundbar డీల్ ఏమిటి?

ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ కంపెనీ E GATE ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన Enigma 315D సౌండ్ బార్ ఈరోజు 5వేల బడ్జెట్ ధరలో లభించే పవర్ ఫుల్ సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు 62% భారీ డిస్కౌంట్ తో అమెజాన్ ఇండియా నుంచి కేవలం రూ. 5,999 ధరతో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ కలిగిన ఫీచర్స్ తో ఈ సౌండ్ బార్ లభించే ప్రైస్ లో సమంజసంగా ఉంటుంది. ఈ సౌండ్ బార్ పై Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. Buy From Here

E GATE 300W Dolby Soundbar ఫీచర్లు ఏమిటి?

ఈ గేట్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 300W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం లుక్ తో ఆకట్టుకుంటుంది మరియు సింపుల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో రెండు పవర్ ఫుల్ స్పీకర్లు కలిగిన బార్ మరియు డీప్ బాస్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో, డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు వర్చువల్ 5.1 సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది డిజిటల్ సిగ్నల్ ప్రోసెస్ (DSP) చిప్ సెట్ తో వస్తుంది. ఈ చిప్ సెట్ థంపింగ్ బాస్ మరియు మంచి క్లారిటీ సౌండ్ అందించడానికి సహాయం చేస్తుంది. ఇదే కాదు ఈ సౌండ్ బార్ నెక్స్ట్ జనరేషన్ లాస్ లెస్ ఆడియో ట్రాన్స్మిషన్ (NGLA) ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఇది HDMI eArc మరియు ఆప్టికల్ కనెక్ట్ ద్వారా లాస్ లెస్ డాల్బీ డీకోడింగ్ కోసం సహాయం చేస్తుంది.

Also Read: Vivo T4 Pro 5G టాప్ ఫీచర్ విడుదల చేసిన వివో.!

ఇక కనెక్టివిటీ పరంగా చూస్తే, ఇందులో AUX, ఆప్టికల్, HDMI (eARC), USB మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది. ఇది 3 ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ తో వస్తుంది. అంతేకాదు, ఫుల్ ఫంక్షన్ రిమోట్ కంట్రోల్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :