Beats launches Power beats Fit with super comfort for fitness lovers
Power beats Fit: ఆపిల్ కి చెందిన ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ Beats భారత మార్కెట్లో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ చేసింది. ఈ కొత్త బడ్స్ ను ఫిట్‌నెస్ ప్రియుల కోసం సూపర్ కంఫర్ట్ తో అందించింది. ఇది చెవుల్లో ఫిట్ గా ఉంటుంది మరియు యాపిల్ గ్రేడ్ సౌండ్ అందిస్తుంది. ఈ కొత్త బడ్స్ ఫిట్‌నెస్ ప్రియులకు తగిన విధంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త బీట్స్ ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.
బీట్స్ ఈ కొత్త పవర్ బీట్స్ ఫిట్ ఇయర్ బడ్స్ ను Rs.24,900 ధరతో ఇండియాలో విడుదల చేసింది. ఈ ఇయర్ బడ్స్ ఈరోజు నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ కి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ ఇయర్ బడ్స్ ఇన్ స్టోర్ అమ్మకాలు మాత్రం రేపటి నుంచి ప్రారంభం అవుతాయి. ఈ బడ్స్ స్పార్క్ ఆరెంజ్, జెట్ బ్లాక్, పవర్ పింక్ మరియు గ్రావెల్ గ్రెయ్ నాలుగు రంగుల్లో లభిస్తుంది.
ఈ కొత్త బీట్స్ ఇయర్ బడ్స్ కొత్త వింగ్ టిప్స్ తో వస్తుంది మరియు ఇది నాలుగు సైజుల్లో ఆఫర్ చేస్తుంది. ఈ ఫీచర్ తో యూజర్ కు అనువైన సూపర్ ఫిట్ అందిస్తుంది. ఇది జాగింగ్, జిమ్, మరియు వర్క్ అవుట్ సమయంలో గొప్ప ఫిట్ గా ఉండేలా డిజైన్ చేయబడింది. ఇందులో సౌండ్ కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఎందుకంటే, ఇందులో ప్రీమియం స్పీకర్లు, అడాప్టివ్ ఈక్వలైజర్, యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరియు హెడ్ ట్రాకింగ్ జతగా స్పేషియల్ ఆడియో వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది.
బీట్స్ పవర్ బీట్స్ ఫిట్ ఇయర్ బడ్స్ Apple H1 చిప్ తో గొప్ప iOS ఇంటిగ్రేషన్ కలిగి ఉంటుంది. ఇది అంతరాయం లేని కనెక్టివిటీ అందించడమే కాకుండా Hey Siri, కనెక్టెడ్ డివైజెస్ మధ్య సూపర్ స్;స్పీడ్ స్విచ్చింగ్ మరియు ఫైండ్ మై డివైజ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, మంచి క్రిస్టల్ క్లియర్ కాల్స్ కోసం నోయిస్ రిడక్షన్ సపోర్ట్ తో డ్యూయల్ బీమ్ ఫార్మింగ్ మైక్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Flipkart BBD Sale లాస్ట్ డే 50 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K Smart Tv డీల్ అందించింది.!
అయితే, ఈ కొత్త బడ్స్ లో చెవుల పైన ఫిట్ ఇచ్చే ఓవర్ ద ఇయర్ హుక్ మాత్రం ఇవ్వడం లేదు. కానీ, ఈ బడ్స్ ఫిట్ మరియు స్టైల్ పరంగా కూడా బాగుంటాయి. ఈ బడ్స్ IPX4 స్వెట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. Beats App యాప్ తో ఈ బడ్స్ ను ఆండ్రాయిడ్ యూజర్లు కూడా యూజ్ చేసుకోవచ్చు.