Sonodyne Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.!

Updated on 08-Oct-2025
HIGHLIGHTS

Sonodyne Dolby Atmos సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ అందుకోండి

ఫేమస్ యాంప్లిఫైయర్ అండ్ స్పీకర్ బ్రాండ్ సోనోడైన్ రీసెంట్ గా విడుదల చేసిన సౌండ్ బార్

ఈ మెడ్ ఇన్ ఇండియా సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది

Sonodyne Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఫేమస్ యాంప్లిఫైయర్ అండ్ స్పీకర్ బ్రాండ్ సోనోడైన్ రీసెంట్ గా విడుదల చేసిన ఈ సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాళి స్పెషల్ సేల్ నుంచి చవక ధరలో లభిస్తోంది.

Sonodyne Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్స్

ప్రముఖ ఇండియా బెస్ట్ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ సోనోడైన్ రీసెంట్ గా విడుదల చేసిన డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ SAMA 5000 ఈరోజు డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 47% భారీ డిస్కౌంట్ తో రూ. 23,748 ధరతో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుంచి Axis మరియు IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో తీసుకునే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

పైన తెలిపిన రెండు అఫ్సర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 22,248 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ని అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ ధరతో కొనుగోలు చేయాలనుకునే వారు Buy From Here లింక్ పై క్లిక్ చేసి ఆఫర్ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Also Read: Apple AirPods Pro 2 ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 10 వేల రూపాయల డిస్కౌంట్ తో లభిస్తోంది.!

Sonodyne Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సోనోడైన్ సౌండ్ బార్ 3.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు మూడు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ బాస్ సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 400W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ డెడికేటెడ్ డైలాగ్ ఛానల్ స్పీకర్ కలిగి ఉంటుంది.ఏ ఈ మెడ్ ఇన్ ఇండియా సౌండ్ బార్ చాలా ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది.

సౌండ్ టెక్నాలజీ పరంగా, ఈ సోనోడైన్ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. గొప్ప సౌండ్ కోసం ఇందులో డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ (DSP) చిప్ కూడా అందించింది. ఇది కాకుండా గొప్ప సరౌండ్ సౌండ్ కోసం ఈ సౌండ్ బార్ లో మల్టీ డిమెన్షియల్ ఇమేజింగ్ సపోర్ట్ కూడా అందించింది. ఇది మూడు సౌండ్ మోడ్స్ కలిగిన ఫుల్ ఫంక్షన్ రిమోట్ కలిగి ఉంటుంది మరియు వాల్ మౌంట్ మౌంట్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఇది HDMI in, HDMI out, 4K పాస్ త్రూ, ఆప్టికల్ USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ తో వచ్చే సబ్ ఉఫర్ డౌన్ ఫైరింగ్ ఉఫర్ సెటప్ కలిగి డీప్ అండ్ పంచ్ బాస్ సౌండ్ తో ఆకట్టుకుంటుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.5 రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :