amazon sale announced big deals on Samsung Dolby Atmos soundbar
Samsung Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ దివాళీ స్పెషల్ సేల్ నుంచి భారీ ఆఫర్లు ప్రకటించింది. గొప్ప ఫీచర్స్ తో గొప్ప సౌండ్ అందించ గల ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇంట్లోనే థియేటర్ వంటి గొప్ప అనుభూతిని అందిస్తుంది. అమెజాన్ ఇండియా దివాళీ స్పెషల్ సేల్ నుంచి ఈరోజు అందించిన ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేయండి.
అమెజాన్ ఇండియా ఈరోజు శామ్సంగ్ లేటెస్ట్ సౌండ్ బార్ (HW-Q600C/XL) ను 42% భారీ డిస్కౌంట్ తో రూ. 25,988 రూపాయల ఆఫర్ ధరకు అందించింది. ఈ సౌండ్ బార్ ను ICICI, Axis, IDFC FIRST మరియు AU బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను రూ. 24,488 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను అమెజాన్ సేల్ నుంచి నేరుగా కొనడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: BSNL: టెలికాం ఇండస్ట్రీ లో ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ తో సరితూగే ప్లాన్ లేదంటే నమ్ముతారా.!
ఈ శామ్సంగ్ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ తో వస్తుంది. ఇందులో, 1 పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్, 3 ఫ్రంట్ స్పీకర్ మరియు 2 అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 360W సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ను శామ్సంగ్ యొక్క Q-Symphony సపోర్ట్ తో కూడా అందించింది.
ఇక ఈ సౌండ్ బార్ కలిగి ఉన్న సౌండ్ టెక్నాలాజి విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ లో ATMOS Music, Dolby ATMOS, Dolby MAT, Dolby Digital Plus, Dolby True HD వంటి అన్ని డాల్బీ ఫార్మాట్ లకు సపోర్ట్ కలిగి వుంది. ఈ సౌండ్ బార్ కనెక్టివిటీ పరంగా కూడా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ లో 1 HDMI In, 1 HDMI Out, HDMI ARC/CEC పోర్ట్ లతో పాటు ఆప్టికల్, బ్లూటూత్ మరియు బ్లూటూత్ మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా కలిగి వుంది.