చవక ధరలో 5.2 Dolby Soundbar అందుకునే గొప్ప ఛాన్స్ మిస్ అవ్వకండి.!

HIGHLIGHTS

చవక ధరలో 5.2 Dolby Soundbar అందుకునే గొప్ప ఛాన్స్

GOVO అందించిన సౌండ్ బార్ పై ఈ డీల్ లభిస్తుంది

ఈ సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటో వివరంగా తెలుసుకోండి

చవక ధరలో 5.2 Dolby Soundbar అందుకునే గొప్ప ఛాన్స్ మిస్ అవ్వకండి. ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ GOVO అందించిన సౌండ్ బార్ పై ఈ డీల్ లభిస్తుంది. జబర్దస్త్ సౌండ్ అందించే డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ ఈరోజు మీకు ఈరోజు భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇటీవల సేల్ నుంచి అమ్ముడైన ప్రైస్ కంటే కూడా మరింత తక్కువ ధరలో ఈరోజు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ డీల్ ఎక్కడ లభిస్తుంది మరియు ఈ సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటో వివరంగా తెలుసుకోండి.

5.2 Dolby Soundbar: ఆఫర్ ఎక్కడ లభిస్తుంది?

ఈ 5.2 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ ఆఫర్ ఈరోజు మీకు అమెజాన్ ఇండియా నుంచి అందుబాటులో ఉంది. డ్యూయల్ సబ్ ఉఫర్ తో GOVO అందించిన GOSURROUND 999 సౌండ్ బార్ ఈరోజు మీకు ఈ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇటీవల కూడా రూ. 11,999 ధరతో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ అందించిన భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,999 ధరలో సేల్ అవుతోంది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అమెజాన్ అందించింది. ఈ సౌండ్ బార్ ను BOB VISA డెబిట్ కార్డ్ తో తీసుకునే వారికి 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని అమెజాన్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ మీకు కేవలం రూ. 9,000 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: Big Bachat Days సేల్ నుంచి కేవలం 32 ఇంచ్ టీవీ రేటుకే 43 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!

GOVO 5.2 Dolby Soundbar: ఫీచర్స్

ఈ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 660W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ సబ్ ఉఫర్ మరియు డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ సెటప్ తో ఆకట్టుకుంటుంది. ఈ సెటప్ లో ముందు మూడు స్పీకర్లు మరియు ట్వీటర్లు కలిగిన ప్రీమియం బార్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా ఇది కంప్లీట్ సరౌండ్ మరియు జబర్దస్త్ బాస్ అందించే సబ్ ఉఫర్ సెటప్ తో ఉంటుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో వస్తుంది. ఇది నిజమైన డాల్బీ ఆడియో సౌండ్ అందిస్తుందని కూడా గోవో తెలిపింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ లో ముందుగా సెట్ చేసిన మూడు ఈక్వలైజర్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో HDMI ARC, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

ఈ ప్రైస్ లో ఈ సౌండ్ బార్ మంచి సౌండ్ అందించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :