amazon offers Dolby Atmos soundbar deal at rs 8k only
Dolby Atmos సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈరోజు అమెజాన్ ఇండియా డాల్బీ అట్మోస్ సపోర్ట్ కలిగిన లేటెస్ట్ సౌండ్ బార్ ను భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో చాలా చవక ధరకు ఆఫర్ చేస్తోంది. ఈరోజు అమెజాన్ ఇండియా అందించిన బిగ్ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం 8 వేల రూపాయల బడ్జెట్ లో అందుకునే గొప్ప ఛాన్స్ మీకు దక్కుతుంది.
జెబ్రోనిక్స్ యొక్క లేటెస్ట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ZEBRONICS Jukebar 1000 పై ఈరోజు ఈ బిగ్ డీల్ ను అనౌన్స్ చేసింది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఈరోజు 61%ఆ అతి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 8,999 రూపాయల ఆఫర్ ధరకే అమెజాన్ ఇండియా నుంచి లిస్ట్ అయ్యింది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ను SBI క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 500 వరకు అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను 8 వేల రూపాయల్ బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం వుంది. ఈ ఆఫర్ చెక్ చేయడానికి Click Here
Also Read: HMD Fusion స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ చేసింది.!
జెబ్రోనిక్స్ యొక్క సౌండ్ బార్ టోటల్ 200W అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో రెండు 40W సౌండ్ అందించే స్పీకర్లు కలిగిన బార్ మరియు 120W హెవీ BASS సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ చాలా స్లీక్ గా మరియు గ్లాసీ ఫినిష్ తో చాలా అందంగా ఉంటుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో క్వాలిటీ సౌండ్ అందిస్తుంది. ఈ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ బ్లూటూత్ V5.3, HDMI (eARC), ఆప్టికల్ ఇన్, USB మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. రీసెంట్ గా కూడా 10 వేల బడ్జెట్ లో సేల్ అయిన ఈ సౌండ్ బార్ ఈరోజు చవక ధరకు లభిస్తుంది.