amazon offered big discount on Sony Dolby Atmos soundbar for new year day eve celebration
నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా Sony Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ఎక్కడ లభిస్తుంది? అని తెలుసుకోవడానికి ఆన్లైన్ లో వెతుకులాట పెట్టకండి. నేను ఈరోజు ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు అందిస్తాను. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను నేరుగా కొనుగోలు చేయడానికి అవసరమైన లింక్ ను కూడా మీకు ఈ రోజు ఇదే న్యూస్ లో అందిస్తాను. మరి ఈ సోనీ సౌండ్ బార్ బిగ్ డీల్ ఏమిటో చూద్దామా.
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా అమెజాన్ ఇండియా ఈ రోజు బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. సోనీ ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ సోనీ సౌండ్ బార్ Bravia Theatre Bar 6 HT-BD60 5.1 పై ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ పై మొత్తం మూడు డీల్స్ అందించింది మరియు మూడు డీల్స్ దెబ్బకు ఈ సౌండ్ బార్ కేవలం మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.
ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సోనీ సౌండ్ బార్ ఇండియాలో రూ. 37,990 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ నుంచి రూ. 2,001 రూపాయల డిస్కౌంట్ తో రూ. 35,989 ధరతో సేల్ అవుతోంది. అంతేకాదు, దీనిపై రూ. 2,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సోనీ సౌండ్ బార్ మీకు రూ. 31,989 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: Jio Free Offer: జియో నెంబర్ వాడుతుంటే ఈ 18 నెలల ఉచిత ఆఫర్ వెంటనే అందుకోండి.!
ఈ సోనీ సౌండ్ బార్ 3.1.2 సెటప్ కలిగి ఉంటుంది మరియు వర్చువల్ 5.1 సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో ముందు మూడు ఫుల్ రేంజ్ స్పీకర్ మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం సౌండ్ బార్ ఉంటుంది. ఈ బార్ తో పాటు గ్రౌండ్ షేకింగ్ బాస్ సౌండ్ అందించే వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 350W ప్యూర్ ఆడియో అందిస్తుంది.
ఈ సోనీ సౌండ్ బార్ సోనీ యొక్క ప్రత్యేకమైన S-Force Pro మరియు వర్టికల్ సరౌండ్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ 3.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలాజి తో మీ ఇంటిని సినిమా హాల్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eArc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది.