amazon offer huge deals on Sony Dolby Atmos soundbar from great republic day sale
అమెజాన్ ప్రకటించిన లేటెస్ట్ సేల్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి Sony Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో సోనీ రీసెంట్ గా విడుదల చేసిన 3.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ బిగ్ డీల్స్ ప్రకటించింది. అమెజాన్ సేల్ అందించిన ఈ బిగ్ డీల్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది. సినిమా హాల్ వంటి సూపర్ సరౌండ్ సౌండ్ అందించే ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన డీల్స్ మరియు ఆఫర్స్ ఏమిటో చూద్దామా.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 నుంచి ఈరోజు సోనీ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ Bravia Theatre Bar 6 HT-BD60 పై ఈ ఈ బేస్డ్ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 35,989 ప్రైస్ ట్యాగ్ తో లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ సేల్ నుంచి ముందుగా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 33,989 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
ఇక రెండో ఆఫర్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 రూపాయల ALL Banks Card ఆఫర్ కూడా అందించింది. అంటే, ఏదైనా బ్యాంక్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేస్తే రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ సౌండ్ బార్ పై టోటల్ రూ. 4,000 రూపాయల డిస్కౌంట్ అమెజాన్ సేల్ ఆఫర్ చేసింది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 31,989 రూపాయల డిస్కౌంట్ ధరలో మీకు లభిస్తుంది. Buy From Here
Also Read: BSNL Long Plan: డైలీ 3GB డేటా మరియు అనిలిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ లాంగ్ ప్లాన్.!
ఇది ఒక ప్రీమియం హోమ్ థియేటర్ సౌండ్ బార్ మరియు ఇది ఆధునిక టెక్నాలజీతో సినిమాటిక్ ఆడియో అనుభవాన్ని ఇంట్లో అందిస్తుంది. ఈ సౌండ్ బార్ వాస్తవానికి 3.1.2 చానల్ సెటప్ కలిగి ఉంటుంది. కానీ, ఇది 5.1 సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే, ఇందులో, ముందు మూడు స్పీకర్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు ఉంటాయి. ఈ అప్ ఫైరింగ్ స్పీకర్లు పైకప్పు నుంచి శబ్దం వస్తున్నట్టుగా అనిపించేలా ఫుల్ సరౌండ్ Dolby Atmos మరియు DTS:X 3D సౌండ్ అందిస్తాయి.
ఇందులో ఉన్న ప్రత్యేక సెంటర్ ఛానల్ స్పీకర్ వలన డైలాగ్స్ చాలా క్లియర్‌గా వినిపిస్తాయి. అలాగే, ఈ సెటప్ లో ఉండే వైర్లెస్ సౌండ్ బార్ డీప్ బాస్‌ను అందిస్తుంది. అదనంగా, సోనీ యొక్క Vertical Surround Engine మరియు S-Force PRO Front Surround టెక్నాలజీ మీ సాధారణ గదినే వర్చువల్ థియేటర్‌గా మార్చేస్తుంది. ఓవరాల్ గా ఇది మీ ఇంటిని ఒక సినిమా థియేటర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 350W సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇందులో HDMI eARC/ARC, ఆప్టికల్ USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.