Zebronics 5.1 సౌండ్ బార్ పైన 71% డిస్కౌంట్: ప్రైమ్ మెంబర్స్ కు అమెజాన్ ధమాకా అఫర్.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23 నుండి స్టార్ట్ అవుతుంది

ఎప్పటిలాగానే ప్రైమ్ మెంబర్స్ కోసం ఈరోజు నుండే ఈ సేల్ యాక్సెస్ ను అందించిం

ఈ సేల్ లో Zebronics యొక్క లేటెస్ట్ 5.1 ఛానెల్ సౌండ్ బార్ పైన 71% డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23 నుండి స్టార్ట్ అవుతుంది. అయితే, ఎప్పటిలాగానే ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్ ఈ సేల్ ను ఒకరోజు ముందే, అంటే ఈరోజు నుండే ఈ సేల్ యాక్సెస్ ను అందించింది. ఈ సేల్ నుండి ప్రైమ్ మెంబర్స్ కోసం భారీ డీల్స్ మరియు ఆఫర్లను అమెజాన్ ప్రైమ్ మెంబెర్స్ కోసం అందించింది. ఈ సేల్ లో భాగంగా ప్రముఖ ఆడియో బ్రాండ్ Zebronics యొక్క లేటెస్ట్ 5.1 ఛానెల్ సౌండ్ బార్ పైన 71% డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ను మీరు మునుపెన్నడూ చూడనంత తక్కువ ధరకే పొందవచ్చు. ఈ కూసుండి బార్ అఫర్ పైన ఒక లుక్ వేద్దాం పదండి.

అమెజాన్ సేల్ నుండి ZEBRONICS ZEB-JUKE BAR 7400 PRO 5.1 చానెల్ సౌండ్ బార్ ను 71% భారీ డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ యొక్క MRP ధర రూ.23,999 రూపాయలు వుండగా, ఈ సేల్ నుండి రూ.6,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ను SBI డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. Buy From Here

ఇక జీబ్రానిక్స్ సౌండ్ ప్రత్యేకతలు మరియు ఫీచర్ల విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ మొత్తం 180W RMS సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఇందులో, సౌండ్ బార్ లో 3 స్పీకర్లు, 2 రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు ఒక 6.5 ఇంచ్ సబ్ ఉఫర్ స్పీకర్ ఉంటాయి. ఇది మీకు మంచి 5.1 సరౌండ్ సౌండ్ అనుభూతిని అందించ గలదు. కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్ బార్ HDMI Arc, Optical ఇన్ పుట్, AUX, బ్లూటూత్ v5.0 మరియు USB వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లను కలిగి వుంది. అయితే, ఈ సౌండ్ బార్ Dolby లేదా Dts సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను మాత్రం కలిగి ఉండదని మాత్రం గుర్తుంచుకోండి. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :