amazon announced rs 10000 big discount coupon on 9.1.4 Dolby Atmos soundbar
ఇండియాలో లేటెస్ట్ గా విడుదలైన బ్రాండెడ్ 9.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా రూ.10,000 భారీ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ప్రకటించింది. ఈ సౌండ్ బార్ ఇటీవల ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు అమెజాన్ నుంచి గొప్ప డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. అమెజాన్ ఈరోజు ప్రత్యేకంగా అందించిన ఈ డీల్ పై ఒక లుక్కేద్దామా.
ప్రముఖ జర్మనీ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ Blaupunkt లేటెస్ట్ గా విడుదల చేసిన SBW600 XCEED 9.1.4 డాల్బీ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ రూ. 44,999 ధరతో ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఇదే ధరతో ఈరోజు కూడా అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. అయితే, ఈ సౌండ్ బార్ అమెజాన్ ఈరోజు రూ. 10,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 34,999 రూపాయల ఆఫర్ ధరతో లభిస్తుంది.
ఇది మాత్రమే కాదు, అమెజాన్ ఈ సౌండ్ బార్ పై రూ. 1,500 రూపాయల HDFC క్రెడిట్ కార్డ్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ కేవలం రూ. 33,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Sony BRAVIA Smart Tv పై అమెజాన్ జబర్దస్త్ ఆఫర్లు అందుకోండి.!
బ్లౌపంక్ట్ యొక్క ఈ సౌండ్ బార్ 9.1.4 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు మూడు, పైన రెండు మరియు సైడ్ రెండు స్పీకర్లు కలిగిన పవర్ ఫుల్ అండ్ ప్రీమియం బార్ ఉంటుంది. ఈ సెటప్ లో ముందు స్పీకర్ + ట్వీటర్ మరియు పైన అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ ఉంటుంది. ఈ టోటల్ సెటప్ తో గొప్ప బాస్ సౌండ్ అందించే 8 ఇంచ్ సబ్ ఉఫర్ కూడా ఈ సౌండ్ బార్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన టోటల్ సెటప్ తో ఇంటి మొత్తాన్ని సరౌండ్ సౌండ్ తో నింపే సత్తా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఇక సౌండ్ టెక్నాలజీ విషానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సర్టిఫికేషన్ మరియు DTS సౌండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇందులో అడ్వాన్స్డ్ సౌండ్ ప్రోసెసింగ్ అల్గారిథం ఉంది. ఈ సౌండ్ బార్ ఆప్టికల్, USB, AUX, ఆప్టికల్, coaxial మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.