amazon announced big discount on Zebronics 7.1.2 Dolby Atmos soundbar
Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ మరోసారి ఆఫర్ ప్రకటించింది. 2025 చివరిలో మరియు స్టన్నింగ్ ఫీచర్స్ తో మార్కెట్లో విడుదలైన జెబ్రోనిక్స్ లేటెస్ట్ సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ రూ. 9,500 రూపాయల డిస్కౌంట్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. ఇటీవల అమెజాన్ నిర్వహించిన ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ తర్వాత ఈరోజు ఈ సౌండ్ బార్ అదే ధరకు లభిస్తుంది. ఇటీవల అమెజాన్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ డీల్ మిస్ చేసుకున్న యూజర్లు ఈరోజు లభిస్తున్న డీల్ ను పరిశీలించవచ్చు.
ఇండియన్ మార్కెట్లో రూ. 34,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో విడుదలైన జెబ్రోనిక్స్ లేటెస్ట్ 7.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ Juke Bar 9920 ను ఈరోజు రూ. 8,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 26,999 తక్కువ ధరతో అమెజాన్ సేల్ చేస్తోంది. అదనంగా, ఈ సౌండ్ బార్ పై రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా జత చేసింది.
అన్ని ప్రధాన బ్యాంక్ కార్డ్ పై ఈ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 25,499 రూపాయల ఆఫర్ ధరలో మీకు ఈ సౌండ్ బార్ లభిస్తుంది. Buy From Here
Also Read: Realme 16 5G: ఫస్ట్ సెల్ఫీ మిర్రర్ ఫోన్ గా లాంచ్ అవుతోంది.!
ఈ సౌండ్ బార్ కేవలం బార్ అండ్ సబ్ ఉఫర్ తో మాత్రమే వస్తుంది. అయితే, కంప్లీట్ సరౌండ్ సౌండ్ సెటప్ ను ఈ సింపుల్ డిజైన్ లోనే ఆఫర్ చేస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 7.1.2 సెటప్ తో వస్తుంది. ఇందులో, టోటల్ 9 స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ ఉంది. ఈ బార్ లో 4 అప్ ఫైరింగ్ స్పీకర్లు, మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు రెండు వైపులా సైడ్ ఫైరింగ్ స్పీకర్ కలిగి ఉంటుంది. అలాగే, 12 ఇంచ్ హెవీ సబ్ ఉఫర్ కూడాఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ సెటప్ లో ఉంటుంది.
ఈ టోటల్ సెటప్ తో ఈ సౌండ్ బార్ 900W RMS హెవీ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు కంపెనీ యొక్క ప్రత్యేకమైన ZEB – Acoustics Max మల్టీ డైమెన్షనల్ సౌండ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ రెండు సౌండ్ ఫీచర్స్ తో సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, HDMI eArc, ఆప్టికల్ ఇన్, , USB , AUX మరియు లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ ఇందులో ఉన్నాయి.