amazon announced big deals on Sony Dolby Atmos soundbar from black Friday sale
Sony Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఇండియాలో రీసెంట్ గా విడుదలైన ఈ సోనీ సౌండ్ బార్ జబర్దస్త్ సౌండ్ అందించే సెటప్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ అందించిన కూపన్ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
సోనీ 3.1.2 ఛానల్ సౌండ్ బార్ బ్రావియా థియేటర్ బార్ 6 HT-BD60 పై అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 35,989 ధరతో లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 అదనపు కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ అందించింది. ఈ సౌండ్ బార్ ని ఏదైనా బ్యాంక్ కార్డు తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 31,989 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here
ఈ సోనీ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు 5.1 ఛానల్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో, ముందు మూడు మరియు పెయిన్ రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది. ఈ సెటప్ తో ఈ సౌండ్ బార్ టోటల్ 350W జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది ప్రీమియం డిజైన్ తో ఉండటమే కాకుండా ఈజీ సెటప్ తో కూడా వస్తుంది.
ఈ సోనీ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ మరియు DTS:X సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ వర్టికల్ సౌండ్ ఇంజన్ మరియు S ఫోర్స్ ప్రో ఫ్రంట్ సరౌండ్ సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సోనీ సౌండ్ బార్ HDMI eArc, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ మరియు మల్టీ ఫంక్షన్ రిమోట్ కంట్రోల్ కలిగి ఉంటుంది.
Also Read: iQOO 15 లాంఛ్ కంటే ముందే ఫీచర్స్ మరియు ప్రైస్ ముందే తెలుసుకోండి.!
ఈ సోనీ 3.1.2 ఛానల్ సౌండ్ బార్ అమెజాన్ కస్టమర్ల నుంచి 4.7 స్టార్ రేటింగ్ అందుకుంది. ఈ సౌండ్ బార్ యూజర్ల నుంచి మంచి రివ్యూలు కూడా అందుకుంది.