Paytm వినియోగదారులను హెచ్చరించిన సంస్థ వ్యవస్థాపకుడు

Updated on 06-Dec-2019

ప్రస్తుతం, ప్రపంచాన్ని ఏలుతోంది మనం కాదు మొబైల్ ఫోన్ అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమాత్రం లేదని చెప్పొచ్చు. ఇక మనదేశంలో మొబైల్ ఫోన్ ఉందంటే కొన్ని ప్రధానమైన Apps అందులో ఖచ్చితంగా కనిపిస్తాయి. వాటిలో FaceBook, Whatsapp, instagram, tiktok వంటి ప్రధానమైన వాటితో పాటుగా ఆన్లైన్ డిజిటల్ చెల్లింపుల కోసం ప్రధానంగా Paytm యాప్ ను వాడడాన్ని సర్వసాధారణంగా చూస్తుంటాం.

 

https://twitter.com/vijayshekhar/status/1201411108264796161?ref_src=twsrc%5Etfw

 

అయితే, ఇప్పుడు కొత్తగా PAYTM వాడుతున్నవారు తస్మాత్ జాగ్రత్త అని ట్విట్టర్ సాక్షిగా హెచ్చరిస్తున్నారు. ఎవరు హెచ్చరిస్తున్నారు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకోకండి. ఎందుకంటే, ఈ హెచ్చరికను అందించి సంస్థ యొక్క వ్యవస్థాపకుడైన విజయ శేఖర్ శర్మ తన సొంత అధికారిక ట్విట్టర్ ఖాతా లో ఈ ట్వీట్ ను పోస్ట్  చేశారు.

ఈ ట్వీట్ ప్రకారంగా చూస్తే, మీ paytm అకౌంట్ KYC చెయ్యడానికి లేదా KYC చెయ్యకుంటే అకౌంట్ బ్లాక్ అవ్వనుంది అని మీకు కాల్స్ లేదా SMS వంటివి పంపించి, ఆన్లైన్ మోసాలకు పాల్పడవచ్చన్న విషయాన్ని, విజయ శేఖర్ శర్మ ట్వీట్ చెబుతోంది. అంతేకాదు, మీ KYC అప్డేట్ చెయ్యాలంటే మరేదో యాప్ డౌన్లోడ్ చేయాలనీ కూడా మిమ్మల్ని ఉసిగొలిపే ప్రయత్నం కూడా చెయ్యవచ్చు. అయితే, వాస్తవానికి సంస్థ పైన తెలిపిన ఎటువంటి వివరాలను వినియోగదారుల నుండి అడగదని, ఇటువంటి వివరాలను ఎవ్వరికీ కూడా తెలియచేయవద్దని, వాటిని విస్మరించడం మంచిదని తెలిపారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :