RailOne App: రైలు ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని సేవలకు ఒకే పరిష్కారంగా కొత్త యాప్ లాంచ్.!

Updated on 01-Jul-2025
HIGHLIGHTS

ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని సేవలకు ఒకే పరిష్కారం తో కొత్త యాప్ లాంచ్

కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా ఈ RailOne App విడుదల చేశారు

ఈ కొత్త ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ మరియు iOS యాప్ స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉంది

RailOne App: ప్రయాణికుల సౌకర్యాలు మెరుగు పరచడానికి నిరంతరం కొత్త మార్గాలు మరియు సేవలు అందించడానికి కృషి చేస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ ఈరోజు రైలు ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని సేవలకు ఒకే పరిష్కారం తో కొత్త యాప్ లాంచ్ చేసింది. అదే, రైల్‌వన్ యాప్ మరియు ఈ యాప్ ను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది.

RailOne App:

ఈ రోజు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) 40 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ కొత్త యాప్ ను విడుదల చేశారు. న్యూఢిల్లీ లోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా ఈ కొత్త యాప్ ను విడుదల చేశారు.

ఈ కొత్త ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ మరియు iOS యాప్ స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉంది. ఈ కొత్త యాప్ కూడా IRCTC తో భాగస్వామ్యం కలిగి ఉంటుంది. ఈ యాప్ లాగిన్ కోసం సింగిల్ సిన్ ఇన్ ద్వారా ఎం-పిన్ లేదా బయో మెట్రిక్ తో లాగిన్ ఫీచర్ కలిగి ఉంటుంది.

రైల్‌వన్ యాప్ : ఫీచర్స్

ఈ కొత్త రైల్‌వన్ యాప్ ప్యాసింజర్లుకు గొప్పగా ఉపయోగపడుతుంది. ఈ కొత్త యాప్ తో అన్‌రిజర్వ్‌డ్ మరియు ప్లాట్‌ఫామ్ టికెట్ల పై 3 శాతం డిస్కౌంటు లభిస్తుంది. అంటే, అన్‌రిజర్వ్‌డ్ టికెట్స్ కూడా స్పాట్ లో బుక్ చేసుకునే అవకాశం ఈ యాప్ అందిస్తుంది. అంతేకాదు, పాట్ ఫామ్ టికెట్ కోసం రైల్వే స్టేషన్ వద్ద లైన్ లో పడిగాపులు కాయవలసిన శ్రమ తప్పుతుంది.

ఈ యాప్ తో లైవ్ ట్రైన్ ట్రాకింగ్ సౌలభ్యం కూడా అందిస్తుంది. లైవ్ ట్రైన్ ట్రాకింగ్ కోసం ఇతర థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ యాప్ తో నేరుగా ఫిర్యాదుల పరిష్కారం అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఇందులో ఇ-కేటరింగ్, పోర్టర్‌ బుకింగ్ మరియు లాస్ట్-మైల్ ట్యాక్సీ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: Tecno Pova 7 5G: మినీ LED డిజైన్ మరియు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ తో రిలీజ్ అవుతోంది.!

రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త తీసుకొచ్చిన ఈ యాప్, ఇప్పటి రైల్‌కనెక్ట్ (RailConnect) మరియు యూటీఎస్ క్రెడెన్షియల్స్‌ ను కూడా సపోర్ట్ చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :