TikTok కి పోటీగా వచ్చిన Made In India App Chingari ఏకంగా 25 లక్షల డౌన్ లోడ్స్ సాధించింది

Updated on 30-Jun-2020
HIGHLIGHTS

Made In India App Chingari కొంతకాలంగా గణనీయంగా ప్రజాదరణ పొందుతోంది.

TikTok కి పోటిగా ఇండియాలో క్రియేట్ చెయ్యబడిన Chingari App అతితక్కువ సమయంలో సుమారు 2.5 మిలియన్ల డౌన్‌లోడ్‌లను చేరుకుంది.

Made In India App Chingari కొంతకాలంగా గణనీయంగా ప్రజాదరణ పొందుతోంది. ఇందుకు అతిపెద్ద కారణం, భారతదేశం-చైనా మధ్యకొనసాగుతున ఉద్రిక్తల కారణంగా, దేశ ప్రజలు చైనా ఉత్పత్తులు మరియు యాప్స్ బహిష్కరించడం ప్రారంభించారు. అటువంటి పరిస్థితిలో, TikTok కి పోటిగా ఇండియాలో క్రియేట్ చెయ్యబడిన Chingari App అతితక్కువ సమయంలో సుమారు 2.5 మిలియన్ల డౌన్‌లోడ్‌లను చేరుకుంది.

టిక్‌టాక్ మాదిరిగా, చింగారి కూడా ఒక చిన్న వీడియో యాప్, ఇది వినియోగదారులను వీడియోలను అప్‌లోడ్ చేయడానికి మరియు డౌన్‌లోడ్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే, చింగారి మరియు టిక్‌టాక్‌ల మధ్య ఒక ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, చింగారి దేశం యొక్క లోకల్ యాప్. కానీ, టిక్‌టాక్ ఒక చైనీస్ యాప్ కావడం వలన, ఇది ఇప్పుడు భారతదేశంలో నిషేధించబడింది. ఇది ఒక్కటి మాత్రమే కాకుండా, యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లే స్టోర్ నుండి మొత్తం 59 చైనీస్ యాప్స్ కూడా తొలగించబడ్డాయి.

ఇటీవల వరకు, ఈ డౌన్‌లోడ్ సంఖ్య 550,000 మాత్రమే, కానీ చైనా భారత్ వివాదం తర్వాత కేవలం 10 రోజుల్లో, చింగారి యాప్ 2.5 మిలియన్ డౌన్‌లోడ్‌లను అంటే  25 లక్షల డౌన్లోడ్ నంబర్ ను నమోదుచేసింది. గడిచిన 72 గంటల్లో మొదటిసారి, చింగారి యాప్ 500,000 డౌన్‌లోడ్‌ల సంఖ్యకు చేరుకుంది. ఈ డౌన్లోడ్స్ తరువాత, ఈ యాప్ యొక్క చందాదారుల సంఖ్య 400% వృద్ధిని సాధించిందని కంపెనీ పేర్కొంది.

ఇప్పుడు ఇక్కడ ప్రశ్న తలెత్తుతోంది, చాలా మంది చందాదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది, మరియు టిక్‌టాక్‌ను భారతదేశంలో నిషేధించిన తరువాత, చింగారి యాప్ టిక్‌టాక్‌ను దేశంలో మేడ్ ఇన్ ఇండియా యాప్‌గా మారుస్తుందా? ఇది చాలా పెద్ద ప్రశ్న. అయితే, పరిస్థితుల దృష్యా, ఈ సమయంలో టిక్‌టాక్‌తో పాటు ఇతర 58 యాప్‌లను కూడా దేశంలో నిషేధించారు. మీరు ఈ అనువర్తనాల పూర్తి జాబితాను ఇక్కడ చూడవచ్చు.

TikTok, Shareit, Kwai, UC Browser, Baidu map, Shein, Clash of Kings, DU battery saver, Helo, Likee, YouCam makeup, Mi Community, CM Browers, Virus Cleaner, APUS Browser, ROMWE, Club Factory, Newsdog, Beutry Plus, WeChat,

UC News, QQ Mail, Weibo, Xender, QQ Music, QQ Newsfeed, Bigo Live, SelfieCity, Mail Master, Parallel Space, Mi Video Call — Xiaomi, WeSync, ES File Explorer, Viva Video — QU Video Inc, Meitu,

 Vigo Video, New Video Status, DU Recorder, Vault- Hide, Cache Cleaner DU App studio, DU Cleaner, DU Browser, Hago Play With New Friends,

Cam Scanner, Clean Master — Cheetah Mobile, Wonder Camera, Photo Wonder, QQ Player, We Meet, Sweet Selfie, Baidu Translate, Vmate, QQ International, QQ Security Center, QQ Launcher, U Video, V fly Status Video, Mobile Legends, మరియు DU Privacy।

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :