Google Maps now getting gemini ai integrated navigation
ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగించే Google Maps నావిగేషన్ ఇప్పుడు మరింత స్మార్ట్ గా మారుతుంది. గూగుల్ తన గూగుల్ మ్యాప్ ని Gemini AI తో మరింత స్మార్ట్ గా మారుస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త చర్య తో గూగుల్ మ్యాప్ నావిగేషన్ కేవలం దారి చూపించే ఒక సాధారణ సాధనంగా కాకుండా పూర్తి స్థాయి సహాయకుడిగా మారుతుంది. ఈ తాజా అప్‌డేట్ తో తెచ్చిన తాజా పరిణామాలు మరియు కొత్త ఫీచర్స్ విపులంగా తెలుసుకోండి.
గూగుల్ మ్యాప్స్ కోసం గూగుల్ అందించిన కొత్త అప్డేట్ లో జెమినీ ఎఐ శక్తిని జోడించింది. ఈ కొత్త చర్యలో భాగంగా గూగుల్ 10 ఇండియా ఫస్ట్ ఫీచర్స్ గూగుల్ మ్యాప్ లో అందించింది. ఈ 10 ఫీచర్స్ ని భారత యూజర్ల ను దృష్టిలో ఉంచుకొని అందించింది.
ఇది చాలా కాలంగా వినతి చేస్తున్న ఫీచర్ మరియు ఇది టూ వీలర్ నడిపే వారికి గొప్ప సహాయకారిగా ఉంటుంది. ఇది బైక్ నడిపే వారి కోసం చిన్న రోడ్డు నావిగేషన్ అందిస్తుంది.
స్వచ్చ భారత్ మిషన్ భాగస్వామ్యంతో ఈ కొత్త ఫీచర్ ని అందించింది. ఈ ఫీచర్ తో దగ్గరలోని టాయిలెట్ మరియు బాత్ రూమ్ ని వివరాలు పొందవచ్చు.
కనెక్టివిటీ తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ ఫీచర్ మంచి సహాయకారిగా పని చేస్తుంది. ఇది యూజర్ డేటా మరియు డివైజ్ బ్యాటరీ సేవ్ చేయడానికి అందించబడిన ఫీచర్.
సంప్రదాయ స్ట్రీట్ అడ్రస్ మాదిరిగా కాకుండా పిన్ పాయింట్ లొకేషన్ గుర్తింపు కోసం ఆరు అంకెల యూనిక్ ఆల్ఫాన్యూమరిక్ అడ్రసింగ్ సిస్టం (8FVC+J8) ని ప్లస్ కోడ్ ఫీచర్ గా అందించింది. ఇది కచ్చితమైన లొకేషన్ గుర్తింపుకు సహాయం చేస్తుంది.
లోకల్ భాషలో నావిగేషన్ కోసం ఈ కొత్త ఫీచర్ ని అందించింది. ఇది తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి మరిన్ని భాషల్లో నావిగేషన్ కి సహకరిస్తుంది.
ఈ ఫీచర్ తో ని ఇండియన్ రైల్వేస్ సహకారంతో అందించింది. ఈ ఫీచర్ తో ట్రైన్ లైవ్ స్టేటస్, లేటు సమయం మరియు ప్లాట్ ఫామ్ నెంబర్స్ వంటివి అందిస్తుంది.
లోకల్ ట్రావెల్ కోసం అవసరమైన లోకల్ క్యాబ్ మరియు ఆటో రిక్షా సర్వీసులతో పాటు వాటి ఫేర్ ప్రైస్ వివరాలు కూడా అందిస్తుంది.
రెస్టారెంట్ మరియు లోకల్ మార్కెట్ మరియు మరిన్ని ఫేమస్ ప్రాంతాలకు సంబంధించిన వాటి కోసం కొత్త ‘Explore’ ట్యాబ్ అందించింది. ఈ ట్యాబ్ తో లోకల్ గా ఉండే మార్కెట్ మరియు ఇతర ప్రాంతాలు వివరంగా అందిస్తుంది.
ఇది లోకల్ ప్రాంతాల్లో ఉండే రోడ్స్ కోసం ప్రత్యేకమైన ఫీచర్. ఇది లోకల్ గా జరిగే ఉత్సవాలు, రోడ్ పనులు మరియు వర్షం తో వచ్చే వరద వంటి వాటితో రోడ్ జామ్ అయితే తెలియజేస్తుంది.
Also Read: Realme GT8 Pro ఇండియా లాంచ్ డేట్ మరియు టాప్ ఫీచర్స్ అనౌన్స్ చేసిన కంపెనీ.!
ఈ కొత్త ఫీచర్ తో డెస్టినేషన్ చేసుకోవడానికి ఉజ్జాయింపు సమయం ఎస్టిమేట్ టైమ్ ఆఫ్ ట్రావెల్ (ETA) వివరాలు అందించడానికి స్మార్ట్ రిప్లై ఫీచర్ ని అందించింది.
ఈ కొత్త ఫీచర్స్ తో ఇండియాలో గూగుల్ నావిగేషన్ మరింత సుఖమయమైన ప్రయాణానికి సహాయం చేస్తుందని గూగుల్ చెబుతోంది.