ChatGPT Go : భారతీయ యూజర్ల కోసం ప్రీమియం ఫీచర్స్ తో చవక ప్లాన్ లాంచ్.!

Updated on 19-Aug-2025
HIGHLIGHTS

ప్రపంచంలో ఎక్కువ యూజర్ బేస్ కలిగిన AI యాప్స్ లో చాట్‌జిపిటి కూడా ఒకటిగా నిలుస్తుంది

భారతీయ యూజర్ల కోసం చాట్‌జిపిటి కొత్తగా అందించిన బడ్జెట్ యాక్సెస్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ అందించింది

ChatGPT Go ప్రీమియం ఫీచర్స్ తో చవక ధరలో అందుబాటులో ఉంటుంది

ChatGPT Go: ప్రపంచంలో కొత్త టెక్ ఏది వచ్చినా కూడా ఇండియన్ మార్కెట్ కోసం ప్రత్యేకమైన ప్లాన్ లను అందించడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు ఇదే ఆనవాయితీ తో చాట్‌జిపిటి కూడా భారతీయ యూజర్ల కోసం ప్రీమియం ఫీచర్స్ తో చవక సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లాంచ్ చేసింది. ప్రపంచంలో ఎక్కువ యూజర్ బేస్ కలిగిన AI యాప్స్ లో చాట్‌జిపిటి కూడా ఒకటిగా నిలుస్తుంది. అందుకే, ఇంత యూజర్ బేస్ కు చవక ధరలో ప్రీమియం ఫీచర్స్ కలిగిన చాట్‌జిపిటి ప్లాన్ తో యాక్సెస్ అందించడం ద్వారా అటు కంపెనీకి ఇటు యూజర్ కు కూడా లాభదాయకంగా ఉంటుందని యోచించిన కంపెనీ ఈ కొత్త ప్లాన్ బడ్జెట్ ప్లాన్ చాట్‌జిపిటి గో తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ChatGPT Go అంటే ఏమిటి?

చాట్‌జిపిటి గో అనేది భారతీయ యూజర్ల కోసం చాట్‌జిపిటి కొత్తగా అందించిన బడ్జెట్ యాక్సెస్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ అవుతుంది. ఇది ప్రీమియం ఫీచర్స్ తో చవక ధరలో అందుబాటులో ఉంటుంది. దీన్ని కొంత మంది చాట్‌జిపిటి యొక్క లైట్ వెర్షన్ అని కూడా పిలుస్తారు. ఇది మొబైల్ ఫోన్ లో చాలా స్పీడ్ గా రన్ అయ్యే వెర్షన్ గా కూడా చెప్పబడుతుంది.

ChatGPT Go కొత్త ప్లాన్ రేటు ఏమిటి?

చాట్‌జిపిటి గో యొక్క లేటెస్ట్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను కేవలం రూ. 399 రూపాయల ప్రైస్ తో అందించారు. ఈ కొత్త బడ్జెట్ ప్రీమియం ఫీచర్ ప్లాన్ గురించి చాట్‌జిపిటి హెడ్ అయిన నిక్ టర్లే తన లింక్డిన్ అఫీషియల్ నుంచి అనౌన్స్ చేశారు. అంతేకాదు, ఈ ప్లాన్ కోసం UPI ద్వారా చెల్లింపు చేసే అవకాశం కూడా అందించినట్లు తెలిపారు.

చాట్‌జిపిటి గో కొత్త ప్లాన్ అందించే లాభాలు ఏమిటి?

చాట్‌జిపిటి గో కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ఎంచుకునే యూజర్లకు ఈ క్రింద ప్రయోజనాలు అందిస్తుంది.

  • 10x అధిక మెసేజ్ లిమిట్స్
  • 10x అధిక ఇమేజ్ జనరేషన్స్
  • 10x అధిక ఫైల్ అప్ లోడ్ చేసే అవకాశం
  • 2x ఉచిత యాక్సెస్ తో పోలిస్తే దీర్ఘమైన మెమెరీ కూడా ఆఫర్ చేస్తుంది

బడ్జెట్ యూజర్ ను దృష్టిలో ఉంచుకొని సరసమైన సబ్ స్క్రిప్షన్ అందించాలని తాము అందుకున్న విన్నపాలను దృష్టిలో ఉంచుకుని దానికి అనుగుణంగా ఈ కొత్త బడ్జెట్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను లాంచ్ చేసినట్లు నిక్ టర్లే తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ ప్లాన్ ను ముందుగా ఇండియాలో లాంచ్ చేసినట్లు కూడా తెలియజేశారు.

Also Read: Realme P4 5G లాంచ్ కంటే ముందే కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!

చాట్‌జిపిటి గో ప్రత్యేకత ఏమిటి?

చాట్‌జిపిటి గో కొత్త సబ్ స్క్రిప్షన్ తో ఈ యాప్ చాలా తక్కువ సోర్స్ లను ఉపయోగించి చాలా వేగంగా సమాధానాలు అందిస్తుంది. అంటే, చాట్‌జిపిటి గో చాలా వేగంగా రెస్పాండ్ అవుతుందని మనం అర్ధం చేసుకోవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :