లేటెస్ట్ గా వాట్స్ యాప్ 3 అప్డేట్ లు రిలీస్ చేసింది

HIGHLIGHTS

ఈ అప్డేట్ లో కొత్త ఫీచర్స్ తెలుసుకుందాము

లేటెస్ట్  గా  వాట్స్  యాప్  3 అప్డేట్  లు  రిలీస్  చేసింది. ఈ  అప్డేట్ లో  కొత్త  ఫీచర్స్  తెలుసుకుందాము. 

ముందుగా  మీ  మొబైల్  లో వాట్స్ యాప్  ను  అప్డేట్  చేనుకోండి ఆ తరువాత  మీ  మొబైల్  లోని  వాట్స్  యాప్ ఓపెన్   చేసుకుని. ఒక  పర్సన్  ని సెలెక్ట్  చేసుకోవాలి. ఆ తరువాత  కెమెరా  ఐ కాన్    ఫై  క్లిక్  చేసినట్లయితే అదే  ఇమేజ్  ఇంకొకసారి క్లిక్  చేసినట్లయితే  టాప్  లోని  4 ఆప్షన్స్  లో మీరు  గమనిస్తే  క్రా ప్  ఆప్షన్  గమనిస్తే రొటేట్  సింబల్  కనిపిస్తుంది. దీనిద్వారా  ఇమేజ్  ని రొటేట్  చేసుకొనే  అవకాశం  వాట్స్  అప్ కల్పిస్తుంది.  ఇది మొదటి  అప్డేట్ 

ఇక  సెకండ్  అప్డేట్ 

ఒకరి కాంటాక్ట్   నెంబర్  వేరేవారికి  వాట్స్  యాప్  లో  షేర్  చేయటం  చాలా  మందికి  తెలీదు . మరియు  ఒకసారి  ఒక  కాంటాక్ట్ నే  వేరే  వారికి  పంపగలము . కొత్త  అప్డేట్  ద్వారా  ఎన్ని  నంబర్స్  అయినా  ఒకసారే  మీ  ఫ్రెండ్స్  తో షేర్  చేసుకోవచ్చు. ఎలా  అంటే  అటాచ్  మీద క్లిక్  చేయగానే  6 ఆప్షన్స్  లో కాంటాక్ట్స్  సెలెక్ట్  చేసుకున్నతరువాత  అన్ని  కాంటాక్ట్  నంబర్స్  వస్తాయి  వాటిలో  మీకు కావలిసినన్ని  నంబర్స్  సెలెక్ట్  చేసి పంపుకోవచ్చు. 

ఇక  3 వ  అప్డేట్ 
 వాట్స్  యాప్  లో  టెక్స్ట్  మెసేజ్  సెండ్  చేసేటప్పుడు , ఆ టెక్స్ట్  మెసేజ్  యొక్క  స్టయిల్  మరియు  ఫాంట్  చేంజ్  చేయాలనుకున్నప్పుడు కొన్ని  ట్రిక్స్  వున్నాయి. అంటే  సింబల్స్  మొదట్లో  మరియు మధ్యలో  టెక్స్ట్  మరియు  లాస్ట్  లో  సింబల్స్ టైపు  చేసి సెండ్  చేస్తే ఆ టెక్స్ట్  యొక్క ఫాంట్  అనేది  మారుతూ  ఉంటుంది. కొత్త  అప్డేట్  తరువాత సింబల్స్  యూస్  చేయవలిసిన  అవసరం  లేదు.   ఒక  పేరు టైపు  చేసి లాంగ్  ప్రెస్  చేసినప్పుడు 3 ఆప్షన్స్  వస్తాయి  కట్ , కాపీ ,పేస్ట్ పక్కనున్న  3 డాట్స్ మీద  క్లిక్  చేయగానే  అనేక  ఫాంట్  స్టయిల్స్  కనిపిస్తాయి , మీకు  నచ్చినది  సెలెక్ట్  చేసుకోవచ్చు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :