Ai Plus Nova Flip: ఇండియన్ బ్రాండ్ నుంచి ఫ్లిప్ ఫోన్ లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

ఇండియన్ బ్రాండ్ నుంచి కొత్త ఫ్లిప్ ఫోన్ లాంచ్ కోసం రెడీ అవుతోంది

Ai Plus Nova Flip స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ ఫ్లిప్ కార్ట్ నుంచి టీజింగ్ స్టార్ట్ చేసింది

Ai Plus Nova Flip: ఇండియన్ బ్రాండ్ నుంచి ఫ్లిప్ ఫోన్ లాంచ్ అవుతోంది.!

Ai Plus Nova Flip: ఇండియన్ బ్రాండ్ నుంచి కొత్త ఫ్లిప్ ఫోన్ లాంచ్ కోసం రెడీ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ ఫ్లిప్ కార్ట్ నుంచి టీజింగ్ స్టార్ట్ చేసింది. ఏఐ ప్లస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ CEO అండ్ నెక్స్ట్ క్వాంటం ఫౌండర్, మాధవ్ సేథ్ ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి టీజర్ విడుదల చేశారు. ఈ ఫోన్ టీజింగ్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ గురించి వివరాలు వెల్లడించే టీజర్ ఇమేజ్ ను కూడా రివీల్ చేశారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Ai Plus Nova Flip: లాంచ్

2026 Q1 లో భారతదేశంలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని ముందు వెల్లడించారు. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ నుంచి టీజర్ ఇమేజ్ ను అందించింది. ఇది పాత అప్డేట్ అయినా కూడా కంపెనీ అఫీషియల్ x అకౌంట్ నుంచి వచ్చిన ఒక కొత్త అప్డేట్ ఈ ఫోన్ గురించి మరోసారి గుర్తుచేసింది. అదేమిటంటే, ఏఐ ప్లస్ X అకౌంట్ నుంచి Nova Pods మరియు Nova Watch లాంచ్ డేట్ రివీల్ చేసింది. ఈ రెండు ప్రొడక్ట్స్ ను ఫిబ్రవరి 24వ తేదీ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది మరియు అదే రోజు ఈ ప్రోడక్ట్స్ తో పాటు అదే రోజు ఈ అప్ కమింగ్ ఫోన్ ను కూడా రిలీజ్ చేస్తుందా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది మార్కెట్ వర్గాలు వ్యక్త పరుస్తున్న సందేహం మాత్రమే సుమ. కంపెనీ నుంచి అఫీషియల్ అప్‌డేట్ వచ్చే వరకు మనం పూర్తి నిర్ధారణకు రాలేము.

Ai Plus Nova Flip

Nova Pods Pro:

ఈ బడ్స్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కంపెనీ రివీల్ చేసింది. ఈ బడ్స్ హైబ్రిడ్ ANC మరియు ENC కలిగి ఉంటుంది. ఈ బడ్స్ టోటల్ 30 గంటల ప్లే బ్యాక్ అందిస్తుంది మరియు డ్యూయల్ పైరింగ్ మోడ్ కూడా కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ హెక్సా మైక్ టెక్నాలజీ కూడా కలిగి ఉంటుంది.

Nova Pods Clips:

ఈ పోడ్స్ సిరీస్ నుంచి స్టైలిష్ క్లిప్స్ ను కూడా లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇది బడ్స్ అందంగా కనిపించే ఫ్యాషన్ యాక్ససరీస్ తో జతగా అందిస్తుంది.

Also Read: సంవత్సరం మొత్తం అధిక డేటా అందించే BSNL బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ ఇదే.!

Nova Watch Active:

ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను 1.73 ఇంచ్ AMOELD స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ స్మార్ట్ ఫంక్షన్ క్రౌన్ అడ్వాన్స్ హెల్త్ ట్రాకింగ్ మరియు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ వాచ్ IP 68 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo