How to write Prompts for ChatGPT know completely in telugu
How to write Prompts for ChatGPT: నేటి డిజిటల్ యుగంలో చాట్‌జిపిటి వంటి అధునాతన AI టూల్స్ ప్రజలకు చాలా ఉపయోగకరంగా మారాయి. అయితే, యూజర్ ఇచ్చే ప్రాంప్ట్ (Prompt) పై ఆధారపడి మాత్రమే వచ్చే రిజల్ట్ నాణ్యత ఆధారపడి ఉంటుంది. అంటే, క్లియర్ గా చెప్పాలంటే మంచి ప్రాంప్ట్ ను ఏఐ మోడల్ కి అందిస్తే మంచి రిజల్ట్ ను మీరు పొందవచ్చు. అందుకే, ఈరోజు చాట్‌జిపిటి లో పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఎలా రాయాలో వివరంగా తెలుసుకోండి.
చాట్‌జిపిటి లో మనం అందించే ఆదేశం లేదా ఇన్ పుట్ ను ప్రాంప్ట్ అంటారు. మీరు ఈ ఆదేశాన్ని ఎంత క్లియర్ గా అందిస్తారో అంత మంచి రిజల్ట్ అందుకుంటారు. మంచి ప్రాంప్ట్ రాయడానికి 5 ముఖ్య నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు మరియు వాటి ఆవశ్యకత వివరంగా చూద్దాం.
ఒక ప్రాంప్ట్ రాయడానికి మొదటి నియమం, మీరు అందించే ప్రాంప్ట్ క్లియర్ అండ్ స్పెసిఫిక్ గా ఉండేలా చూసుకోవాలి.
మీరు ఇచ్చే ప్రాంప్ట్ లో మీకు అవుట్ పుట్ కోరుకునే టోన్ ను క్లియర్ గా అందించాలి. అంటే, నార్మల్ లేదా సహజమైన లేదా స్నేహపూర్వకంగా వంటి టోన్ లను ఉపయోగించాలి.
అంటే, మీరు కోరుకునే విషయం అవుట్ పుట్ ఎలా ఉండాలో దాని స్టైల్ ను ముందుగా వివరించాలి. అంటే, ఆర్టికల్ స్టైల్ లేదా బ్లాగ్ స్టైల్ లేదా స్క్రిప్ట్ లేదా స్టోరీ స్టైల్ లేదా యూట్యూబ్ కోసం వంటి స్టైల్ వివరాలు అందించాలి.
మీరు కోరుకునే అవుట్ పుట్ ఫార్మాట్ ను క్లుప్తంగా చెప్పాలి. అంటే, హెడ్డింగ్స్ బుల్లెట్ పాయింట్స్ మరియు స్టెప్స్ లేదా ఇంకేమైనా స్పెసిఫిక్ గా కోరుకుంటే, ఆ డీటెయిల్స్ అందించాలి.
మీరు కోరుకునే డేటా లేదా వివరాలు ఏ భాషలో కావాలని కోరుకుంటున్నారో ప్రాంప్ట్ లో చెప్పాలి. దీని ద్వారా మీరు కోరుకునే భాషలో మీకు డేటా లేదా డీటెయిల్స్ లభిస్తాయి.
అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న మొత్తం ఐదు పాయింట్స్ తో మంచి ప్రాంప్ట్ ను అందించడం సాధ్యం అవుతుంది.
ప్రాంప్ట్ క్లియర్ ఫార్మాట్ : టాపిక్ + టోన్ + స్టైల్ + ఫార్మాట్ + లాంగ్వేజ్
“Write a detailed indian history in Telugu about tradition, use simple tone, include headings and bullet points”
ఈ ప్రాంప్ట్ తో మీకు “భారతదేశ ప్రాచీన సంప్రదాయాలు” గురించి డిటైల్డ్ వివరాలు అందుతాయి. ఇలా మీరు కోరుకునే ఏ టాపిక్ అయినా సరే మీరు క్లియర్ ఫార్మాట్ లో ప్రాంప్ట్ అందిస్తే, మీకు చక్కని వివరాలు అందుతాయి.
Also Read: Infinix NOTE 60 Pro 5G: హార్ట్ రేట్ సెన్సార్ వంటి సరికొత్త ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే మీరు మంచి అవుట్ పుట్ అందుకుంటారు.
ఇక మంచి రిజల్ట్ కోసం అడిగే ప్రాంప్ట్ కోసం మంచి ఉదాహరణ క్రింద చూడవచ్చు
“Generate creative Instagram captions in Telugu for travel photos”
ఇది ఇంస్టాగ్రామ్ లో ట్రావెల్ ఫోటోలకు తగిన మంచి క్యాప్షన్స్ కోసం ఉపయోగపడే ప్రాంప్ట్.
చాట్‌జిపిటి ని సరిగ్గా ఉపయోగించాలంటే ప్రాంప్ట్ రాయడం నేర్చుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎంత క్లియర్ గా ప్రాంప్ట్ ఇస్తారో, AI అంత మంచి సమాధానం అందిస్తుంది.