Reliance Jio సిమ్ పై మీకు ఉన్న మోస్ట్ కామన్ questions and answers

Updated on 07-Dec-2016

Jio సిమ్ ఎలా తీసుకోవాలి? ఎక్కడ ఎక్కడ  తీసుకోవాలి? ఏమి సబ్మిట్ చేయాలి? సిమ్ ఎలా యాక్టివేట్ చేయాలి? unlimited ఆఫర్ ఏలా యాక్టివేట్ చేయాలి? అనే విషయాలను ఈ లింక్ లో గతంలో తెలపటం జరిగింది. చూడగలరు.

అవును ఆగస్ట్ 20 నుండి రిలయన్స్ అఫీషియల్ గా అందరికీ Jio సిమ్ ను అందిస్తుంది. జస్ట్ మీ ఫోనులో 4G సపోర్ట్ ఉంటే చాలు. సో ఈ క్రింద మోస్ట్ కామన్ డౌట్స్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నా..నచ్చితే ఆర్టికల్ పై మీ అభిప్రాయాలు తెలపండి. నచ్చకపోతే, ఎందుకో కూడా తెలపండి.

1. రిలయన్స్ Jio సిమ్ కు డబ్బులు ఏమైనా pay చేయాలా?
అవసరం లేదు. Jio sim free గా ఇస్తుంది కంపెని.

2. ఏమి సబ్మిట్ చేయాలి సిమ్ తీసుకోవటానికి?
రిలయన్స్ సిబ్బంది డ్రైవింగ్ లైసైన్స్ అడుగుతున్నారు. కాని ప్రూఫ్ అనేది మన ఫోటో ఐడెంటిఫికేషన్ మరియు అడ్రెస్ ఐడెంటిఫికేషన్ వంటివి సేకరించి ఉంచుకోవటానికి. సో ఈ రెండూ ఉన్నది ఏదైనా ఫర్వాలేదు. వీటితో పాటు ఒక ఫోటో చాలు. కాని కొన్ని స్టోర్స్ రెండు అడుగుతున్నారు. ఫర్ eg: voter id కార్డ్.    ఫోటో, name అండ్ అడ్రెస్ కూడా ఉంటుంది ఒక దానిలోనే.

3. ఒక సారి Jio sim ను కంపెని ముందుగా సపోర్ట్ చేసిన ఫోనులో యాక్టివేట్ చేసి, తరువాత బ్రాండ్ తో మోడల్ తో సంబంధం లేకుండా ఏ ఫోనులో అయినా వేస్తె పనిచేస్తుందా?
ఫోన్ లో 4G సపోర్ట్ ఉంటే సిమ్ పనిచేస్తుంది. అలాగే unlimited ఇంటర్నెట్ ప్రివ్యూ ఆఫర్ కూడా పనిచేస్తుంది. [Update : కాని ఒకరిద్దరు users పనిచేయటం లేదని తెలిపారు. బహుశా కంపెని restriction పెట్టి ఉంటుంది అని అంచనా. కాని మర్చి చూస్తే ఆఫర్ cancel అవటం అనేది కరెక్ట్ కాదు. సో మీరు చెక్ చేయండి నిస్సందేహంగా]

4. 4G ఉంటే చాలా, VoLTE సపోర్ట్ అనేది అవసరం లేదా?
unlimited ఇంటర్నెట్ కు 4G సపోర్ట్ చాలు. కాని unlimited HD క్వాలిటీ స్టాండర్డ్ నెట్ వర్క్ కాల్స్( ఇంటర్నెట్ కాల్స్ కాదు ) కు మాత్రం VoLTE ఉండాలి. అంటే కేవలం 4G ఉన్న ఫోనుల్లో HD unlimited కాల్స్ పనిచేయవు. అయితే రిలయన్స్ సాఫ్ట్ వేర్ ద్వారా కూడా VoLTE సపోర్ట్ ఇచ్చేలా JioJoin అనే యాప్ ను అందిస్తుంది. ఈ లింక్ లో ప్లే స్టోర్ లో ఉంది యాప్. సో మీ ఫోనులో VoLTE సపోర్ట్ లేకపోయినా దీనిని ఇంస్టాల్ చేసుకొని HD unlimited కాల్స్ ను కూడా పొందగలరు అనేది ఇప్పటి వరకూ ఉన్న అప్ డేట్. అయితే రిలయన్స్ పబ్లిక్ అందరికీ సిమ్ ను ఇస్తుంది కాబట్టి JioJoin యాప్ పై కొత్త నియమాలు పెడితే పనిచేయకపోవచ్చు. [Update: కొందరికీ unlimited కాల్స్ రావటం లేదని తెలిపారు. అలా పనిచేయకపోవటానికి కారణం మీ ఏరియా లో సిగ్నల్ లేకపోవటం. సిగ్నల్ ఉంటే కనుక ఫోన్ రీస్టార్ట్ చేసి, Jio యాప్స్ అన్నీ ఓపెన్ చేసి close చేసి మరలా ట్రై చేయండి. 90% పనిచేయాలి]

5. మేము స్టోర్ కు వెళ్లి అడిగితే, అన్ని ఫోనులకు సపోర్ట్ చేయటం అనేది fake న్యూస్ అని అంటున్నారు. అసలు ఏది నిజం?
రిలయన్స్ అఫీషియల్ గా అందరికీ సపోర్ట్ ఇస్తుంది అనేది నిజం. మేము ఆల్రెడీ సపోర్ట్ చేయని 4G ఫోన్ లోకి సిమ్ తీసుకోవటం కూడా జరిగగింది. స్వయంగా స్టోర్ సిబ్బంది కూడా ఈ విషయాన్ని వెళ్లి అడిగిన వెంటనే ఒప్పుకున్నారు ఇది ఎటువంటి అన్ అఫీషియల్ మెథడ్ కాదు. సో కొన్ని స్టోర్స్ కు ప్రాసెస్ అనేది ఇంకా అప్ డేట్ అయ్యి ఉండదు. కాని మీరు అడిగిన రోజే రాత్రి నుండి ఆ స్టోర్ వాళ్ళకు కూడా ప్రాసెస్ కు అనుమతి వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక మీరు రోజులో ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి వెళ్లి తెలుసుకుంటే త్వరగా సిమ్ ను పొందగలరు. అలాగే digital xpress mini స్టోర్స్ లో కన్నా రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో సిబ్బందికి త్వరగా అప్ డేట్ అయ్యే అవకాశాలున్నాయి.

6. సిమ్ తీసుకున్న ఎంత సమయానికి సిమ్ యాక్టి వేట్ అవుతుంది?
వర్క్ ప్రాసెస్ మొదలుపెడితే మినిమమ్ ఒక 6 గంటలు, మాక్సిమమ్ రెండు రోజులు. ( సిమ్ మరియు ప్రివ్యూ ఆఫర్ ను ఎలా యాక్టివేట్ చేయాలి అని స్టార్టింగ్ లో ఇచ్చిన లింక్ లో తెలిపటం జరిగింది). మీకు సిమ్ తో పాటు instructions తో లోపల మెటీరియల్ కూడా ఉంటుంది.[Update: చాలా మందికి 16 నుండి 20 రోజులు అవుతున్నా యాక్టివేట్ కానట్లు చెబుతున్నారు. సో 20 రోజులు కనుక దాటితే మరలా అప్లై చేయండి కొత్త నంబర్ కు. ఈ సారి అధర్ కార్డ్ ఇవ్వండి!]

7. సిమ్ స్టాండర్డ్ – మైక్రో లేదా నానో నా?
అన్ని సైజెస్ లో పెట్టుకునేలా సిమ్ layout డిజైన్ చేసి ఉంటుంది.

8. ప్రెసెంట్ ఉన్న ఇతర నెట్ వర్క్ నంబర్ ను రిలయన్స్ కు పోర్ట్ చేసి Jio సిమ్ ను పొందగలమా?
ప్రస్తుతానికి డైరెక్ట్ సిమ్ తీసుకోవటమే కష్టం తరం గా ఉంది కొంతమందికి. అయినా సరే స్టోర్ లో సిబ్బంది ను అడగండి ఒకసారి. [అప్ డేట్: దీని గురించి రిలయన్స్ సిబ్బందిని అడగగా ఇప్పట్లో Jio కు పోర్టింగ్ మెథడ్ లేదని తెలిపారు.]

9. ఏదైనా విషయాలను Jio అడగటానికి కస్టమర్ కేర్ నంబర్స్ ఉన్నాయా?
Jio సిమ్ నుండి – 199  మరియు ఇతర నెట్ వర్క్స్ నుండి – 1800-88-99999 [Update: ఇది పనిచేయటం లేదు, వేరే వ్యక్తులకు వెళ్తుంది. కాని ఈ నంబర్ రిలయన్స్ సైట్ లో ఇవటం జరిగింది.] and HD కాల్స్ కొరకు 1977 కస్టమర్ కేర్ నంబర్ ఉంది.

10. మా ఫోనులో 4G ఉందా లేదా ఏలా తెలుసుకోవాలి?
android – ఫోన్ యొక్క మెయిన సెట్టింగ్స్ లో>> Mobile Networks>>Network Mode >> LTE or  4G అని ఉండాలి. WCDMA అంటే 3G.

iphone – ఫోన్ యొక్క మెయిన సెట్టింగ్స్ లోకి వెళ్లి Mobile Data>>Mobile data options>>Voice ఆప్షన్ మీద సెలెక్ట్ చేస్తే 4G or LTE అనే ఆప్షన్ ఉండాలి

11. మీ ఏరియా లో Jio సిగ్నల్ ఉందా లేదా తెలుసుకోవటం ఎలా?
ఫోన్ సెట్టింగ్స్ లో> Mobile Networks>>Network Mode >> లో కి వెళ్లి 4G ను సెలెక్ట్ చేయండి. ఇప్పడు నెట్ వర్క్ సెలెక్షన్ వద్దకు వెళ్లి Automatic నుండి Manual సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ ఏరియా లోని 4G సిగ్నల్ వస్తున్న నెట్వర్క్స్ కనిపిస్తాయి. లిస్టు లో Jio కూడా కన్పిస్తే సిగ్నల్ ఉన్నట్లే.

12. 3G సిగ్నల్స్ లో 4G unlimited ఇంటర్నెట్ పనిచేయదా?
పనిచేయదు. ఎందుకంటే ఇది 4G కేటాయింపు లో వస్తున్న డేటా మరియు స్పీడ్.

13. పబ్లిక్ రిలీజ్ కు ముందు Jio sim కొరకు కంపెని అఫీషియల్ గా సపోర్ట్ చేసిన సామ్సంగ్ మరియు LG ఫోనులు ఏంటి?
ఇప్పటికీ.. "అందరికీ సపోర్ట్ లేదనే" స్టోర్స్ చెబుతున్నట్లు అయితే సపోర్ట్ చేసే ఫోన్ మీ వద్ద ఉన్నట్లు అయితే  సిమ్ తీసుకోండి. వీటికి ప్రాసెస్ అనేది పైన అందించిన లింక్ లో తెలపటం జరిగింది. పబ్లిక్ రిలీజ్ కు ముందు Jio సపోర్ట్ అయిన ..
సామ్సంగ్ మోడల్స్ – (Galaxy A3, Galaxy A5, Galaxy A5 2016, Galaxy A5 Duos, Galaxy A7, Galaxy A7 2016, Galaxy A8, Galaxy Alpha, Galaxy Core Prime, Galaxy Grand Max, Galaxy J max, Galaxy J1 Ace, Samsung Galaxy J1 Ace, Galaxy J2, Galaxy J2 (2016), Galaxy J2 Pro, Galaxy J3, Galaxy J5, Galaxy J5 (2016), Galaxy J7, Galaxy J7 (2016), Galaxy K Zoom, Galaxy Note 3, Galaxy Note 4, Galaxy Note 5, Galaxy Note 5 Duos, Galaxy Note 7, Galaxy Note Edge, Galaxy S 5 Plus, Galaxy S4, GALAXY S4 4G, Galaxy S4, Galaxy S5 Neo, Galaxy S6, Galaxy S6 Edge, Galaxy S6 Edge Plus, Galaxy S7, Galaxy S7 Edge, Grand Prime, ON5, ON5 Pro, ON7 & ON7 Pro)

మరియు LG supporting ఫోన్స్ – (K332 (K7 LTE), K520DY (Stylus 2), K520DY, H860 (LG G5), K500I (X Screen), K535D (Stylus 2 Plus), LGH630D (G4 Stylus 4G) & LGH 442 (LGC70 Spirit LTE)) 

ఈ ఆర్టికల్ వ్రాసిన తరువాత మరియు లేటెస్ట్ గా యాడ్ అయిన ఫోనుల కోసం ఈ లింక్ లోకి వెళ్ళండి.

అండ్ అన్ని LYF ఫోనులకు సపోర్ట్ ఉంది.. దీనికి ముందు మరొక ఆర్టికల్ కూడా వ్రాయటం జరిగింది. దానిని ఈ లింక్ లో చూడగలరు ఇంటరెస్ట్ ఉన్నట్లయితే. 

గమనిక: పైన చెప్పబడిన సమాచారం అంతా సక్సెస్ఫుల్ గా అనుభవం అయిన తరువాత తెలిపినదే మరియు అఫీషియల్ సమాచారం నుండి తెలుసుకొని చెబుతుంది.

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :