LeEco Le 2 కంప్లీట్ తెలుగు రివ్యూ

Updated on 09-Jun-2016

Digit Rating: 87/100

లాభాలు:

  • మంచి పెర్ఫార్మన్స్
  • డిస్ప్లే కలర్ reproduction బాగుంది
  • Loseless ఆడియో కొత్త టెక్నాలజీ
  • గుడ్ లుక్స్ అండ్ well built
  • సూపర్ వాల్యూ ఫర్ మనీ

 

నష్టాలు:

  • బెస్ట్ బ్యాటరి లైఫ్ లేదు
  • కెమెరా లో నాయిస్ ఎక్కువుగా ఉంటుంది.

 

మా ఫైనల్ ఒపినియన్: ఎవరేజ్ కెమెరా అండ్ బ్యాటరీ ఉన్నా రెండూ manage చేయగలరు. అయితే ఈ రెండే మీకు మొదటి ప్రియారిటీస్ అయితే satisfy అవ్వరు. పెర్ఫార్మన్స్ బాగుంది. డిస్ప్లే రిచ్. UI స్మూత్. సో టోటల్ గా వేల్యూ ఫర్ మనీ. లుక్స్ కూడా రెడ్మి నోట్ 3 కన్నా బాగున్నాయి. రెడ్మి కన్నా బెటర్ కలర్స్ డిస్ప్లే ఉంది కూడా. కాని రెడ్మి లో బ్రైట్ నెస్ ఉంటుంది ఎక్కువుగా. పెర్ఫార్మన్స్ లో కూడా రెడ్మి కన్నా slight గా ఫాస్ట్ గా ఉంది. కానీ రెడ్మి లో మంచి బ్యాటరీ ఉంది. ఓవర్ ఆల్ గా బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అండర్ 15K ఇప్పుడు రెడ్మి నోట్ 3 కాదు, Le 2 ఆ ప్లేస్ ను తీసుకుంది అని చెప్పవచ్చు. ఇదే బడ్జెట్ లో బెటర్ కెమెరా కావాలనుకుంటే మాత్రం Moto G4 ప్లస్ బెటర్.

బిల్డ్ అండ్ డిజైన్: బాగుంది
Le 1S లానే ఉంది. uniform మెటల్ బాడీ, 74.6% డిస్ప్లే ఏరియా ఆన్ ఫ్రంట్ వలన అనుకూలంగా ఉంది ఓవర్ ఆల్ form factor. సింగిల్ హ్యాండ్ తో use చేయటం అనేది 5.5 in డిస్ప్లే కు కష్టం కాని ఈ డివైజ్ పెద్దగా ఉండదు. edges లో ఫోన్ చేతిలో ఇబ్బందిగా ఉండకుండా డిజైన్ చేయబడింది. కంపెని 3.5mm హెడ్ ఫోన్ జాక్ ను రిమూవ్ చేసింది. కేవలం ఫోన్ లో ఒకటే I/O పోర్ట్ ఉంది. అది USB టైప్ C. బాటం లో ఉంటుంది. ఆడియో అండ్ డేటా transfer అండ్ చార్జింగ్ కు ఇదే. క్రింద దీని ప్రక్కన అటూ ఇటూ 6 pore స్పీకర్ గ్రిల్స్ ను ఇచ్చింది. వాల్యూం అండ్ పవర్ రైట్ సైడ్ ఉన్నాయి. బటన్స్ రెస్పాన్స్ బాగుంది. క్లిక్ ఫీడ్ బ్యాక్ తో వస్తున్నాయి. రెగ్యులర్ గానే ఫింగర్ ప్రింట్ వెనుక కెమెరా సెన్సార్ క్రింద ఉంది. స్క్రీన్ ఆఫ్ లో ఉన్నా డైరెక్ట్ గా unlock చేయగలరు. 0.4 సేకేండ్స్ లో unlock చేస్తుంది. ఓవర్ ఆల్ గా బిల్డ్ బాగుంది. అద్భుతమైన కొత్త దనం కనపడదు. కాని ఇష్టపడతారు.

డిస్ప్లే అండ్ UI: బాగుంది
FHD IPS LCD 5.5 in గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే. డిఫాల్ట్ గా కలర్ మోడ్ 'LeEco' కు సెట్ చేయబడ్డాయి. ఇది డిస్ప్లే ను కూల్ కలర్ tone తో 3600K చూపిస్తుంది. మీరు 'Natural' మోడ్ కు సెట్ చేసుకుంటే బెటర్ కలర్ temperature ఉంది. బెటర్ డిస్ప్లే కనిపిస్తుంది 5600K తో. కలర్స్ depths చాలా బాగున్నాయి. షార్ప్ అండ్ మంచి డిటేల్స్ చూపిస్తుంది. టచ్ response ఫాస్ట్ గా ఉంది.

sunlight లో రెడ్మి నోట్ 3 తో కంపేర్ చేస్తే తక్కువ బ్రైట్ నెస్ ఇస్తుంది ఆటోమేటిక్ మోడ్ లో. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది outdoors లో visibility.

eUI 5.6 లో పెద్దగా మార్పులు కనపడటం లేదు Le 1S లో ఉన్న దానితో పోలిస్తే. యాప్ డ్రాయర్ ఉండదు. ఇక డ్రాప్ down నోటిఫికేషన్స్ లో కేవలం లేటెస్ట్ నోటిఫికేషన్స్ మాత్రమే ఉంటాయి. క్విక్ సెట్టింగ్స్ మాత్రం recent యాప్ప్ లిస్టు తో పాటు సింగిల్ స్క్రీన్ లో recent menu నేవిగేషన్ బటన్ ప్రెస్ చేస్తే వస్తాయి. నేవిగేషన్ బటన్స్ అన్నీ బ్యాక్ లైట్ వెలుగుతాయి. ui పర్సనల్ గా నాకు నీట్ గా అనిపించింది అలాగే ఫాస్ట్ గా కూడా ఉంది.

LeView, Live and LeVidi అనే మూడు LeEco కంటెంట్ యాప్స్ preinstall అయ్యి ఉంటాయి ఫోనులో. కంప్లీట్ లెఫ్ట్ సైడ్ లో selected స్టోరీస్, వీడియోస్ అండ్ మిగిలిన కంటెంట్ ను చూపిస్తుంది Blinkfeed panel లో. అంటే గూగల్ now లాంచర్ లోని గూగల్ కార్డ్స్ కాన్సెప్ట్ లా ఉంటుంది.  Live అనే ఐకాన్ హోమ్ స్క్రీన్ లో ఉంటుంది. దానిపై టాప్ చేయగానే live టీవీ చానెల్స్ చూస్తారు. LeVidi యాప్ లో Eros Now, YuppTV అండ్ Hungama సర్వీసెస్ నుండి ప్రీమియం కంటెంట్ చూపిస్తుంది. ఈ యాప్స్ సెపరేట్ గా ఉన్నట్లు అనిపించవు. OS లో బాగా కలిసిపోయాయి. యాప్స్ layouts కూడా మిగిలిన eUI తో synchronise అయ్యాయి.

పెర్ఫార్మన్స్: బాగుంది
స్నాప్ డ్రాగన్ 652 ఆక్టో కోర్ SoC 3GB ర్యామ్ తో వస్తుంది దీనిలో. adreno 510 GPU, X8 LTE modem, Hexagon 680 DSP, 32GB స్టోరేజ్ బాగా integrate అయ్యాయి.  Vivo V3 మాక్స్ పెర్ఫార్మన్స్ కు close గా వచ్చాయి. రెండు A53 చిప్స్ ను స్లీప్ మోడ్ లో పెడుతుంది usual గా. high పెర్ఫార్మెన్స్ మోడ్ లోనే 8 కోర్స్ ను action లోకి తెస్తుంది. Hexagon 680 DSP బ్యాక్ గ్రౌండ్ యాప్స్ ను చూసుకుంటుంది ఈజీగా. గ్రాఫిక్స్ అండ్ high ప్రొసెసర్ intensive గేమ్స్, Modern Combat 5 లేదా asphalt airborne ను ఆడుతున్నా ఎక్కడ stutters లేవు.

రెడ్మి నోట్ 3 లో ఉన్న SD 650 SoC కన్నా Le 2 లో ఉన్న SD 652 SoC slight గా ఫాస్ట్ గా ఉంది. అయితే ఇది రెండింటినీ ప్రక్కన పెడితేనే కాని డిఫరెన్స్ తెలియదు. గ్రాఫిక్స్ స్మూత్ గా ఉన్నాయి. కాని అప్పుడప్పుడు సెట్టిన్స్ లేదా మెను లను ఓపెన్ చేయటానికి more than హాఫ్ సెకెండ్ తీసుకుంటుంది ఫోన్. యానిమేషన్స్ ద్వారా ఈ విషయాన్ని కవర్ చేయటానికి ప్రయత్నిచింది LeEco కాని తెలిసిపోతుంది. UI thankfully ప్రొసెసర్ పై ఎక్కువ pressure పెట్టడం లేదు. అన్నీ మల్టీ tasking పనులు ఈజీగా జరుగుతున్నాయి.

ప్రైస్ తో పోలిస్తే సూపర్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది ఫోన్. ఈ ప్రైస్ లో ఇది smoothest పెర్ఫర్మార్. అలాగని బెస్ట్ పెర్ఫర్మార్ అని చెప్పలేము. వీటి స్కోర్స్ ను కూడా  చూడగలరు పైన.

కెమెరా: ఫర్వాలేదు
Omnivision 2015 ఇమేజ్ sensor ఉంది ఫోన్ లో. true to source కలర్స్ ఉన్నాయి. షార్ప్ నెస్ అండ్ saturation బ్రైట్ గా ఉన్న లైటింగ్ కండిషన్స్ లో ఫర్వాలేదు అనిపిస్తుంది. బెస్ట్ డిటేల్స్ ఇస్తుంది అని చెప్పలేము. grain ఉంది slight గా 🙁 Low లైట్ లో కూడా నాయిస్ ఉంటుంది. షార్ప్ నేస మరియు డిటేల్స్  ఫర్వాలేదు అనుకుంటే low లైట్ లో నాయిస్ మరింత ఉండటం వలన ఫోటోస్ లో క్వాలిటీ తగ్గుతుంది.

కెమెరా యాప్ స్మూత్ గా ఉంది. ఫింగర్ ప్రింట్ ను ఫోటోస్ క్లిక్ చేయటానికి వాడుకోగలరు రెండు కేమేరాస్ కు. PDAF స్మూత్ అండ్ ఫాస్ట్.దీనిలో OIS లేకపోవటం వలన మీరు మూవింగ్ లో ఉంటే blur ఫోటోస్ వస్తాయి.

CDLA(Continual Digital Lossless Audio):
lossless ఆడియో సౌండ్ కోసం USB టైప్ C పోర్ట్ ద్వారా ఆడియో ను ear phones లో వినాలి. ఇందుకు సెపరేట్ గా 1,999 రూ earphones ను కూడా సేల్ చేస్తుంది. దీని వలన డేటా transferring rate పెరుగుతుంది. సో heavier అండ్ loseless సాంగ్స్ ను వినగలరు. అయితే ఫోన్ తో పాటు బాక్స్ లో నార్మల్ 3.5 mm ఆడియో జాక్ కు కనెక్ట్ చేసుకోగలిగే connector ఇస్తుంది కంపెని. అయినా సరే, చార్జింగ్ లో ఉంటే మ్యూజిక్ వినటానికి లేదా వీడియోస్ చూడటనికి అవ్వదు ఇయర్ ఫోన్స్ లో. కాని నిజంగా change ఉంది ఆడియో లో. క్లీన్ ఆడియో మరియు higher fidelity ఉంటుంది.

బ్యాటరీ లైఫ్: ఎవరేజ్
9 గం 21 నిమి 10 సేకేండ్స్ వచ్చింది బెంచ్ మార్క్స్ టెస్ట్ లో. 20 నుండి 25 mails, 150 వాట్స్ అప్ మరియు messenger chats, 20 మినిట్స్ Youtube స్ట్రీమింగ్, 30 mins asphalt airbourne గేమింగ్, 15 mins BBC వరల్డ్ న్యూస్ Live టీవీ వాచింగ్ తో చార్జింగ్ 68 % నుండి 11% కు డ్రాప్ అయ్యింది 4 గం 45 నిమిషాలలో. ఫుల్ బ్రైట్ నెస్ లో ఉంది ఈ సమయం అంతా. సో మీరు ఆటోమాటిక్ బ్రైట్ నేస పెట్టినా లేదా తక్కువ బ్రైట్ నెస్ పెట్టినా ఇంకా ఎక్కువ బ్యాక్ అప్ వస్తుంది.

11 నుండి 96 పెర్సెంట్ కు(85 పెర్సెంట్ చార్జింగ్) చార్జ్ అవటానికి 42 నిముషాలు పట్టింది. అంటే ఫాస్ట్ గా ఉంది చార్జింగ్. ఫాస్ట్ చార్జింగ్ 2.0 తో వస్తుంది. సో 10 నుండి 11 గంటలు బ్యాక్ అప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మాక్సిమమ్. వినటానికి ఒక రోజు ఫర్వాలేదు అనిపించినా కరెంట్ ట్రెండ్ లో పైగా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ తో వస్తూ ఇది తక్కువ బ్యాక్ అప్ అని చెప్పాలి.

బాటమ్ లైన్
ఎవరేజ్ కెమెరా అండ్ బ్యాటరీ ఉన్నా రెండూ manage చేయగలరు. అయితే ఈ రెండే మీకు మొదటి ప్రియారిటీస్ అయితే satisfy అవ్వరు. పెర్ఫార్మన్స్ బాగుంది. డిస్ప్లే రిచ్. UI స్మూత్. సో టోటల్ గా వేల్యూ ఫర్ మనీ. లుక్స్ కూడా రెడ్మి నోట్ 3 కన్నా బాగున్నాయి. రెడ్మి కన్నా బెటర్ కలర్స్ డిస్ప్లే ఉంది కూడా. కాని రెడ్మి లో బ్రైట్ నెస్ ఉంటుంది ఎక్కువుగా. పెర్ఫార్మన్స్ లో కూడా రెడ్మి కన్నా slight గా ఫాస్ట్ గా ఉంది. కానీ రెడ్మి లో మంచి బ్యాటరీ ఉంది. ఓవర్ ఆల్ గా బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అండర్ 15K ఇప్పుడు రెడ్మి నోట్ 3 కాదు, Le 2 ఆ ప్లేస్ ను తీసుకుంది అని చెప్పవచ్చు. ఇదే బడ్జెట్ లో బెటర్ కెమెరా కావాలనుకుంటే మాత్రం Moto G4 ప్లస్ బెటర్.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class.

Connect On :