బెస్ట్ కంపేరిజన్: లేటెస్ట్ OnePlus 3T vs ఫేమస్ OnePlus 3

Updated on 08-Dec-2016

28 వేలకు రిలీజ్ అయ్యి బెస్ట్ వేల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ గా పేరు తెచ్చుకొని, ఇతర ఇంతర్నేషనల్ బ్రాండ్స్ కు గట్టి పోటీ ఇస్తున్న Oneplus 3 స్మార్ట్ ఫోన్ విడుదలైన 6 నెలలు తరువాత దీనికి అప్ గ్రేడ్ వేరియంట్ రిలీజ్ అయ్యింది.

దాని పేరే Oneplus 3T. T అంటే Turbo. అంటే ఆపిల్ ఐ ఫోన్లకు S ఏలాగో ఇక నుండి Oneplus కూడా అప్ గ్రేడ్ మోడల్స్ కు T అనే అక్షరం జోడిస్తుంది. 

ఆల్రెడీ మీకు రెండింటికీ స్పెక్స్ వైజ్ గా ఉండే తేడాలు గురించి తెలపటం జరిగింది. లుక్స్ వైజ్ గా మాత్రం రెండూ same అన్ని విధాలుగా కానీ output కంటెంట్ లో తేడాలు ఏంటి అని తెలియజేయటానికి ఈ ఆర్టికల్.

మరొకసారి ఇక్కడ స్పెక్స్ తేడాలు చూద్దాం..

  • 3T లో స్నాప్ డ్రాగన్ 821 SoC ఉంటే ఒరిజినల్ oneplus 3 820 SoC తో వస్తుంది.
  • బ్యాటరీ కూడా 400 mah పెరిగి 3400 mah తో వస్తుంది 3T. సో Oneplus 3 లో 3000 mah ఉంది.
  • కెమెరా సెగ్మెంట్ లో ఫ్రంట్ లో 16MP ఉంది 3Tలో. మొదటి మోడల్ లో 8MP ఉంటుంది ఫ్రంట్ లో.


అయితే ఈ స్పెక్స్ పెరగటం వలన, నిజంగా కంటెంట్ వైజ్ గా 3Tలో ఏమైనా డిఫరెన్స్ చూపిస్తున్నాయా? తెలుసుకుందాము రండి.

సింథటిక్ బెంచ్ మార్క్స్: కొంచెం పెరిగాయి.

రెండు ఫోనుల్లో నార్మల్ యాప్స్ లో పెర్ఫార్మన్స్ లో ఎటువంటి మైనస్ లేదు. అందులో ఎటువంటి డౌట్ లేదు.  ఒక్క సారి కూడా ఫోన్ లాగ్ అవటం చూడలేదు. సో అందుకే డైరెక్ట్ గా బెంచ్ మార్క్ స్కోర్స్ కు వేల్లిపోదాము..

 

అవును Oneplus 3T ఫాస్ట్ గా ఉంది Oneplus 3 కన్నా. అయితే ఈ ఫాస్ట్ డిఫరెన్స్ అనేది మరీ ఎక్కువగా లేదు. మీరు స్కోర్స్ గమనిస్తే గూగల్ పిక్సెల్ 3T కన్నా వెనుకబడి ఉంది, కానీ realtime usage లో నిజం చెప్పుకోవాలంటే గూగల్ పిక్సెల్ కొంచెం స్మూత్ గా ఉంటుంది oneplus 3T కన్నా.

Oneplus 3 ఫోన్ ను మేము రివ్యూ చేస్తున్నప్పుడు highest గా 40 డిగ్రిస్ celcius కు వెళ్ళింది టెంపరేచర్ ఎక్కువ లోడ్ ఇస్తే. అయితే ఆశ్చర్యంగా 3T లో కూడా ఇది same ఉంది. maximum 41 డిగ్రిస్ కు వెళ్ళింది అంతే. అంటే బాగున్నట్లే! ఎందుకంటే ఇవి టెంపరేచర్ టెస్ట్ లో భాగంగా హై లోడ్ కలిగే పనులు చేస్తున్నప్పుడు వచ్చినవే కాని రెగ్యులర్ usage లో ఉన్న టెంపరేచర్స్ కావు. పైగా ఆ హీటింగ్ కూడా చాలా త్వరగా కూల్ అయిపోవటం గమనించాము.

బ్యాటరీ: 13% పెరిగింది కాని తేడా తక్కువే.
పైన చెప్పినట్లు 3T లో 400 mah అదనపు కెపాసిటీ కలిగి ఉంది బ్యాటరీ కాని ఇది డే టు డే లైఫ్ లో పెద్దగా ఎక్కువ బ్యాక్ అప్ ఇస్తున్నట్లు తెలియటం లేదు. 10 నిముషాలు పాటు రెండు ఫోనుల్లో Asphalt 8 game ను ఆడితే, Oneplus 3 లో 6% బ్యాటరీ తగ్గగా, 3T లో 4%తగ్గింది. సో ఇది మరీ అంత పెద్ద సేవింగ్ ఏమి కాదు అని మా అభిప్రాయం. కాని కెపాసిటీ ఎంతో కొంత పెరిగినా సరే Oneplus 3 లానే 3T లో కూడా 0 నుండి 100% కు ఒక గంట – గంటన్నర లోపు బ్యాటరీ చార్జ్ అయిపోతుంది.

కెమెరా: ముందు కన్నా బాగుంది.
రెండింటిలో ఒకే వెనుక కెమెరా ఉంది. కాని 3T లో 
Oxygen OS (3.5.3) లేటెస్ట్ వెర్షన్ ఉండటం వలన కెమెరా లో కొత్త మార్పులు జరిగాయి. 3T తో తీసిన ఫోటోస్ మరింత బెటర్ కాంట్రాస్ట్ అండ్ sharpness కలిగి ఉన్నాయి. బ్రైట్ లైటింగ్ లో మరింత కాంతివంతంగా ఉన్నాయి కలర్స్. కాని low లైట్ లో మాత్రం రెండూ ఒకే లా తీస్తున్నాయి ఫోటోస్.

 
(లెఫ్ట్ )OnePlus 3T –  OnePlus 3 (కుడి)

స్పెక్స్ వైజ్ గా మేజర్ చేంజ్ గురించి చెప్పాలంటే 8MP నుండి 16MP మరీనా ఫ్రంట్ కెమెరా. ఇది బెటర్ ఫోటోస్ తీస్తుంది. డిటేల్స్ కూడా బాగా పెరిగాయి. sharpness కూడా బెటర్ గా ఉంది. ఫైనల్ గా చెప్పలంటే మేము చూసిన చాలా ఫ్రంట్ కేమేరాస్ లో ఇది నిజంగా బెస్ట్ ఫ్రంట్ కెమెరా.


OnePlus 3T, OnePlus 3

 

 

డిస్ప్లే: same 
ఏమి మార్పు లేదు. మొదటి మోడల్ లానే ఇది కూడా మంచి అమోలేడ్ డిస్ప్లే. warm కలరింగ్ తో వస్తున్న దీనిని కంపెని Optic amoled డిస్ప్లే అని పిలుస్తుంది. అంటే ఇది నార్మల్ అమోలేడ్ డిస్ప్లే కాదని చెబుతుంది oneplus.

బాటం లైన్
Oneplus 3T లో అన్ని విధాలుగా చూస్తే అప్ గ్రేడ్ ఫోన్ అని చెప్పలేము పూర్తిగా. Oneplus 3 కు స్వల్ప అప్ డేట్ అయ్యింది అని చెప్పాలి 3T.అలాగే price కు 28 వేల నుండి 30వేలకు పెరిగాయి. అంటే 2,000 రూ ప్రైస్ పెంచింది పైన చెప్పిన మర్పులుక్. కాని 128GB వేరియంట్ ప్రైస్ మాత్రం ఎక్కువగా( 34,999 రూ) ఉంది అనే వాదన ఉంది.

Oneplus 3T కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు అఫీషియల్ సైట్ లో ఈ లింక్ లో చూడగలరు.
Oneplus 3 64GB – 27,999 rs
కొత్త Oneplus 3T 64GB – 29,999 rs
Oneplus 3T 128GB – 34,999 rs

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Connect On :