SKOAR! College Cup: రూ. 30 లక్షల ప్రైజ్ మనీతో ఢిల్లీ ఎడిషన్ ను అనౌన్స్ చేసింది

Updated on 03-Dec-2025

న్యూఢిల్లీ, డిసెంబర్ 3, 2025: డిజిట్ మరియు టైమ్స్ నెట్‌ వర్క్, భారతదేశంలో ప్రముఖ బ్రాడ్‌ కాస్ట్ మరియు డిజిటల్ నెట్‌ వర్క్ కలిసి, SKOAR! College Cup – ఢిల్లీ ఎడిషన్ 2025 ను ప్రకటించాయి. ఇది భారతదేశంలో అతిపెద్ద కాలేజ్ ఈస్పోర్ట్స్ (eSports) టోర్నమెంట్‌గా నిలుస్తుంది. ఈ అతిపెద్ద పోటీకి మొత్తం రూ.30 లక్షల బహుమతిని ప్రకటించారు. ఈ ఈవెంట్ Oppo ప్రధాన భాగస్వామ్యంతో మరియు SanDisk స్టోరేజ్ భాగస్వామ్యంతో నిర్వహించబడుతోంది.

ఈ టోర్నమెంట్ దేశంలో కాలేజ్ ఈ-స్పోర్ట్స్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలన్న టైమ్స్ నెట్‌ వర్క్ సంకల్పాన్ని మరింతగా బలపరుస్తోంది. ఈ కొత్త ఎడిషన్‌ ద్వారా దేశ రాజధాని పరిసరాల నుంచి ఉత్తమ విద్యార్థి గేమర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, భారీ స్థాయి, అత్యంత ప్రతిష్ఠాత్మక పోటీగా నిర్వహించబోతోంది.

ఈ టోర్నమెంట్‌లో భారతదేశంలో అత్యధికంగా ఆడే రెండు ప్రముఖ ఈస్పోర్ట్స్ గేమ్స్ అయిన VALORANT మరియు BGMI లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇది కాలేజ్ టీమ్స్ కి జాతీయ స్థాయి వేదిక పై పోటీ చేసే గొప్ప అవకాశం మాత్రమే కాకుండా, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ ఈస్పోర్ట్స్ ఎకో సిస్టంలో తమ ప్రతిభకు తగిన గుర్తింపు పొందే అవకాశం కూడా అందిస్తున్నాయి.

Delhi-NCR ప్రాంతంలోని ప్రముఖ నగరాలైన న్యూఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ మరియు ఫరీదాబాద్ నుండి 200 కి పైగా కాలేజీలతో, 2,000 కు పైగా టీమ్స్ తో మరియు రూ. 30 లక్షల ప్రైజ్‌ పూల్‌ తో ఈ టోర్నమెంట్ భారత విద్యార్థి ఈ-స్పోర్ట్స్ రంగంలో ఒక కీలక మైలురాయి గా నిలుస్తుంది. ఈ టోర్నమెంట్ ద్వారా పెరుగుతున్న ప్రతిభను ప్రోత్సహించడం, అలాగే ఈ-స్పోర్ట్స్ రంగంలో ముందుకు సాగాలనుకునే యువ ఆటగాళ్లకు పరిశ్రమలో ఎదగడానికి ఒక శక్తివంతమైన వేదికను అందించడం ప్రధాన లక్ష్యంగా చేసుకుంది.

మల్టీ స్టేజ్ పై జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో చివరి దశగా 2026 ఫిబ్రవరి లో గ్రాండ్ ఫినాలే నిర్వహించబడుతుంది. ఈ గ్రాండ్ ఫినాలే లో అర్హత సాధించిన అత్యుత్తమ టీమ్ ఛాంపియన్ టైటిల్ కోసం ఉత్కంఠభరితమైన పోరులో తలపడతాయి.

ఈ టోర్నమెంట్ ద్వారా, SKOAR! యువ గేమర్లు మరియు ఈస్పోర్ట్స్‌ అభిలాషుల కోసం ఒక సమగ్రమైన, ప్రభావవంతమైన వేదికను నిర్మించడం కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, గేమింగ్ కమ్యూనిటీలు, ఈ స్పోర్ట్స్ అభిమానులు ఈ టోర్నమెంట్ ప్రయాణాన్ని అనుసరించి, తమ ఇష్టమైన టీమ్ లకు మద్దతు తెలుపుతూ, విస్తృతమైన SKOAR! ఈ స్పోర్ట్స్ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తోంది.

మ్యాచ్ షెడ్యూల్, హైలైట్స్ మరియు అప్డేట్స్ కోసం SKOAR! ఇన్‌స్టాగ్రామ్ పేజ్ @skoar.gg ను ఫాలో అవ్వండి.

ఈ టోర్నమెంట్, న్యూఢిల్లీలో జరిగిన Digit Zero1 అవార్డ్స్ కార్యక్రమంలో అధికారికంగా ఆవిష్కరించబడింది. భారతదేశ సాంకేతిక రంగంలో ముందంజలో ఉన్న ప్రతిభావంతులను ఉత్తమ పురస్కారం తో గౌరవించిన ఈ ఈవెంట్, దేశం యొక్క సాంకేతిక భవిష్యత్తును రూపొందించే సంచలనాత్మక పురోగతులను హైలైట్ చేయడమే కాకుండా నిరంతర ఆవిష్కరణ మరియు వృద్ధికి గొప్ప వేదికను ఏర్పాటు చేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :