TESTED:వీడియోలను కూడా 50% డేటా సేవింగ్ తో ప్లే చేసే Opera Max యాప్ ను టెస్ట్ చేయటం జరిగింది.

Updated on 12-Feb-2016

Opera బ్రౌజర్ యొక్క ఇంటర్నెట్ డేటా కంప్రెషన్ యాప్, Opera Max – మొబైల్ లేదా WiFi డేటా ను సేవ్ చేస్తుంది అని మనకు తెలుసు. Opera Max ప్లే స్టోర్ లో ఈ లింక్ లో ఉంది.

అయితే ఇది ఇమేజెస్, మ్యూజిక్ ఆఖరికి వీడియో ను కూడా కంప్రెస్ చేసే ఆప్షన్స్ తో వస్తుంది. 3G, 4G వంటి ఇంటర్నెట్ ప్లాన్స్ ఇప్పుడిప్పుడే అందరూ వాడేలా ఆఫర్స్ వస్తున్నాయి.

3G అండ్ 4G లో ఇంటర్నెట్ వాడితే, చాలా స్పీడ్ గా డేటా అయిపోతుంది. సో అలాంటి సందర్భాలకు ఓపెరా మాక్స్ వంటివి బాగా useful గా ఉంటాయి.

అసలు opera ఇంటర్నెట్ డేటా ఎలా సేవ్ చేస్తుంది?
మీకు అర్థమయ్యేలా సింపుల్ గా చెప్పాలంటే బ్యాక్ గ్రౌండ్ లో VPN కనెక్షన్ సెట్ అప్ చేసి.. ఒపేరా సొంత సర్వర్స్ నుండి డేటా ను ట్రాన్సఫర్ చేస్తుంది. ఈ సర్వర్స్ లో డేటా కంప్రెస్ అయ్యి ఉంటుంది.

యూట్యూబ్, Gaana, Saavn, Pandora, Slacker Radio అండ్ Netflix వంటి పాపులర్ మ్యూజిక్ మరియు వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్ లలో కూడా డేటా ను కంప్రెస్ చేస్తుంది Opera Max.

         
                             ఒపేరా మాక్స్ యాప్ ను ఆండ్రాయిడ్ లో సెట్ అప్ చేయటం

 Netflix ను WiFi కనెక్షన్ లో టెస్ట్ చేయటం జరిగింది.  Testing ఎలా చేశామో చూడండి..
1. ముందుగా ఈ యాప్స్ ను డౌన్లోడ్ చేయటం జరిగింది. ఓపెరా మాక్స్, netflix అండ్ My data manager.
2. ఒపేరా మాక్స్ చూపించే డేటా సేవింగ్ statistics కరెక్ట్ కదా లేదా అని తెలుసుకోవటానికి డేటా మేనజర్ యాప్ ను కూడా తెలియజేస్తున్నాము. దీనితో కంపేర్ చేయవచ్చు కదా డేటా సేవింగ్ లెక్కలు సేమ్ గా ఉన్నయా లేదా అని.

Data Used Without Opera Max:
15 నిమిషాలకు పాటు 
Orange is the New Black అనే హాలి వుడ్ టీవీ సీరియల్ ను Netflix లో చూస్తే, My Data Manager యాప్ లెక్కల ప్రకారం 200 MB అయ్యింది వీడియో స్ట్రీమింగ్ కు.

Data Used With Opera Max:
ఒపేరా 
మాక్స్ టోటల్ 15 నిమి usage లో 57.1MB అయ్యింది డేటా అని చెబుతుంది. అదే టైమ్ లో డేటా మేనేజర్ లో 63MB డేటా use అయినట్లు చూపిస్తుంది. అంటే రెండూ సెపరేట్ లెక్కలు ఇస్తున్నాయి ఒకే డేటా కు. 

ఒపేరా మాక్స్ యాప్ ప్రకారం 125.7MB (200 – 63mb) డేటా కు బదులు 57MB డేటా వాడింది మాక్స్. అంటే టోటల్ గా 54% డేటా సేవ్ అయ్యింది.


                                      Netflix Vs My data manager డేటా సేవింగ్స్         

అయితే ఇక్కడ mydata manager యాప్ లో 200Mb డేటా అని చూపించినప్పుడు ఒపేరా కూడా 200mb ను వాడాలి కదా సేవింగ్స్ ను calculate చేసేటప్పుడు. అలా కాకుండా ఒపేరా మాక్స్ 125.7Mb అని మాత్రమే చూపించింది 15 నిమి స్ట్రీమింగ్ కు.

అయితే ఇది బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న యాప్స్ ఇంటర్నెట్ ను వినియోగించినా లేదా WiFi ఇంటర్నెట్ అప్ అండ్ డౌన్ స్పిడ్స్ వలన జరిగి ఉండవచ్చు అని అంచనా. అలాగే నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఆటో ప్లే బ్యాక్ సెట్టింగ్స్ వలన అయిన అవ్వచ్చు.

సరే డేటా సేవ్ చేస్తుంది ఒకే కాని క్వాలిటీ సంగతి ఏమిటి?
క్వాలిటీ విషయానికి వస్తే 
కచ్చితంగా compressed క్వాలిటీ ఉంటుంది. అయితే buffering స్పీడ్ గా ఉంది. వీడియో క్వాలిటీ ఎవరేజ్ గా ఉంది. స్మార్ట్ ఫోన్ లో కనుక చూస్తుంటే వీడియో క్వాలిటీ మరీ బాగోకపోవటం ఉండదు. అయితే పెద్ద స్క్రీన్ ఉంటే అంటే టాబ్లెట్స్ వంటివి..అందులో క్వాలిటీ బాగా తగ్గుతుంది.

డేటా సేవింగ్స్ అనే కాకుండా ఒపేరా మాక్స్ లో మల్టిపుల్ users ఒకే wifi మీద రన్ అవుతునప్పుడు స్పీడ్ తగ్గే సమయంలో కూడా use అవుతుంది.

ఇంకా యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ wifi లేదా మొబైల్ ఇంటర్నెట్ ను వాడకుండా కూడా block చేస్తుంది. అయితే మాక్స్ యాప్ stock (ఒరిజినల్) ఆండ్రాయిడ్ పై రన్ అవ్వని ఫోన్ల లలో క్రాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అయితే దీని గురించి ఒపేరా డిప్యూటీ CTO ను సంప్రదించగా దానిపై వర్క్ చేస్తున్నట్లు తెలియజేసారు. సో మీ ఆండ్రాయిడ్ ఫోనులో Opera max ను ట్రై చేసి ఈ స్టోరి మీకు useful అయ్యిందో లేదో చెప్పండి.​

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Adamya Sharma

Managing editor, Digit.in - News Junkie, Movie Buff, Tech Whizz!

Connect On :