నోట్స్ బాన్ కారణంగా ఇండియాలో మొబైల్ wallet అవసరం వచ్చింది. సో వీటిని ఎలా వినియోగించుకోవాలి?

Updated on 10-Nov-2016

E-wallet అంటే ఏమిటి?
ఇది online మొబైల్ వాలెట్ అని చెప్పాలి. దీనిలో కూడా డబ్బులు వేసుకోగలరు. డిజిటల్ మనీ. cashless. సో ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఫిజికల్ గా మీరు కాష్ తీయనవసరం లేకుండా ఆన్ లైన్ లోనే డబ్బుకు సంబంధించిన అవసరాలను పూర్తి చేసుకోగలరు.

వీటి వలన ఉపయోగం ఉందా? ఉంటే ఏంటి అవి?
కొన్ని సందర్భాలలో దీని ఉపయోగం ఉంది. కేవలం కాష్ బాక్స్ రూపంలో డిస్కౌంట్స్ లేదా మనీ సేవింగ్ ఉంటుంది అనే విషయాలు మాత్రమే కాకుండా మీరు సీరియస్ మనీ related అవసరం లో పడినప్పుడు, ఇంటర్నెట్ ఉంటే చాలు ఎక్కడైనా మీ పని పూర్తి చేసుకోగలరు. దీనికి బాగా తెలిసిన ఉదాహరణ : మొబైల్ రీచార్జ్. కాని ఇదొక్కటే కాకుండా, నిజంగా చాలా అవసరాలు తీర్చుకోగలరు. 
 

E wallet లో ఉండే ఉపయోగాలు?

1. Instant కాష్ పేమెంట్. అంటే మీ వాల్లేట్ లో మీరు ఆల్రెడీ డబ్బులు వేసుకొని ఉంటె, 30 సేకేండ్స్ లో రీచార్జ్ మరియు ఇతర పనులు చేయగలరు.
2. ప్రతీ సారి, బ్యాంక్ అకౌంట్ లలో లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్స్ లలోకి లాగిన్ అవనవసరం లేదు.
3. మీరు ఓపెన్ చేసుకున్న ఓల్డ్ బ్యాంక్ కు ఓల్డ్ నంబర్స్ ఇస్తారు, కాని ఆ నంబర్స్ ను మీరు ప్రస్తుతం ఆక్టివ్ గా వాడుకోకపోవచ్చు, కాని ఏ ఆన్ లైన్ మనీ అవసరానికి అయినా ఆ inactive నంబర్ కు OTP కోడ్ వస్తుంటుంది. ఇలాంటి సందర్భాల్లో wallet లో ఒకసారి మనీ వేసుకొని ఉంటే, ప్రతీ సారి OTP కోసం ఆ నంబర్ ను ఫోన్ లో వేయటం వంటి అదనపు పనులను చేయనవసరం లేదు.
4. అదనంగా కాష్ బ్యాక్స్ వస్తాయి. అంటే మీరు కొంత మనీ పెట్టి ఏదైనా transaction చేస్తే, తిరిగి మీకు మీరు వాడుతున్న వాల్లేట్ కంపెని డబ్బులు వేస్తుంది మీ వాల్లేట్ లో.
5. ఏదైనా transaction ఫెయిల్ అయినా, మనీ రిటర్న్ అవుతుంది వెంటనే వాల్లేట్ లోకి.

E-wallet లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే, ఆన్ లైన్ బ్యాంక్ అకౌంట్ కచ్చితంగా ఉండాలా?
అవసరంలేదు! వాల్లేట్ ఏదైనా సరే, మీ వద్ద ఉన్నatm డెబిట్ కార్డ్ ద్వారా మనీ ఎంటర్ చేసుకోగలరు. అయితే వెరీ ఓల్డ్ SBI డెబిట్ కార్డ్స్ పై ఇది పనిచేయకపోయే సందర్భాలున్నాయి. సో మీరు మరలా మీ బ్రాంచ్ కు వెళ్లి కొత్త atm కార్డ్ అప్ప్లై చేస్తే ఈజీ గా దానిని వాడుకోగలరు. 

ప్రాక్టికల్ గా ఇవి తీర్చే అవసరాలు ఏంటి?
1. కరెంటు బిల్ పేమెంట్
2. DTH కేబుల్ పేమెంట్
3. College ఇన్స్టిట్యూట్ లకు FEES పేమెంట్
4. METRO స్టేషన్స్ ట్రైన్ passes.
5. బ్రాడ్ బాండ్ బిల్స్
6. DATA CARDS – dongles recharges
7. GAS
8. Insurances 
9. Water bills
10. పెట్రోల్ బంక్స్
11. మూవీ టికెట్స్
12. IRCTC including tatkal పేమెంట్స్
13.  car, cabs, బస్, ఫ్లైట్, హోటల్ బుకింగ్స్,
14. online షాపింగ్.
15. మొబైల్ – ప్రీ పైడ్ అండ్ పోస్ట్ పైడ్ recharges
16. మనీ transfer to other wallets అండ్ నంబర్స్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ అండ్
17. ఫైనల్ గా మనీ కూడా ఆడగలరు మీకు తెలిసిన వారిని.
పైన చెప్పిన ఇవన్నీ paytm wallet లోనివి. మిగిలిన wallets లో కూడా వీటిలో ఎక్కువ శాతం పనిచేస్తాయి. అయితే ఈ సర్వీసెస్ కొన్ని.. ఏరియాస్ వైజ్ గా మాత్రమే పనిచేస్తాయి.

సరే, బెస్ట్ wallet సర్వీస్ ఏది?
నా అనుభవం లో PayTM, mobikwik బాగున్నాయి.

wallet అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి?
చాలా సింపుల్. మీ మొబైల్ నంబర్ కచ్చితంగా ఎంటర్ చేయాలి. తరువాత మెయిల్ ఐడి అండ్ పాస్ వర్డ్. అంతే. అకౌంట్ క్రియేట్ అయిన తరువాత ఆ wallet లో మనీ యాడ్ చేయాలి. ఇందుకు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ నుండి డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా wallet లోకి మనీ యాడ్ చేయాలి. అంతే! ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను తెలుపగలరు.​

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :