Digit Zero 1 Awards 2025 best buy awards 2025 now open
Digit Zero 1 Awards 2025: ఇరవై సంవత్సరాలకు పైగా టెక్ పరీక్షించడంలో డిజిట్ కష్టపడి పని చేసింది, ఈ దారిలో కొత్త టెక్ ను పరిచయం చేసిన వారిలో బెస్ట్ బై అవార్డ్స్ 2025 తో పాటు డిజిట్ జీరో1 అవార్డ్స్ 2025 ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. డిజిట్ నిర్వహించే కార్యక్రమాల ద్వారా గొప్ప పనితీరు మరియు కన్స్యూమర్ టెక్ ప్రపంచంలో డబ్బుకు తగిన విలువ అందించిన వాటిలో ఈ సంవత్సరపు అత్యుత్తమ సంస్థలను గుర్తిస్తుంది.
జీరో1 అనేది అత్యున్నత పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతుంది. స్పష్టమైన ఇంజనీరింగ్ లాభాలు మరియు విశ్వసనీయమైన, పునరావృత రిజల్ట్స్ ద్వారా తమ కేటగిరీలు ముందుకు నడిపించే బెస్ట్ ప్రొడక్ట్స్ ని మేము హైలైట్ చేస్తాము. “ప్రస్తుతం ఉన్నవాటిలో వేగవంతమైనది లేదా అత్యంత సామర్థ్యం గలది ఏమిటి” అనే ప్రశ్నకు మీరు ఖచ్చితమైన సమాధానం కోరుకుంటే, జీరో1 అవార్డ్స్ నుంచి మీకు సమాధానం మీకు దొరుకుతుంది.
బెస్ట్ బై అనేది జీరో1 కి మరో వైపు ఉంటుంది మరియు సరిసమానమైన సమాధానం ఇస్తుంది: మీ డబ్బు ఎక్కడికి వెళుతుంది అనేది దీనికి సరైన ప్రశ్న. ఈ అవార్డులు బలమైన ఫలితాలను అందించే ఉత్పత్తులను గుర్తిస్తాయి మరియు ప్రైస్, నిర్వహణ ఖర్చులు మరియు వినియోగ సౌలభ్యం పై స్మార్ట్ ప్రోడక్ట్ ని గుర్తిస్తాయి. ఇది చాలా సింపుల్ ఐడియా, ఎక్కువ ఖర్చు చేయకుండా అద్భుతమైన సాంకేతికతను ఎక్కువ మంది వ్యక్తులు యాక్సెస్ చేయగలిగే అవకాశం అందిస్తుంది.
మేము పరిశీలించే 40 కేతగిరీలు ఇక్కడ చూడవచ్చు.
గేమింగ్ ల్యాప్ టాప్ (ధర 250K+ ప్రైస్ లిమిట్ లేదు)
గేమింగ్ ల్యాప్‌టాప్ (151K – 250K మధ్యలో)
గేమింగ్ ల్యాప్‌టాప్ (60K – 150K మధ్యలో)
మెయిన్ స్ట్రీమ్ ల్యాప్‌టాప్
క్రియేటర్ ల్యాప్‌టాప్
ప్రీమియం సన్నని మరియు తేలికైన ల్యాప్‌టాప్
ప్రీమియం / ఫ్లాగ్ షిప్ (50 వేలకు పై చిలుకు)
హైఎండ్ (35 వేల – 50వేల మధ్యలో)
మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ (20 వేల -35 వేల మధ్యలో)
బడ్జెట్ స్మార్ట్ ఫోన్ (20 వేల లోపు)
కెమెరా ఫోన్ (బడ్జెట్ లేదు)
గేమింగ్ స్మార్ట్ ఫోన్ (బడ్జెట్ లేదు)
ఫోల్డబుల్ ఫోన్ (ఫ్లిప్ & ఫోల్డ్)
AI స్మార్ట్‌ఫోన్
ఉత్తమ బ్యాటరీ ఫోన్ (బడ్జెట్ లేదు)
ఉత్తమ OLED టీవీలు
ఉత్తమ మినీ LED టీవీలు
బ్లూటూత్ స్పీకర్
వైర్ లెస్ హెడ్ ఫోన్‌లు
ప్రీమియం ట్రూ వైర్ లెస్ ఇయర్ ఫోన్‌లు
మిడ్-రేంజ్ ట్రూ వైర్ లెస్ ఇయర్ ఫోన్‌లు
బడ్జెట్ ట్రూలీ వైర్ లెస్ ఇయర్ ఫోన్‌లు
డెస్క్ టాప్ ప్రోసెసర్
స్మార్ట్ ఫోన్ SoC
NVMe SSD
ఎక్స్టర్నల్ SSD
గ్రాఫిక్స్ కార్డ్
Wi-Fi 6 రౌటర్ (అండర్ ₹10k)
కీబోర్డ్
మెకానికల్ కీబోర్డ్
గేమింగ్ మైస్
స్మార్ట్ వాచ్ (ప్రైస్ లిమిట్ లేదు)
టాబ్లెట్
గేమింగ్ మోనిటర్
మేము మొదటి ఇంప్రెషన్ లేదా మార్కెటింగ్ క్లెయిమ్స్ పై ఆధారపడము. ప్రతి షార్ట్ లిస్ట్ చేయబడిన ప్రోడక్ట్ ను వాటి కొలతలు మరియు పునరావృత ఫలితాల పై దృష్టి సారించే నిర్మాణాత్మక టెస్ట్ ప్లాన్ ద్వారా ఉంచుతాము. Zero1 తీర్పు కోసం, ధర, డిజైన్ వృద్ధి మరియు అదనపు ఫీచర్స్ ని తీసివేస్తాము మరియు ప్రధాన పని పరిశ్రమ-ప్రముఖ ప్రమాణాలకు అనుగుణంగా జరిగిందా లేదా అనే దానిపై మేము దృష్టి పెడతాము. స్పష్టంగా పెర్ఫార్మెన్స్ కొలవడానికి అదే Zero1 ను ప్రధమం గా నిలబెడుతుంది.
ఈ స్పష్టత వల్లే ఈ అవార్డులు ముఖ్యమైనవి. మీరు భారతదేశంలో అత్యంత వేగవంతమైన గేమింగ్ ల్యాప్ టాప్ లేదా బడ్జెట్ పరిధి లేకుండా గొప్ప సామర్థ్యం గల కెమెరా ఫోన్ కోసం వెతుకుతున్నట్లయితే, జీరో1 విన్నర్ మీకు రిఫరెన్స్ గా ఉంటుంది. కేటగిరీ టాపర్స్ న్నీ గుర్తించడం ద్వారా, ఈ అవార్డులు మరుసటి సంవత్సరం మళ్లీ వాటి స్థాయిని పెంచడానికి ఇండస్ట్రీని ప్రోత్సహిస్తాయి.
డిజిట్ జీరో1 అవార్డ్స్ 2025 మరియు బెస్ట్ బై అవార్డ్స్ 2025 కోసం ఎంట్రీలను సబ్మిట్ చేయడానికి బ్రాండ్ లను ఆహ్వానించారు. నిష్పాక్షికత మరియు పూర్తి మూల్యాంకనాన్ని నిర్ధారించడానికి, అర్హత కలిగిన ఉత్పత్తులను 15 నవంబర్ 2024 మరియు 31 అక్టోబర్ 2025 మధ్య భారత మార్కెట్లో లాంచ్ చేయాలి మరియు అందుబాటులో ఉంచాలి. ముందుగా సబ్మిట్ అయిన ప్రతి ప్రోడక్ట్ దాని యోగ్యతలను మరింత లోతుగా పరీక్షించేలా అవకాశం కలిగి ఉంటుంది.
జీరో1 అవార్డ్స్ 2025 టైటిల్స్ తో పాటు 40 కేటగిరీలలో బెస్ట్ బై విన్నర్ లను కూడా డిజిట్ ప్రకటిస్తుంది. జీరో1 ప్రైస్ నిర్ణయించనిది, బెస్ట్ బై కాదు. ఇక్కడ విన్నర్ కేటగిరీ కంపారిజన్ షీట్లలో డబ్బుకు తగిన విలువ అందించే స్కోరింగ్ ద్వారా నిర్ణయిస్తారు, ఇది సరైన ధరతో సాలిడ్ పెర్ఫార్మెన్స్ ను సమతుల్యం చేస్తుంది.
డిజిట్ కమ్యూనిటీని కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేయమని మేము ఆహ్వానిస్తున్నాము. పాపులర్ ఛాయిస్ పాఠకులు మరియు వీక్షకులు క్యూరేటెడ్ షార్ట్ లిస్ట్ లో ఈ సంవత్సరంలో తమకు ఇష్టమైన గాడ్జెట్ లకు ఓటు వేయడానికి అనుమతిస్తుంది. మీ దినచర్యను మార్చిన ఫోన్ అయినా లేదా మీ ప్రొడక్టివిటీ పెంచిన ల్యాప్ టాప్ అయినా, మీ ఓట్ కమ్యూనిటీ ఛాంపియన్ లను నిర్ణయిస్తాయి.
డిజిట్ జీరో1 అవార్డ్స్ మరియు బెస్ట్ బై అవార్డ్స్ అనేది లీడింగ్ పెర్ఫార్మెన్స్ లేదా స్పష్టమైన విలువ ద్వారా వినియోగదారులు అనుభవించగల పురోగతిని జరుపుకుంటారు. బ్రాండ్స్ విశ్వసనీయ గుర్తింపును పొందుతాయి, కొనుగోలుదారులు ఈ సంవత్సరంలోని అగ్రశ్రేణి సాంకేతికతకు నమ్మకమైన మార్గదర్శిని పొందుతారు. 2025 లో వచ్చిన వాటిలో మిగిలిన వాటిని అధిగమించి, డబ్బుకు విలువ పెంచిన విజేతల కోసం ఇక్కడ ఒక లుక్ వేసి ఉంచండి.