మోటోరోలా వన్ యాక్షన్ కెమేరా నిజంగా ఒక అద్భుతం

HIGHLIGHTS

మోటరోలా ఒక ప్రత్యేకకార్యక్రమం ద్వారా తన ఒక అల్ట్రా వైడ్ యాక్షన్ కెమేరాతో ట్రిపుల్ రియర్ కెమేరా ఫోన్ అయినటువంటి మోటోరోలా యాక్షన్ వన్ స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, చూడడానికి మోటో వన్ విజన్ మాదిరిగా కనిపిస్తుంది కానీ వెనుక మూడు కెమేరాలతో  కేవలం రూ. 13,999 ధరతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆగష్టు 30 వ తేదీకి మొదటి ఫ్లాష్ సేల్ జరగనుంది.     

వన్ యాక్షన్ కెమేరా ప్రత్యేకతలు

ఈ ఫోన్  కెమెరా గురించి మాట్లాడితే, ఈ స్మార్ట్ ఫోనులో వెనుక ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ఒక f /1.8 అపర్చరు కలిగిన 12 MP ప్రధాన కెమెరా మరియు 5MP డెప్త్ కెమెరాతో పాటుగా f/2.2 అపర్చరు గల ఒక 16MP అల్ట్రా వైడ్ యాక్షన్ కెమేరా  కూడా  ఉంటుంది. ఇక సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం f/2.0 అపర్చరుతో ఒక 12MP సెల్ఫీ కెమెరా ఉంది.

ఇవన్నీ కూడా మనకు సాధారంగా తెలిసినవే. అయితే  ఈ కెమేరా గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విష్యం ఏమిటంటే, మనం సాధారంగా వీడియోలను నిలువుగా తీసినట్లయితే చూసేప్పుడు కూడా అలాగే చూడల్సివస్తుంది. కానీ, ఈ స్మార్ట్ ఫోనులో అందించిన కెమేరాతో వీడియోలను నిలువుగా లేదా అడ్డంగా తీసినా కూడా అది మనకు పూర్తి స్క్రీన్  పైన చేసుకునేలా అందిస్తుంది. ఈ అవకాశం కలిగిన ఏకైన ఫోన్  ఈ మోటో వన్ యాక్షన్ స్మార్ట్ ఫోన్.

ఇందులో అందించిన 117 డిగ్రీల 16MP  యాక్షన్ కెమేరా మీరు తీసే వీడియోలకు ప్రాణం పోస్తుంది. వీడియోలు చాల స్పష్టంగా మరియు మంచి వివరాలతో అందిస్తుంది. అధనంగా, వెలుగు తక్కువగా వున్నా సమయాల్లో కూడా ఈ ఫోన్ మంచి విడిలను తీసుకునేలా ఉంటుంది. అలాగే, ఇందులో అందించిన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (AI) వీడియోలకు మరింత సామర్ధ్యాన్ని అందిస్తుంది.                  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :