iQOO Neo 9s Pro plus with 50MP Sony IMX 921 in China market
iQOO Neo 9s Pro+ స్మార్ట్ ఫోన్ ను Sony లేటెస్ట్ పవర్ ఫుల్ కెమెరా మరియు భారీ ఫీచర్లతో లాంచ్ చేసింది. ఐకూ ఈరోజు చైనాలో నిర్వహించిన ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా ఐకూ 9 సిరీస్ నుండి కొత్త ఫోన్ లను విడుదల చేసింది. ఐకూ నియో 9s ప్రో ప్లస్ ఫోన్ ను కేవలం పైన తెలిపిన ఫీచర్లతో మాత్రమే కాదు చాలా గొప్ప ఫీచర్స్ తో పాటు ఆకర్షణీయమైన డిజైన్ మరియు కలర్ వేరియంట్లలో అందించింది. అయితే, ఈ ఫోన్లను ప్రకటించింది ఇండియా మార్కెట్ లో కాదు చైనా మార్కెట్లో.
ఐకూ నియో 9s ప్రో ప్లస్ స్మార్ ఫోన్ ను సరికొత్త అల్ట్రాసోనిక్ 3D ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ కలిగిన 6.78 ఇంచ్ 8T AMOLED స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1400 నిట్స్ గ్లోబల్ ఎక్సిషన్ బ్రైట్నెస్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కామ్ లేటెస్ట్ పవర్ ఫుల్ ప్రోసెసర్ Snapdragon 8 Gen 3 తో తెచ్చింది. దానికి జతగా 12GB/ 16GB LPDDR5X ర్యామ్ సపోర్ట్ మరియు UFS 4.0 1TB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా వుంది.
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సపోర్ట్ ను అందించింది. అయితే, ఇందులో పవర్ ఫుల్ సెన్సార్ లను భారీ ఫీచర్స్ తో జత చేసింది. ఈ ఫోన్ కెమెరా సెటప్ లో సూపర్ OIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX 921 మెయిన్ కెమెరా మరియు 50MP Samsung JN అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ కెమెరా 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది మరియు 1080p స్లోమోషన్ వీడియో లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో అద్భుతమైన RAW మరియు నైట్ ఫోటోలను పొందవచ్చని కంపెనీ తెలిపింది.
Also Read: Honor 200 5G స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ 50MP స్టూడియో లెవల్ పోర్ట్రైట్ కెమెరాలతో వస్తోంది.!
ఈ ఫోన్ లో AI పోలిషింగ్, AI P ఫిగర్, AI ఎడిటింగ్ వంటి గుట్టల కొద్దీ AI ఫీచర్లు ఉన్నట్లు కూడా ఐకూ తెలిపింది. ఈ ఐకూ ఫోన్ లో 5500mAh బిగ్ బ్యాటరీ ఉంది మరియు ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది.
iQOO Neo 9s Pro+: ప్రైస్ (చైనా)
ఈ ఫోన్ ను నాలుగు వేరియంట్లలో అందించింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ ను RMB 2999 (సుమారు రూ. 35,000) ధరలో ప్రకటించింది. ఇది 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో ఉంటుంది. అయితే, ఈ ఫోన్ ను ఇండియాలో విడుదల చేస్తుందా లేదా అని కంపెనీ ఇంకా తెలియ చేయలేదు.