CMF BUDS PRO 2 with Hi-Res audio wireless launched
CMF BUDS PRO 2: ఈరోజు నథింగ్ సబ్ బ్రాండ్ CMF కొత్త ఇయర్ బడ్స్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే నెక్ బ్యాండ్ మరియు రెండు బడ్స్ ను అందించిన CMF ఈరోజు మరొక కొత్త బడ్స్ ను అందించింది. ఈ రోజు CMF Phone 1 తో పాటు ఈ బడ్స్ ప్రో 2 ను కూడా విడుదల చేసింది. ఈ బడ్స్ ను డ్యూయల్ స్పీకర్లు మరియు Hi-Res ఆడియో సపోర్ట్ తో లాంచ్ చేసింది.
బడ్స్ ప్రో 2 ఇయర్ బడ్స్ ను రూ. 4,299 ప్రైస్ ట్యాగ్ తో విడుదల చేసింది.
బడ్స్ ప్రో 2 ఇయర్ బడ్స్ ను చాలా ఫీచర్లతో అందించింది. ఈ బడ్స్ 11mm BASS స్పీకర్ మరియు 6mm మైక్రో ప్లానర్ ట్వీటర్ తో వస్తుంది. దీన్ని డ్యూయల్ డ్రైవర్ స్పీకర్ అంటారు మరియు ఇది మంచి బ్యాలెన్స్ మరియు క్రిస్పీ సౌండ్ అందిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ లో కుప్పల కొద్ది ఫీచర్లు అందించింది. ఈ బడ్స్ Dirac Opteo, అల్ట్రా బాస్ టెక్నాలజీ 2.0, LDAC కోడెక్ మరియు కస్టమ్ ఈక్వలైజర్ వంటి ఫీచర్లను కలిగి వుంది.
ఈ బడ్స్ హైబ్రిడ్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ మరియు కాలింగ్ కోసం నోయిస్ క్యాన్సెలింగ్ అల్గారిథం తో వస్తుంది. అంటే, గొప్ప లీనమయ్యే సౌండ్ మరియు కాలింగ్ అందిస్తుంది. ఈ బడ్స్ లో స్మార్ట్ ANC, అడాప్టివ్ ANC మరియు ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఉన్నాయి. బడ్స్ తో 11 గంటల ప్లే టైమ్ ను మరియు టోటల్ 43 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఇది స్పెటియల్ ఆడియో ఎఫక్ట్ అందిస్తుంది.
Also Read: CMF Phone 1 5G: బడ్జెట్ రేటులో 4K కెమెరా మరియు ఫాస్ట్ ప్రోసెసర్ తో వచ్చింది.!
ఈ బడ్స్ Hi-Res ఆడియో వైర్లెస్, Dirac మరియు LDAC సపోర్ట్ లతో వస్తుంది. అలాగే, 50 db హైబ్రిడ్ ANC తో వస్తుంది. డ్యూయల్ కనెక్షన్, IP55 రేటింగ్ తో వస్తుంది. వినూత్నమైన డిజైన్ మరియు కస్టమైజబుల్ స్మార్ట్ డయల్ ఫీచర్ ఈ బడ్స్ ను ఇతర బడ్స్ తో సెపరేట్ చేస్తుంది.