Realme NARZO 80 Pro 5G స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
Realme NARZO 80 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది
ఈ ఫోన్ ను స్టన్నింగ్ ఫీచర్స్ తో ఆకట్టుకునే ప్రైస్ ట్యాగ్ తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది
రియల్ మీ నార్జో 80 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది
Realme NARZO 80 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి గత కొన్ని రోజులుగా టీజింగ్ చేస్తున్న రియల్ మీ ఈరోజు ఎట్టకేలకు ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను స్టన్నింగ్ ఫీచర్స్ తో ఆకట్టుకునే ప్రైస్ ట్యాగ్ తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ రోజే సరికొత్తగా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.
SurveyRealme NARZO 80 Pro 5G : ప్రైస్
రియల్ మీ నార్జో 80 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ బేసిక్ (8GB + 128GB) వేరియంట్ రూ. 19,999 ధరతో, (8GB + 256GB) వేరియంట్ రూ. 21,999 ధరతో మరియు హై ఎండ్ (12GB + 256GB) వేరియంట్ ను రూ. 23,499 ధరతో లాంచ్ చేసింది.
ఈ ఫోన్ పై రూ. 1,500 కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 500 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ సాయంత్రం 6 గంటలకు ఈ ఫోన్ అర్లీ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ స్పీడ్ సిల్వర్ మరియు రేసింగ్ గ్రీన్ రెండు కలర్స్ లో లభిస్తుంది.
Realme NARZO 80 Pro 5G : ఫీచర్స్
ఈ రియల్ మీ కొత్త ఫోన్ 6.7 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4500 నిట్స్ హైపర్ గ్లో ఈ స్పోర్ట్స్ డిస్ప్లే మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ చిప్ సెట్ కి జతగా 12GB ఫిజికల్ ర్యామ్, 14GB Dynamic RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

రియల్ మీ నార్జో 80 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP Sony IMX882 OIS మెయిన్ కెమెరా మరియు మోనోక్రామ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ కెమెరా 4K రిజల్యూషన్ మరియు 1080p Cinematic వీడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ మరియు 80W అల్ట్రా ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటాయి.
Also Read: చవక ధరలో లభిస్తున్న బెస్ట్ 32 ఇంచ్ QLED Smart Tv డీల్స్ పై ఒక లుక్కేద్దామా.!
ఈ ఫోన్ కలిగిన మరిన్ని ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ సైక్లోన్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. రియల్ మీ ఈ ఫోన్ ను IP69 టాప్ టైర్ వాటర్ ప్రూఫ్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ Hi-Res Audio స్పోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది. ఇన్ని ఫీచర్లు కలిగి ఉన్నా ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 7.55mm మందంతో చాలా సన్నగా మరియు 179 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది.