Voter Card Update: ఓటర్ కార్డ్ లో అడ్రెస్స్ సరిచేసుకోవాలా.!
ఓటర్ కార్డ్ లో ఉన్న అడ్రెస్స్ అప్డేట్ సరిగ్గా ఉంచుకోవడం సరైన మార్గం
ఇళ్ళు మారినప్పుడు అడ్రెస్స్ మారుతుంది కాబట్టి అడ్రెస్స్ ను అప్డేట్ చేసుకోవాలి
మీ ఓటర్ కార్డ్ లో ఉండే అడ్రెస్స్ ను అప్డేట్ చేసుకోవడానికి సింపుల్ మార్గం
Voter Card Update: ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీ ఓటర్ కార్డ్ లో ఉన్న అడ్రెస్స్ ను అప్డేట్ లేదా సరిచేసుకోవడానికి చూస్తున్నట్లయితే, సింపుల్ మార్గం మీ ముందు ఉంది. కేవలం ఓటు వెయ్యడానికి కాదు, ఓటర్ కార్డ్ లో మీ అడ్రెస్స్ మరియు పేరు వంటి ఇతర అన్ని వివరాలు కూడా సరిగ్గా ఉంచుకోవడం సరైన మార్గం. ఒకవేళ మీ ఓటర్ కార్డ్ లో మీ అడ్రెస్స్ తప్పుగా ఉన్నట్లయితే, మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి మీ ఓటు హక్కును వినియోగించుకోవలసి ఉంటుంది. అంతేకాదు, మరే ఇతర పనులకైనా కూడా ఇదే ఇబ్బంది మీకు ఎదురవుతుంది.
అందుకే, మీ ఓటర్ కార్డ్ లో ఉండే అడ్రెస్స్ ను అప్డేట్ చేసుకోవడం సరైన మార్గంగా ఉంటుంది. కేవలం అడ్రెస్ గురించి మాత్రమేస్ ఎందుకు ప్రత్యేకంగా చెప్పవలసి వస్తుంది? మీరు అనుకోవచ్చు. పేరు మరియు ఇతర వివరాలు మారనప్పటికి ఇళ్ళు మారినప్పుడు అడ్రెస్స్ మారుతుంది కాబట్టి అడ్రెస్స్ ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
Voter Card Update:
అడ్రెస్స్ ను అప్డేట్ లేదా సరిచేసుకోవాలని చూస్తున్న ఓటర్ కార్డ్ హోల్డర్స్ voters.eci.gov.in సైట్ ను సందర్శించడం ద్వారా వినతిని అందించవచ్చు. దీనికోసం, ముందుగా voters.eci.gov.in పోర్ట్ ను ఓపెన్ చెయ్యాలి. సైట్ ఓపెన్ అయిన తరువాత హోమ్ పేజ్ లో Fill Form 8 అనే బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ బాక్స్ లో Shifting of residence/correction అనే బాక్స్ ను ఎంచుకోవాలి.
ఈ పోర్టల్ లో మీకు అకౌంట్ ఉన్నట్లయితే ముందుగా లాగిన్ అవ్వండి. ఒకవేళ మీకు అకౌంట్ లేకుంటే మాత్రం కొత్త ఐడి ని క్రియేట్ చేసువాల్సి ఉంటుంది. దీనికోసం మీ మొబైల్ నెంబర్ మరియు క్రింద అందించిన క్యాప్చా ఎంటర్ చేయండి. వెంటనే కొత్త పేజ్ వస్తుంది మరియు ఇక్కడ మీ పేరు మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి OTP కోసం రికేష్ చేయాలి. అంతే, మ్రు అందుకున్న OTP ఎంటర్ చేసి సబ్ మీట్ చేస్తే మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది.
Also Read: vivo T2x 5G: రెండు కొత్త కలర్ వేరియంట్స్ లో వివో బడ్జెట్ 5G ఫోన్.!
ఓటర్ కార్డ్ అడ్రెస్స్ అప్డేట్
మీ అకౌంట్ తో లాగిన్ అయిన తరువాత ఫీల్ ఫామ్ 8 బాక్స్ పైన నొక్కండి. ఇక్కడ కొత్త పేజ్ తెరుచుకుంటుంది. ఇక్కడ ఎవరి ఓటర్ కార్డ్ కోసం మీ రిక్వెస్ట్ చేస్తున్నారో అడుగుతుంది. ఇందులో Self మరియు others ఆప్షన్ లు వస్తాయి. మీకు తగిన ఆప్షన్ ను ఎంచుకోండి. తరువాత, ఓటర్ ఐడి నెంబర్ అందించమనే రిక్వెస్ట్ వస్తుంది. ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్న వారి ఓటర్ ఐడి నెంబర్ ను ఎంటర్ చేసి సబ్ మిట్ చేయండి. తరువాత, మీ వివరాలను అందించని అడుగుతూ కొత్త బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో, ఇక్కడ సూచించిన మీ పేరు మరియు ఇతర వివరాలను అందించి OK చేయండి.
ఇక్కడ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు Shifting Of Residence ఆప్షన్ ను ఎంచుకోండి. ఇక్కడ మీకు మీ రిక్వెస్ట్ కోసం అవసరమైన Form 8 కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ రాష్ట్రం, జిల్లా మరియు మీ అసెంబ్లీ కాన్స్టిట్యూఎన్సీ పేరు లేదా నెంబర్ ఎంటర్ చేసి Section – B లో మీ పేరు మరియు ఇతర వివరాలను అందించిన తరువాత మార్చుకోవాలి అనుకుంటున్న అడ్రెస్స్ వివరాలను కోడోత్ ఎంటర్ చెయ్యాలి. ఈ వివరాలను అందించిన తరువాత కొత్త అడ్రెస్స్ ను ధృవీకరించే ఏదైనా ఒక ధ్రువీకరణ పత్రాన్ని అప్లోడ్ చేసి షబ్ చెయ్యాలి.