స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Sep 24 2020
Slide 1 - స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

ఈ స్మార్ట్ ఫోన్లు మన జీవితాల్లో కీలకమైన భాగంగా మారాయి,  సన్నిహితమైన  మరియు ప్రియమైనవారితో మరింత సన్నిహితంగా వుండేలా చెయ్యడమే కాక, వ్యాపార మరియు ఉద్యోగ సాధనంగా కూడా పనిచేస్తాయి.  మనలో కొందరు  వినోద సాధనంగా అనుకుంటే,  చాలామంది ప్రత్యేక జ్ఞాపకాలను ఒడిసి పట్టుకోవటానికి  ఏకైక మార్గంగా ఉపయోగిస్తారు. రోజురోజుకూ స్మార్ట్ ఫోన్ల కోసం డిమాండ్ పెరిగింది కాబట్టి, సరఫరా కూడా పెరిగింది.

Slide 2 - స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

అయితే, ఒక స్మార్ట్ ఫోన్ గొప్పగా చేయ్యాలంటే దాని ప్రాసెసర్ కొన్ని మంచి వివరాలను కలిగి ఉండాలి. అందులో, ప్రాసెసర్ బ్రాండ్, Cores మరియు క్లాక్ స్పీడ్ వంటి చాలా విషయాలను పరిశీలించవలసి వుంటుంది. అందుకే, ప్రాసెసర్ గురించి మీకు వివరించే ప్రయత్నం చేశాము.             

Slide 3 - స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

ప్రాసెసర్

 

ప్రయోజనం: మరింత శక్తివంతమైన ప్రాసెసర్, తక్కువ ఫోన్ హ్యాంగ్ అవ్వడం .

Slide 4 - స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

అసలు విషయం ఏమిటి ?

 

స్మార్ట్ ఫోన్ యొక్క మెదడుగా ప్రాసెసర్ ని అనుకుంటే. ఎక్కువ శక్తివంతమైన ఒక ప్రాసెసర్ ద్వారా, సున్నితమైన ఫోటో ఎడిటింగ్ , యాప్స్ (APPs)  వేగంగా తెరవబడతాయి మరియు సహజంగానే, గేమింగ్ ల్యాగ్ వంటివి ఉండవు . ప్రస్తుతం, మొబైల్ ఫోన్ల కోసం అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865, ఇది వన్ ప్లస్, షియోమీ, రియల్ మీ  మరియు శామ్సంగ్ వంటి ఫోన్లలో  అందుబాటులో ఉంది.  కొన్ని నెలల క్రితం వరకు, స్నాప్ డ్రాగన్ 855 అనేది టాప్ మొబైల్ CPU గా ఉంది, కాబట్టి ఆ ప్రాసెసర్తో ఉన్న ఫోన్ పనితనం కూడా చక్కగా ఉంటుంది.

Slide 5 - స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

ప్రాసెసర్ బ్రాండ్

 

ప్రయోజనం: తక్కువ ధర విభాగంలో ఎక్కువ ఎంపికల సౌలభ్యం తెస్తుంది.

Slide 6 - స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

అసలు విషయం ఏమిటి ?

 

చాలా Android స్మార్ట్ ఫోన్లు క్వాల్కమ్ లేదా మీడియా టెక్ ప్రాసెసర్లతో వస్తాయి. క్వాల్కమ్ ప్రాసెసర్,  హై ఎండ్ స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ ఎంపిక అయితే, మీడియా టెక్ ఎంట్రీ స్థాయి స్మార్ట్ ఫోన్ల కోసం మరియు మధ్య శ్రేణి కోసం రూపొందించిన ప్రాసెసర్లపై దృష్టి పెడుతుంది. ఈ ప్రాసెసర్లు పవర్ మరియు బ్యాటరీ జీవితాల మధ్య సమతుల్యతను నమోదు చేస్తాయి. స్నాప్ డ్రాగన్ మరియు మీడియా టెక్ ప్రాసెసర్ల మధ్య, స్నాప్ డ్రాగన్ చిప్స్ సాధారణంగా మంచి పనితీరును కలిగి ఉంటాయి, కానీ అధిక ధరతో వస్తాయి.

Slide 7 - స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

సొంత ప్రాసెసర్ గల స్మార్ట్ ఫోన్స్ సంస్థలు 

 

మీరు శామ్సంగ్ లేదా హానర్ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేస్తే, మీరు వాటిని ఎక్సినోస్ లేదా కిరిణ్ CPU తో ప్రత్యేకంగా చూడవచ్చు. ఆపిల్ దాని సొంత ప్రాసెసర్ ని ఐఫోన్స్ కోసం తయారు చేస్తుంది, లేటెస్ట్ A13 బయోనిక్ చిప్ కొత్త ఆపిల్ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో వుంది.

Slide 8 - స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

అనుకూల చిట్కా

 

ఈ  ప్రాసెసర్ల విషయానికి వచ్చినపుడు, పేరులో కనబడే ఉన్నత సంఖ్య దాని అధిక పనితీరును సూచిస్తుంది. ఉదాహరణకు, స్నాప్ డ్రాగన్ 845 స్నాప్ డ్రాగన్ 660 కంటే మెరుగైనది,అలాగే స్నాప్ డ్రాగన్ 660 స్నాప్ డ్రాగన్ 450 కంటే ఉత్తమం.

Slide 9 - స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

ప్రాసెసర్ ఫీచర్స్

 

ప్రతి ప్రాసెసర్ ఒక వివరణను కలిగి ఉంది, ఇందులో వారు అమలు చేసిన క్లాక్ లతో పాటు ఈ చిప్ కలిగి ఉన్న కోర్ల సంఖ్యను సూచిస్తుంది . సాధారణంగా, ఇది "1.4GHz ఆక్టా కోర్ ప్రాసెసర్" లేదా "2.0GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్" లాగా ఉంటుంది. అధిక కోర్ సంఖ్య ఎప్పుడూ మంచి పనితీరుకు దారితీయకపోయినా, అధిక క్లాక్ స్పీడ్ దాదాపు ఎల్లప్పుడూ అధిక పర్ఫార్మెన్క్స్ నమోదు చేస్తుంది.

Slide 10 - స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

Cores

 

ప్రయోజనం: మరింత కోర్లు  = అధిక పనితీరు.

Slide 11 - స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

అసలు విషయం ఏమిటి ?

 

కోర్లు, ఇవి ప్రాసెసర్ యొక్క కండరములు లాగా ఉంటాయి.  మరింత కోర్ల సంఖ్య, మరింత శక్తివంతమైన ప్రాసెసర్ పనితీరు చూపుతుంది. కాబట్టి, ఆక్టా (8)  కోర్ సాధారణంగానే క్వాడ్(4) -కోర్  కంటే మరింత శక్తివంతంగా ఉంటాయి, ఇవి డ్యూయల్(2) - కోర్ కంటే మరింత శక్తివంతమైనవి. ప్రాసెసర్లకు వాటిలో స్థిరమైన సంఖ్యలో కోర్లు ఉన్నాయి మరియు ఇది మీరు మార్చగలిగేది కాదు. కానీ, మీరు ఒక ఫోన్ కొనుగోలు సమయంలో ఎక్కువ లేదా తక్కువ కోర్ల ఎంపికగా ఎంచుకోవచ్చు.

Slide 12 - స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

అవాస్తవము మరియు అపోహ

 

ఎల్లప్పుడూ అత్యధిక సంఖ్యలో ఉన్న ఒక ప్రాసెసర్ కోసం వెతకడం మంచిది.  

Slide 13 - స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

మరి నిజమేమిటి ? 

 

మీరు ప్రత్యేకించి భారీ గేమ్స్ లాంటివి ఆడే సమయాలలో తప్ప, మీకు ఎల్లప్పుడు అత్యధిక నంబర్ ప్రాసెసర్ అవసరం ఉండక పోవచ్చు.

Slide 14 - స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

Clock-Speed

 

ప్రయోజనం: వేగవంతమైన ఈ Clock-Speed, మీరు కోరుకునే మంచి పర్ఫార్మెన్స్ పొందుతారు.

Slide 15 - స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

అసలు విషయం ఏమిటి?

 

క్లాక్ వేగం అంటే మీ ప్రాసెసర్ చేయగల పని వేగం ఎంత ఉంటుంది అనే విషయం గురుంచి వివరిస్తుంది. ఇది సాధారణంగా GHz గా చెబుతారు మరియు దీని అధిక సంఖ్యని, మీ ప్రాసెసర్ వేగంగా కొలుస్తారు. ఈ రోజుల్లో, ప్రాసెసర్ల యొక్క అత్యధిక క్లాక్ - వేగం 3.1 GHz టాప్-ఆఫ్-లైన్ గా చెప్పవచ్చు.

Slide 16 - స్మార్ట్ ఫోన్ కొనడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు

గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)

 

గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా GPU, మీ గేమింగ్ పనితీరు వంటి మీ ఫోన్ పనితీరులలో భాగంగా బాధ్యత వహిస్తుంది. GPU ప్రాసెసర్ యొక్క ఒక భాగం మరియు మీరు స్మార్ట్ ఫోన్ కోసం GPU ఎంచుకొవడం గురించి బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ స్మార్ట్ ఫోన్ ఎంచుకునేప్పుడు ఇది మీ ఎంపికలో భాగంగా వుండదు. సామాన్యంగా,  మొబైల్ ప్రాసెసర్లు తమ పనితీరును పూర్తి చేసే GPU లతో పాటుగా వస్తాయి. కాబట్టి, మీ CPU లో GPU ఉన్నస్థితిని మరియు దాని గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status