ఇండియాలో రూ.15,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Nov 10 2020
Slide 1 - ఇండియాలో రూ.15,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

ఇండియాలో ప్రస్తుతం రూ.15,000 కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్ ఫోన్లు అద్భుతమైన పనితీరును అందించగలవు. ముఖ్యంగా, కెమెరా పరంగా మంచి రిజల్యూషన్ గల ఫోటోలతో పాటుగా వేగవతమైన బ్రౌజింగ్ మరియు మల్టి టాస్కింగ్ పనులలో ఎటువంటి ల్యాగ్ ఉండదు. అధనంగా, భారీ గేమ్స్ ను కూడా చక్కగా హ్యాండిల్ చేయగవు. వాస్తవానికి, ఇండియాలో ఎక్కువ మంది ఈ విభాగంలోని ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఎంచుకోవడానికి ఇష్టపడతారు. మరి అటువంటి ఈ బెస్ట్ బడ్జెట్ విభాగంలో టాప్ 10 స్మార్ట్ ఫోన్ల గురించి చూద్దాం  

Slide 2 - ఇండియాలో రూ.15,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

Realme 7

రియల్ ‌మీ 7 లో ఒక పెద్ద 6.5-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే 90Hz అధిక రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ తో వస్తుంది. రియల్ మీ 7 ను MediaTek Helio G95 ప్రాసెసర్ ఆక్టా-కోర్ CPU  మరియు మాలి-జి 76 GPU తో కలిగి ఉంది. ఇది 6GB / 8GB RAM మరియు 64GB / 128GB స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. ఈ ఫోన్ Realme UI లో నడుస్తుంది. Realme 7 వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో ఎఫ్ / 1.8 ఎపర్చరు గల ప్రాధమిక  64MP కెమెరాతో అదికూడా Sony IMX682 సెన్సార్, 8 ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా 119-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్- వ్యూ, B&W  పోర్ట్రెయిట్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి వుంటుంది. అయితే ముందు భాగంలో మీకు ఎఫ్‌ / 2.0 ఎపర్చర్‌తో 16 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. 

Slide 3 - ఇండియాలో రూ.15,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

Poco M2 Pro

Poco M2 Pro స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720 జి ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్  ఎంపికలతో జతచేయబడుతుంది. పోకో M2 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్తో వస్తుంది, దీనిలో  48MP + 8MP + 5MP + 2MP కెమెరా సెటప్ వుంది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో పంచ్-హోల్ కటౌట్ లోపల 16 MP  సెల్ఫీ కెమెరా ఉంది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది.

Slide 4 - ఇండియాలో రూ.15,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

Redmi Note 9 Pro

ఈ రెడ్మి నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోను, ఒక 6.67 అంగుళాల పరిమాణంగల డాట్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది 2400x1080 పిక్సెళ్ళు అంటే FHD+ రిజల్యూషన్ తో వస్తుంది మరియు గరిష్టంగా 450 నిట్స్ బ్రైట్నెస్ అందిచే సామర్ధ్యంతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్,  కొత్త ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 720G SoC శక్తితో పనిచేస్తుంది. ఇది 8nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది మరియు వేగంగా పనిచేస్తుంది. ఇది 618GPU తో వస్తుంది కాబట్టి గ్రాఫిక్స్ బాగా అనిపిస్తాయి రెడ్మి నోట్ 9 ప్రో వెనుక 48MP+8MP+5MP+2MP గల క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ముందు రెడ్మి నోట్ 9 ప్రో ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమేరాని అందించింది.

Slide 5 - ఇండియాలో రూ.15,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

Realme Narzo 10

రియల్‌మి నార్జో ఒక 6.5-అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంది మరియు వాటర్‌డ్రాప్ నాచ్‌తో తీసుకురాబడింది మరియు ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3 తో ప్యాక్ చేసింది. ఈ ఫోన్ ఒక మీడియా టెక్ హెలియో జి 80 చిప్‌సెట్ ఆక్టా-కోర్ CPU మరియు మాలి-జి 52 GPU తో జత చేస్తుంది. ఈ ఫోన్ 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ తో వస్తుంది. నార్జో ఒక 48MP +8MP + 2MP + 2 MP క్వాడ్ కెమెరా సెటప్‌తో వచ్చింది. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.ఫోన్ కనెక్టివిటీ కోసం USB టైప్-సి పోర్ట్ కలిగి ఉంది మరియు ఇది 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోనుకు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వబడింది.

Slide 6 - ఇండియాలో రూ.15,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

Redmi Note 9

షియోమి రెడ్ మీ నోట్ 9 ఒక 6.53-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంది. మెరుగైన పనితీరు కోసం మీడియాటెక్ Helio G 85 ప్రాసెసర్‌ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారితమైన MIUI 11 ఆపరేటింగ్ సిస్టమ్ ‌లో పనిచేస్తుంది. ఇందులో, 48 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ ISOCELL సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్-లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ వంటి కెమేరాలు ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ రెడ్ మీ నోట్ 9 లో 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీని పొందుతారు, ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుంది.

Slide 7 - ఇండియాలో రూ.15,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

Realme 6i

రియల్ మీ 6i 90Hz డిస్ప్లే తో అందుబాటులో వున్న సరసమైన స్మార్ట్ ఫోన్లలో ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్, మీడియా టెక్ హీలియో G90T ప్రాసెసర్ వెనుక 48MP క్వాడ్ కెమెరా సెటప్ తో ట్రెండీగా వుంటుంది. పెద్ద 5000 mAh బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో డబ్బుకు తగిన విలువనిచ్చే స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది.

Slide 8 - ఇండియాలో రూ.15,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

Redmi Note 8

రెడ్మి నోట్ 8  ఒక 6.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో కూడా ఇది గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. అదనంగా, ఇందులో 2.0Ghz క్లాక్ స్పీడ్ అందించగల ఒక స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ చిప్‌సెట్‌ తో వచ్చింది. రెడ్మి నోట్ 8 మొబైల్ ఫోనులో 48MP + 8MP +2MP +2MP క్వాడ్ కెమెరాతో వస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 13MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, 18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా బాక్స్ లోనే ఒక 18W చార్జరుతో వస్తుంది.

Slide 9 - ఇండియాలో రూ.15,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

Redmi 9 Prime

షియోమి రెడ్‌మి 9 ప్రైమ్ ‌లో సెల్ఫీ కెమెరా కోసం వాటర్ ‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో ఒక 6.53-అంగుళాల FHD + (2340 x 1080 పిక్సెల్స్) డిస్ప్లే ఉంది.  ఈ ఫోన్ కొత్త ఆరా 360 డిజైన్‌ తో అలల ఆకృతితో వస్తుంది, ఇది గ్రిప్పిగా చేస్తుంది. ఇది మీడియా టెక్ హెలియో G 80 చిప్ ‌సెట్ ‌తో ఆక్టా-కోర్ సిపియు మరియు మాలి-జి 52 జిపియుతో పనిచేస్తుంది మరియు ఇది ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన MIUI 12 పై నడుస్తుంది.రెడ్‌మి 9 క్వాడ్-కెమెరా సెటప్‌ని  కలిగి ఉంది, ఇందులో 13 MP +8 MP + 5MP + 2MP సెటప్ ఉన్నాయి. . ముందు వైపు, వాటర్‌ డ్రాప్ నాచ్ కటౌట్ లోపల 8MP సెల్ఫీ కెమెరా ఉంది. 9 ప్రైమ్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతుతో 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

Slide 10 - ఇండియాలో రూ.15,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

Samsung Galaxy M30s

శామ్సంగ్ గెలాక్సీ M30 s స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.44 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ - U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది గరిష్టంగా 2.3GHz క్లాక్ స్పీడ్ అందించగల ఒక ఎక్సినోస్ 9611 ఆక్టా కోర్ ప్రొసెసరు యొక్క శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 10 పైన ఆధారితంగా One UI శామ్సంగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక అతిభారీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది.

వెనుక భాగంలో 48MP +8MP+5MP ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో f/2.0 ఎపర్చరు గల 48MP ప్రధాన కెమరా   మరియు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కి జతగా 5MP డెప్త్ సెన్సార్ ని అందించింది.

Slide 11 - ఇండియాలో రూ.15,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

Samsung Galaxy M21

శామ్సంగ్ గెలాక్సీ M21 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.44 అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ - U డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది గరిష్టంగా 2.3GHz క్లాక్ స్పీడ్ అందించగల ఒక ఎక్సినోస్ 9611 ఆక్టా కోర్ ప్రొసెసరు యొక్క శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 10 పైన ఆధారితంగా One UI శామ్సంగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక అతిభారీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 64GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 48MP +8MP+5MP ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status