కొత్త టెక్నాలజీతో వచ్చిన లేటెస్ట్ మరియు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Jul 25 2019
కొత్త టెక్నాలజీతో వచ్చిన లేటెస్ట్ మరియు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

2019 మొదటి అర్ధభాగంలో, భారతదేశంలో అనేక స్మార్ట్ ఫోన్లు ప్రారంభించబడ్డాయి మరియు ఈ స్మార్ట్‌ ఫోన్లు వేర్వేరు ధరలలో వేరువేరు విభాగాలలో వచ్చి వాటి ప్రజాదరణను కొనసాగిస్తున్నాయి. ఈ రోజు మేము, ఇటీవల భారతదేశంలో విడుదలైన తాజా మరియు బెస్ట్ స్మార్ట్‌ ఫోన్ల యొక్క ప్రత్యేకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను అందిస్తున్నాము. ఈ జాబితాలో వన్‌ప్లస్, షావోమీ, రియల్మీ, ఒప్పో మొదలైన అన్ని ప్రధాన కంపెనీల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.

కొత్త టెక్నాలజీతో వచ్చిన లేటెస్ట్ మరియు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

REDMI 7A 

ఈ ఫోన్ ఒక 5.45-అంగుళాల ఐపిఎస్ ఎల్సిడి డిస్ప్లే ను కలిగి ఉంది, ఇది 18: 9 ఆస్పెక్ట్ రేషియాతో, ఇది HD + రిజల్యూషన్ అందిస్తుంది. ఈ రెడ్మి 7ఎ ఫోనుకు వెనుక పాలికార్బోనేట్తో ఇవ్వబడింది మరియు స్ప్లాష్ ప్రూఫ్ గా చేయడానికి పి 2 ఐ నానో-పూత ఇవ్వబడింది. ఈ షావోమి రెడ్మి 7A  ఆండ్రోయిడ్ 9 పై ఆధారంగా MIUI 10 తో లాంచ్ చేశారు. రెడ్మి 7A ను స్నాప్‌డ్రాగన్ 439 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో లాంచ్ చేశారు, ఇది 2.0GHz వద్ద క్లాక్ చేయబడింది.

కొత్త టెక్నాలజీతో వచ్చిన లేటెస్ట్ మరియు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

REDMI NOTE 7 PRO 

షావోమి యొక్క ఈ రెడ్మి నోట్ 7 ప్రో గురించి మాట్లాడితే, ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 19.5: 9 ఆస్పెక్ట్ రేషియో మరియు డాట్ నోచ్ డిజనుతో ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క రక్షణ ఇవ్వబడింది మరియు ఈ ఫోన్ ఒక  రిఫ్లెక్టివ్ గ్లాస్ డిజైన్‌తో వచ్చింది. ఈ రెడ్మి నోట్ 7 ప్రో ఒక క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రాసెసరుతో ప్రారంభించబడింది, ఇది కైరో 460 ఆక్టా-కోర్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అడ్రినో 612 GPU తో జత చేయబడింది. ఈ బడ్జెట్ ధరలో ఒక 48MP SONY IMX586 సెన్సార్ కెమెరాతో వచ్చిన మొదటి ఫోన్. 

కొత్త టెక్నాలజీతో వచ్చిన లేటెస్ట్ మరియు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

REALME 3 PRO 

రియల్మీ 3 ప్రో లో, మీరు ఒక FHD +, 2340 X 1080p పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.3-అంగుళాల డ్యూ - డ్రాప్ నోచ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్  యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో రక్షించబడింది. ఈ రియల్మీ 3 ప్రో ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు జిపియు అడ్రినో 616 లతో ప్రారంభించబడింది, ఈ చిప్‌సెట్ X 15 మోడెమ్‌తో చాలా స్మూత్ కాలింగ్ అందిస్తుంది మరియు 4 K HDR  ప్లేబ్యాక్‌కు మద్దతు ఇస్తుంది. గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి హైపర్ బూట్ 2.0 ఇందులో చేర్చబడింది. ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే, ఇందులో ఒక 4045mah బ్యాటరీని ఒక CABC మోడ్‌తో మద్దతు ఇస్తుంది, దీని ద్వారా బ్యాటరీ జీవితాన్ని 10% వరకు పెంచవచ్చు.      

కొత్త టెక్నాలజీతో వచ్చిన లేటెస్ట్ మరియు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

REALME X 

ఈ రియల్మీ X  స్మార్ట్ ఫోన్, తాజాగా భారతదేశంలో లాంచ్ చేయబడింది, ఈ మొబైల్ ఫోన్‌లో మీకు ఒక 6.53-అంగుళాల FHD + స్క్రీన్ లభిస్తోంది, ఇది 19.5: 9 ఆస్పెక్ట్ రేషియాతో ఉంటుంది. ఇది కాకుండా, మీకు 16 MP  సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉన్నాయి, అలాగే ఫోన్‌లో డిస్ప్లేలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే, ఇందులో ఒక 5MP సెకండరీ కెమెరాతో జతగా 48MP SONY IMX546  సెన్సార్‌ను కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాని పొందుతారు. ఈ మొబైల్ ఫోన్ మీకు ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710 చిప్‌సెట్‌ తో వస్తుంది. ఇది భారతదేశంలో రెండు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

కొత్త టెక్నాలజీతో వచ్చిన లేటెస్ట్ మరియు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

VIVO Z1 PRO

ఈ వివో Z1 ప్రో, డిస్ప్లే లోపల ఒక పంచ్ హోల్ డిజైనుతో ఒక 90.77 స్క్రీన్ టూ బాడీ రేషియాతో  2340x1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోను ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.3 క్లాక్ స్పీడ్ అందించగల ఒక 10nm finfit కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది.

కొత్త టెక్నాలజీతో వచ్చిన లేటెస్ట్ మరియు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

REDMI K20 

షావోమి తన రెడ్మి K20 ప్రో స్మార్ట్ ఫోనుతో పాటుగా రెడ్మి K20 స్మార్ట్ ఫోన్ను కూడా ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్, ఒక క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 730 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు 48MP ట్రిపుల్ రియర్ కెమేరాతో విడుదల చేసింది. ఈ కెమెరాలో అందించిన టెలిఫోటో కెమేరాతో 2X ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు మరిన్ని ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్ మొదటి సేల్ జులై 22 వ తేది మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది. 

కొత్త టెక్నాలజీతో వచ్చిన లేటెస్ట్ మరియు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

MOTOROLA ONE VISION  

ఈ మోటరోలా వన్ విజన్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడితే, ఈ మోటరోలా వన్ విజన్లో, మీరు ఒక 21: 9 సినిమావిజన్ ఆస్పెక్ట్ రేషియో కలిగినటువంటి ఒక  6.3-అంగుళాల FHD + (1080 x 2520 పిక్సెల్స్) డిస్ప్లేని పొందుతారు. అలాగే, ఇది ఒక [పంచ్ హోల్ డిజైనుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్‌ కి జతగా  2.2GHz ఆక్టా-కోర్ శామ్‌సంగ్ ఎక్సినోస్ 9609 SoC తో వస్తుంది. అలాగే, ఇది కూడా ఒక ప్రధాన 48MP కేమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాతో వస్తుంది. 

కొత్త టెక్నాలజీతో వచ్చిన లేటెస్ట్ మరియు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

OPPO F11 PRO 

ఈ OPPO F11 Pro ఒక పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో  వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్  ఒక 6.5-అంగుళాల FHD + రిజల్యూషన్ అందించగల డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒక 90.6 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ యునిబాడీ డిజైన్‌తో వస్తుంది మరియు దాని వెనుక ప్యానెల్ గ్లాస్ ఫినిష్‌తో పాలికార్బోనేట్‌తో తయారు చేయబడింది. ఈ ఒప్పో ఎఫ్ 11 ప్రోలో ఒక 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చింది. ఈ ఎఫ్ 11 ప్రో ఒక మీడియాటెక్ హెలియో P70 ప్రోసెసర్, అలాగే 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ తో ఉంటుంది.

కొత్త టెక్నాలజీతో వచ్చిన లేటెస్ట్ మరియు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

REDMI K20 PRO

 షావోమి తన రెడ్మి K20 ప్రో స్మార్ట్ ఫోన్ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్, ఒక క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు 48MP ట్రిపుల్ రియర్ కెమేరాతో విడుదల చేసింది. ఈ కెమెరాలో అందించిన టెలిఫోటో కెమేరాతో 2X ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు మరిన్ని ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. మొదటి సేల్ 22 జూలై మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది 

కొత్త టెక్నాలజీతో వచ్చిన లేటెస్ట్ మరియు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

ONEPLUS 7 PRO  


 ఈ ఫోన్ ఒక 5.99-అంగుళాల P- OLED డిస్ప్లేని కలిగి ఉంది మరియు ఈ డిస్ప్లే 2K రిజల్యూషన్ అందిస్తుంది మరియు 18: 9 ఆస్పెక్ట్ రేషియాతో ఇవ్వబదిండి   మరియు ఈ డిస్ప్లే HDR10 సర్టిఫికేట్ పొందింది. నీరు మరియు ధూళి నిరోధకత కోసం ఈ ఫోనుకు IP67 రేటింగ్ ఇవ్వబడింది మరియు ఈ ఫోన్ యొక్క డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ ఇవ్వబడింది. ఇన్ డిస్ప్లే వేలిముద్ర సెన్సార్ మరియు AI ఆధారిత ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా అందించబడింది. ఈ పరికరాన్ని 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకువచ్చారు మరియు ఈ ఫోన్‌లో 3320 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది క్విక్ ఛార్జ్ 3 కి మద్దతు ఇస్తుంది మరియు దీనికి 10W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. పరికర స్టాక్ Android 9 పై ఆధారంగా ఉంటుంది.

కొత్త టెక్నాలజీతో వచ్చిన లేటెస్ట్ మరియు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

ASUS 6Z 

ఈ అసూస్ 6 జెడ్, ఒక 6.4 అంగుళాల పూర్తి HD + IPS డిస్ప్లేతో అవస్తుంది, ఇది 1080x2340 పిక్సెల్స్ మరియు 19.5: 9 ఆస్పెక్ట్ రేషియాతో మరియు 92 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఒక ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 SoC కలిగి ఉంది, ఇది 8GB RAM మరియు అడ్రినో 640 GPU తో పరిచయం చేయబడింది. ఇక కెమెరా విషయానికొస్తే, ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వబడింది, దీనిలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంది, దీని ఎపర్చరు ఎఫ్ / 1.79 మరియు ఇది డ్యూయల్ ఎల్ఇడి ఫ్లాష్‌తో రెట్టింపు అవుతుంది, సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్స్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్. 

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements